తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏప్రిల్‌ నుంచి కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసుల క్రమబద్ధీకరణ - employees news in telangana budget

budget for Telangana contract employees 2023 : కాంట్రాక్టు ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏప్రిల్‌ నుంచి కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసుల క్రమబద్ధీకరణ చేయనున్నట్లు తెలిపింది. దీంతో పాటు మరిన్ని ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

Regularization of services of contract employees from April
ఏప్రిల్‌ నుంచి కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసుల క్రమబద్ధీకరణ

By

Published : Feb 6, 2023, 2:19 PM IST

budget for Telangana contract employees 2023 : రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగులది కీలకమైన భాగస్వామ్యమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సమానంగా అంగన్ వాడీ, ఆశా, ఇంకా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఫిట్ మెంట్ ఇవ్వటం, దానిని ఏకకాలంలో వర్తింపచేయటం దేశంలోనే ప్రథమమని చెప్పారు. ఏప్రిల్‌ నుంచి కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరణ చేయనున్నట్లు వెల్లడించారు. సెర్ఫ్‌ ఉద్యోగుల పేస్కేల్‌ సవరణ చేయబోతున్నట్లు ప్రకటించారు.

‘ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తుల మేరకు కొత్త ఈహెచ్ ఎస్ విధానాన్ని ఈ ఆర్థిక సంవత్సరంలో తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో స్థానికులకు 60 నుంచి 80 శాతం వరకు మాత్రమే లోకల్ రిజర్వేషన్లు ఉండేది. ఇప్పుడు అమలు చేస్తున్న నూతన నియామక విధానంతో అటెండర్ నుంచి ఆర్డీవో దాకా స్థానికులకే 95 శాతం ఉద్యోగాలు లభిస్తాయి. కొత్త నియామకాలు ఈ పద్ధతిలోనే జరుగుతున్నాయి. ఇది తెలంగాణ ప్రభుత్వం సాధించిన చారిత్రాత్మక విజయం.' - హరీశ్ రావు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి

"2014 జూన్ నుంచి ఫిబ్రవరి 2022 దాకా ప్రత్యక్ష నియామక విధానం ద్వారా 1,61,572 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వీటిలో 1,41735 పోస్టుల ప్రక్రియ పూర్తయింది. కొత్త ఉద్యోగుల జీతభత్యాల కోసం ఈ బడ్జెట్‌లో రూ.1000 కోట్లు అదనంగా ప్రతిసాదిస్తున్నాం ఇచ్చిన మాటప్రకారం ఏప్రిల్‌ నుంచి కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరణ, సెర్ఫ్‌ ఉద్యోగుల పేస్కేల్‌ సవరణ చేయబోతున్నాం’’. అని హరీశ్ రావు తెలిపారు.

ఉద్యోగుల సంక్షేమం :

  1. 'రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగులది కీలకమైన భాగస్వామ్యం. పలు విభాగాలను పరిశీలిస్తే తెలంగాణ ఉద్యోగులు దేశంలోకెల్లా అత్యధిక వేతనాలు పొందుతున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కన్నా, ఇతర రాష్ట్రాల ఉద్యోగుల కన్నా మన ఉద్యోగులు మెరుగైన జీతభత్యాలు పొందుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సమానంగా అంగన్ వాడీ, ఆశా, ఇంకా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఫిట్ మెంట్ ఇవ్వటం, దానిని ఏకకాలంలో వర్తింపచేయటం దేశంలోనే ప్రథమం.
  2. కేంద్ర ప్రభుత్వం నిధులలో కోతలు పెడుతూ, అనేక ఆర్థిక ఆంక్షలు పెడుతున్నా, రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల కోసం పెద్ద ఎత్తున ఆర్థిక అవసరాలు ఉన్నా.. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయుల ప్రయోజనాల విషయంలో ఏనాడూ తక్కువ చేయలేదు.
  3. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తుల మేరకు కొత్త ఈహెచ్ ఎస్ విధానాన్ని ఈ ఆర్థిక సంవత్సరంలో తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ ను ఏర్పాటు చేసి ఇందులో ప్రభుత్వ ప్రతినిధులతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయలు, రిటైర్డ్ ఉద్యోగుల ప్రతినిధులను భాగస్వాములుగా చేస్తుంది. దీనికి సంబంధించిన విధి విధానాలను ప్రభుత్వం త్వరలోనే ప్రకటిస్తుంది.

భారీగా ఉద్యోగ నియామకాలు:

  • తెలంగాణలో 33 జిల్లాలు, 7 జోన్లు, రెండు మల్టీ జోన్లుగా ఉద్యోగ నియామకాల కోసం ఏర్పాటు చేసుకున్నాం. గతంలో స్థానికులకు 60 నుంచి 80 శాతం వరకు మాత్రమే లోకల్ రిజర్వేషన్లు ఉండేది. ఇప్పుడు అమలు చేస్తున్న నూతన నియామక విధానంతో అటెండర్ నుంచి ఆర్డీవో దాకా స్థానికులకే 95 శాతం ఉద్యోగాలు లభిస్తాయి. కొత్త నియామకాలు ఈ పద్ధతిలోనే జరుగుతున్నాయి. ఇది తెలంగాణ ప్రభుత్వం సాధించిన చారిత్రాత్మక విజయం.
  • 2014 జూన్ నుంచి ఫిబ్రవరి 2022 దాకా ప్రత్యక్ష నియామక విధానం ద్వారా 1,61,572 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వీటిలో 1,41,735 పోస్టుల ఎంపిక ప్రక్రియ పూర్తయింది. వీటితో పాటు కొత్తగా 2022 మార్చి నెలలో ముఖ్యమంత్రి కేసీఆర్ 80,039 పోస్టులను వివిధ క్యాటగిరీలలో భర్తీ చేస్తామని ప్రకటించారు. వీటి భర్తీ ప్రక్రియ చురుగ్గా కొనసాగుతోంది. కొత్తగా నియామకమయ్యే ఉద్యోగుల జీతభత్యాల కోసం ఈ బడ్జెట్‌లో వెయ్యి కోట్లు అదనంగా ప్రతిపాదిస్తున్నాం.
  • ఇచ్చిన మాట ప్రకారం ఏప్రిల్ నెల నుంచి కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసుల క్రమబద్దీకరణ, సెర్ఫ్ ఉద్యోగుల పేస్కేల్ సవరణ చేయబోతున్నామని' హరీశ్ రావు తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details