కడప నుంచి ముగ్గురు వ్యక్తులు హైదరాబాద్కు వచ్చారు. సుల్తాన్ బజార్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ హోటల్లో దిగారు. అందులో సాయికుమార్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ఆధారాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. అతనితో వచ్చిన వారే హత్య చేశారా? ఇంకెవరైనా చంపారా? అనే కోణంలో విచారిస్తున్నారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
సుల్తాన్ బజార్లో దారుణ హత్య
హైదరాబాద్ సుల్తాన్ బజార్ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
సుల్తాన్ బజార్లో దారుణ హత్య