విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ... తెలంగాణ జన సమితి పార్టీ విద్యార్థి విభాగం హైదరాబాద్లో ఆందోళనకు దిగింది. ర్యాలీగా వచ్చిన విద్యార్థులు లక్డీకాపూల్లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముందు బైఠాయించారు. ఎంత సేపటికి అధికారులు స్పందించకపోవడం వల్ల కార్యాలయం లోపలికి చొచ్చుకుపోయే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని బలవంతంగా అరెస్టు చేయగా... ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజులను నియంత్రించాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, అధ్యాపకుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సచివాలయం, అసెంబ్లీ భవనాలు కాకుండా సంక్షేమ వసతి గృహాలు, గురుకులాలకు సొంత భవనాలను నిర్మించాలని డిమాండ్ వారు చేశారు.
'సచివాలయం, అసెంబ్లీ కాదు విద్యాసంస్థలు నిర్మించండి' - తెలంగాణ జన సమితి
లక్డీకాపూల్లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముందు విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ... తెలంగాణ జన సమితి పార్టీ విద్యార్థి విభాగం ఆందోళనకు దిగింది.
ఆందోళన