హైదరాబాద్ గచ్చిబౌలి డివిజన్ గోపన్పల్లి తండాలో స్వల్ప ఉద్రిక్తత తలెత్తింది. జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారులు గోపన్పల్లి నుంచి తేల్లాపూర్ రోడ్డు విస్తరణలో భాగంగా భవనాల కూల్చివేతలు చేపట్టారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే అధికారులు భవనాలు కూలుస్తున్నారని స్థానికులు ఆందోళనకు దిగారు.
Demolitions: గోపన్పల్లి తండాలో భవనాల కూల్చివేత.. బాధితుల ఆందోళన - demolitions in gopanpally thanda
హైదరాబాద్ గచ్చిబౌలి డివిజన్లో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా అధికారులు భవనాల కూల్చివేత చేపట్టారు. నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారంటూ బాధితులు ఆందోళన చేపట్టారు.
గోపన్పల్లి తండాలో భవనాల కూల్చివేత
ఆందోళన జరుగుతుండగా గచ్చిబౌలి డివిజన్ భాజపా కార్పొరేటర్ ఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు అండగా నిలిచారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ఎలా కూలుస్తారని అధికారులను ప్రశ్నించారు. అధికారులు మాత్రం 2017లోనే నోటీసులు ఇచ్చామని సమాధానమిచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
ఇదీ చదవండి:Govt schools in Telangana: బడుల బాగుకు ఎమ్మెల్యే నిధులు.. యోచిస్తున్న ప్రభుత్వం!