బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ కల్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు నగరంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. అమ్మవారికి మొక్కులు సమర్పించుకున్నారు. మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్.. ప్రభుత్వం తరఫున ఎల్లమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా కల్యాణ వేడుకను నిర్వహించారు.
హైదరాబాద్‌లో ప్రసిద్ధ బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం వైభవంగా సాగింది. ఎల్లమ్మ అమ్మవారికి ప్రభుత్వం తరఫున దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పట్టు వస్త్రాలను సమర్పించారు. ఎల్లమ్మ అమ్మవారికి శివసత్తులు పుట్ట బంగారాన్ని సమర్పించారు. అమ్మవారి కల్యాణాన్ని తిలకించేందుకు మంత్రులు కుటుంబ సమేతంగా వచ్చారు. గతేడాది కరోనా కారణంగా ఆలయం లోపలే కల్యాణం నిర్వహించారు. కొవిడ్ కాస్త తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో.. ఈసారి ప్రభుత్వం.. ఆలయ బయట భారీ ఏర్పాట్లు చేసింది.