తెలంగాణ

telangana

ETV Bharat / state

'పన్నుల విధానాల్లో.. పెద్దగా మార్పు లేదు' - latest news on Budget: No changes in tax policies

బడ్జెట్​లో పన్నుల విధానాల్లో పెద్దగా మార్పులేదని ప్రత్యక్ష పన్నుల నిపుణులు సాంబశివరావు పేర్కొన్నారు. బడ్జెట్​లో మరింత కసరత్తు చేయాల్సిందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

Budget: No changes in tax policies
'పన్నుల విధానాల్లో పెద్దగా మార్పు లేదు'

By

Published : Feb 1, 2020, 9:27 PM IST

కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్​లో పన్నుల విధానాల్లో పెద్దగా మార్పు లేదని ప్రముఖ ప్రత్యక్ష పన్నుల నిపుణులు సాంబశివరావు పేర్కొన్నారు. మినహాయింపులు క్లెయిమ్ చేసుకోకుండా.. కొత్త విధానంలోకి వెళితే ఉద్యోగికి ప్రయోజనం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు.

మినహాయింపులు కొనసాగిస్తూ.. కొత్త శ్లాబులు ప్రవేశపెడితే లాభదాయకంగా ఉండేదని తెలిపారు. డివిడెంట్ డిస్ట్రిబ్యూషన్ పన్ను రద్దుతో సామాన్యుడి కన్నా.. కంపెనీలకే ఎక్కువ లాభం చేకూరుతుందన్నారు. ఆర్థిక స్థితిని గాడిన పెట్టేందుకు బడ్జెట్​లో మరింత కసరత్తు చేయాల్సిందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

'పన్నుల విధానాల్లో పెద్దగా మార్పు లేదు'

ఇవీచూడండి:బడ్జెట్​ 2020​ : నిర్మలమ్మ బడ్జెట్​ విశేషాలివే

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details