శ్రీశైలం భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో రాత్రి చోటు చేసుకున్న అగ్నిప్రమాదం పట్ల భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో పలువురు ఉద్యోగులు భూగర్భంలోనే చిక్కుకుపోవడం ఆందోళన కలిగిస్తుందన్నారు. వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలి: బండి సంజయ్
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీశైలం అగ్ని ప్రమాద ఘటనపై దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. భూగర్భంలో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఈ ఘటనలో గాయపడిన క్షతగాత్రులకు ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రమాదంపై విచారణ జరిపించి కారణాలను అన్వేషించాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన భద్రతా చర్యలు చేపట్టాలని కోరారు. రాష్ట్ర సాగునీరు, విద్యుత్ అవసరాలు తీర్చే శ్రీశైలం జలాశయం లాంటి సున్నితమైన, అత్యంత ప్రాధాన్యమైన ప్రాంతాల భద్రతపై ఎలాంటి ఉదాసీనత దరి చేరనీయకూడదని రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు.
ఇదీ చూడండి 'నాన్నా జాగ్రత్త.. ముద్దివ్వొద్దు, ముట్టుకోవద్దు!'