తెలంగాణ

telangana

ETV Bharat / state

పాతబస్తీలోని గణనాథులను దర్శించుకున్న బండి సంజయ్​ - బండి సంజయ్ తాజా వార్తలు

పాతబస్తీలోని గణనాథులను భాజపా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్​ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Bundy Sanjay visiting the enumerators in the old town Send fe
పాతబస్తీలోని గణనాథులను దర్శించుకున్న బండి సంజయ్​

By

Published : Aug 30, 2020, 9:06 AM IST

హైదరాబాద్ పాతబస్తీలో గణేశ్​ మండపాలను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా చంపాపేట్, సైదాబాద్, కుర్మగూడలలోని గణనాథులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రజలంతా భక్తి వాతావరణంలో నిర్వహించుకుంటుంటే.. రాష్ట్ర ప్రభుత్వం కరోనా కేసులను ఎక్కువగా చూపిస్తూ భయానకమైన వాతావరణాన్ని సృష్టిస్తోందని బండి విమర్శించారు. హిందువుల పండుగలు జరుపుకోకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం తన తీరును మార్చుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో పలువురు స్థానిక నేతలు పాల్గొన్నారు.

ఇదీచూడండి.. త్వరలో కేబినెట్​ భేటీ... పలు కీలక అంశాలపై చర్చ

ABOUT THE AUTHOR

...view details