ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు బహుజన సమాజ్ పార్టీ మద్దతు ప్రకటించింది. 13 రోజులుగా వివిధ రూపాల్లో ఆందోళన చేస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టించుకోకపోడం దారుణమని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు సిద్ధార్థ పూలే అన్నారు. కార్మికులపై ఉక్కుపాదం మోపడం సరికాదన్నారు. సమస్యలపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడం వల్లే కార్మికులు సమ్మెకు దిగారని గుర్తు చేశారు. ప్రజల ఇబ్బందులు, 50 వేల మంది ఆర్టీసీ కార్మికుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని మనవతాదృక్పదంతో ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకోవాలన్నారు.
ఆర్టీసీ సమ్మెకు బీఎస్పీ మద్దతు - RTC strike in telangana
పదమూడు రోజులుగా ఆర్టీసీ చేస్తున్న సమ్మెకు బీఎస్పీ మద్దతు ప్రకటించింది. కార్మికులపై ఉక్కుపాదం మోపడాన్ని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సిద్ధార్థ పూలే ఖండించారు.
సిద్ధార్థ పూలే