హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. సయీద్ నూర్ రాత్రి 8 గంటల ప్రాంతంలో ద్విచక్రవాహనంపై వెళుతుండగా ఎన్‌బీటీనగర్‌లోని ఆటో స్టాండ్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఆటోలో ఉన్న నలుగురు యువకులు అతనిపై కత్తులతో దాడికి పాల్పడ్డారు.
బంజారాహిల్స్‌లో వ్యక్తి దారుణ హత్య - బంజారాహిల్స్‌లో దారుణ హత్య
హైదరాబాద్‌లో వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. బంజారాహిల్స్ రోడ్‌నెంబర్ 12లో సయీద్ నూర్ అనే రౌడీ షీటర్‌ను దారుణంగా హతమర్చారు.
ముఖం, మెడ, ఛాతిపై దాడి చేశారు. హత్య చేసే సమయంలో నిందితుల చేతిలోని ఒక కత్తి విరిగిపోయింది. హత్య అనంతరం నలుగురు యువకులు నేరుగా బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయారు. ఘటనాస్థలంలో రెండు కత్తులు, ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంఘటన స్థలాన్ని వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్, బంజారాహిల్స్ ఏసీపీ కెఎస్ రావు, ఇన్‌స్పెక్టర్ కళింగరావు పరిశీలించారు. జరిగిన ఘటనపై స్థానికుల నుంచి వివరాలు సేకరించారు.
ఇదీ చూడండి: 'కేసీఆర్‌ది బార్ బచావో.. బార్ బడావో నినాదం