ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా చల్లపల్లి మండలంలోని పెదకళ్లేపల్లి గ్రామానికి చెందిన దోనే బాబురావు వ్యక్తి ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుదాఘాతంతో మంటలు చెలరేగాయని బాధితులు తెలిపారు. ఉన్న ఒక్కగానొక్క ఆధారం మంటల్లో బూడిదైందంటూ.. బాధితులు ఆవేదన చెందారు.ఈ ప్రమాదంలో సుమారు రూ.80 వేల ఆస్తినష్టం జరిగినట్లు అగ్నిమాపక అధికారి ప్రాథమికంగా పేర్కొన్నారు.
విద్యుద్ఘాతంతో మంటలు.. ఇళ్లు, గడ్డివాము దగ్ధం - telangana news
ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో జరిగిన వరుస అగ్ని ప్రమాదాలు స్థానికులను భయాందోళనకు గురి చేశాయి. ఒక చోట విద్యుద్ఘాతంతో ఓ ఇల్లు పూర్తిగా దగ్ధమవ్వగా మరోచోట 3 ఎకరాల గడ్డివాము బూడిదైంది. ఈ ప్రమాదాల్లో సుమారు రూ.95 వేల మేర ఆస్థినష్టం జరిగినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు అంచనా వేశారు.
విద్యుదాఘాతంతో మంటలు.. ఇళ్లు, గడ్డివాము దగ్ధం
జిల్లాలోని మోపిదేవి మండలం నాగాయతిప్ప గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో బొల్లిముంత శ్రీనివాసరావు అనే రైతుకు చెందిన 3 ఎకరాల గడ్డివాము పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో రూ.15 వేలు నష్టం జరిగిందని అవనిగడ్డ అగ్నిమాపక సిబ్బంది బాలమురళి కృష్ణ ప్రాథమికంగా అంచనా వేశారు.
ఇదీ చూడండి:అభివృద్ధి పనులకు కేటీఆర్ శ్రీకారం.. కార్యక్రమంలో ఉద్రిక్తత