తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రభుత్వ పథకాలకు కేసీఆర్​ పేరెందుకు: బూర నర్సయ్య గౌడ్ - Bura Narasaiah gowd press meet

Bura Narasaiah gowd comments on Government: ప్రభుత్వ పథకాలకు కేసీఆర్​ పేరు పట్టడం ఏంటని మాజీ ఎంపీ బీజేపీ నేత బూర నర్యయ్య గౌడ్​ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బీఆర్​ఎస్​ కేవలం ఒక కుటుంబం కోసమే అని అన్నారు. ఇతర పార్టీలకు చెందిన కొంత మంది నాయకులు బీజేపీలో చేరారని తెలిపారు.

బూర నర్సయ్య గౌడ్
ప్రభుత్వ పథకాలకు కేసీఆర్​ పేరు పెట్టడం ఏమిటి

By

Published : Dec 23, 2022, 6:55 PM IST

Updated : Dec 23, 2022, 8:19 PM IST

Boora Narsaiah Comments on KCR : ఉపాధి హామీ పథకం తెలంగాణ ప్రభుత్వానికి అక్షయ పాత్రగా మారిందని మాజీ ఎంపీ, బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ అన్నారు. రైతు కల్లాలు ఎక్కడ ఉన్నాయన్న ఆయన.. బిల్లులు ఎత్తుకుని చట్ట వ్యతిరేకంగా వాడారని విమర్శించారు. కల్లాల పేరుతో బీఆర్ఎస్ నేతలు తిన్నది అడిగితే.. కేంద్రం రైతు వ్యతిరేకమని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ పథకాలకు కేసీఆర్ అని పేరు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. కేంద్రం ఏ పథకం పెట్టినా ప్రధానమంత్రి అని పెడుతుందని చెప్పారు. తెలంగాణ తల్లి పేరు మీద న్యూట్రిషన్​ కిట్ పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.

బీఆర్ఎస్​లో కేవలం ఒక కుటుంబం కోసమే రాజకీయ వెట్టి చాకిరీ ఉంటుందని.. కేసీఆర్ మత్తు నుంచి సర్పంచ్​లు, ఎంపీటీసీలు బయటకు రావాలని సూచించారు. సామాన్య కార్యకర్త కూడా ఉన్నత పదవులు పొందే అవకాశం కేవలం బీజేపీలోనే సాధ్యం అన్నారు. ఇతర పార్టీలకు చెందిన పలువురు బూర నర్సయ్య గౌడ్​ సమక్షంలో బీజేపీలో చేరారు.

"బీఆర్​ఎస్​ పార్టీలో కేవలం రాజకీయ వెట్టి చాకిరీ మాత్రమే ఉంటుంది. 12600 సర్పంచ్​లు, 8000 ఎంపీటీసీలు, 129 మున్సిపల్​ ఛైర్మన్​లు, కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు మనం అందరం ఒక కుటుంబానికి వెట్టి చాకిరీ చేస్తున్నాం. రైతులు కల్లాలు లేక రోడ్లపై కుప్పల కుప్పల ధాన్యం ఎండపెడుతున్నారు. జిల్లాకి 10 కల్లాలైన ఉన్నాయా?"-బూర నర్యయ్య గౌడ్​ , మాజీ ఎంపీ, బీజేపీ నేత

ప్రభుత్వ పథకాలకు కేసీఆర్​ పేరెందుకు: బూర నర్సయ్య గౌడ్

ఇవీ చదవండి:

Last Updated : Dec 23, 2022, 8:19 PM IST

ABOUT THE AUTHOR

...view details