రాష్ట్ర వార్షిక బడ్జెట్ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరానికి వార్షిక పద్దును ఆమోదించేందుకు శాసనసభ, మండలి కొలువుదీరనున్నాయి. ఇవాళ ఉదయం 11 గంటలకు రెండు సభలు సమావేశమవుతాయి. సంప్రదాయం ప్రకారం గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమవుతాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అసెంబ్లీ సమావేశ మందిరంలో ప్రసంగిస్తారు. తొలిరోజు సభ కేవలం గవర్నర్ ప్రసంగానికి మాత్రమే పరిమితమవుతుంది. ఆ తర్వాత బడ్జెట్ సమావేశాల ఎజెండాను ఖరారు చేస్తారు.
12రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు!
ఇందుకోసం రెండు సభల సభా వ్యవహారాల సలహాసంఘాలు సమావేశమవుతాయి. సభాపతి, మండలి చైర్మన్ అధ్యక్షతన జరిగే బీఏసీ సమావేశాల్లో బడ్జెట్ సమావేశాలు జరిగే తేదీలు, సమావేశాల నిర్వహణ, చర్చించాల్సిన, అమోదించాల్సిన అంశాలు, బిల్లులను ఖరారు చేస్తారు. పది నుంచి 12 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల మరణించిన నాగార్జునసాగర్ శాసనసభ్యులు దివంగత నోముల నర్సింహయ్యకు ఈ నెల 16న శాసనసభ సంతాపం తెలపనుంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఈ నెల 17న చర్చ, ప్రభుత్వ సమాధానం ఉండే అవకాశం ఉంది.
18న బడ్జెట్!