తెలంగాణ

telangana

ETV Bharat / state

అసెంబ్లీలో పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ - మాకూ అవకాశం ఇవ్వండి : బీఆర్ఎస్​ఎల్పీ - కాంగ్రెస్ పార్టీ శ్వేతపత్రం విడుదల

BRSLP Want to PowerPoint Presentation in Assembly : బుధవారం జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో తమకూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్​కు అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ శాసనసభాపక్షం కోరింది. ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తుందని సమాచారం ఉందన్న హరీశ్‌రావు, తమకు కూడా అవకాశం కల్పించాలని సభాపతికి లేఖ రాశారు. ఈ చర్చల్లో ముఖ్యంగా కాంగ్రెస్ సర్కార్ ఆర్థిక, విద్యుత్​ శాఖలపై ఎక్కువగా దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది.

Congress Party Release White Paper
BRSLP Want to PowerPoint Presentation in Assembly

By ETV Bharat Telangana Team

Published : Dec 19, 2023, 4:15 PM IST

BRSLP Want to PowerPoint Presentation in Assembly : శాసనసభలో తమకూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్​కు అవకాశం ఇవ్వాలని భారత రాష్ట్ర సమితి శాసనసభాపక్షం కోరింది. రేపటి నుంచి తిరిగి సమావేశం అవుతున్న అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక, విద్యుత్, నీటి పారుదల(Irrigation Sectors) రంగాలపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రాలు విడుదల చేయనుంది. అందులో భాగంగా చర్చ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అన్ని వివరాలు, గణాంకాలు పేర్కొనాలని సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం.

MLA Harish Rao Letter to Speaker Prasad For PowerPoint Presentation :ప్రభుత్వం చెప్పే విషయాలకు ప్రధాన ప్రతిపక్షంగా తాము వివరణ ఇవ్వాల్సి ఉందని, దీంతో బుధవారం చర్చ సందర్భంగా ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే, తమకూ అవకాశం కల్పించాలని బీఆర్ఎస్ కోరింది. ఈ మేరకు బీఆర్ఎస్ శాసనసభా పక్షం తరఫున మాజీ మంత్రి హరీశ్​రావు(Harish Rao) శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్​కు లేఖ రాశారు.

లోక్‌సభ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్ - ఎంపీలంతా హైదరాబాద్ రావాలని కేసీఆర్ ఆదేశాలు

Congress Party Release White Paper :బుధవారం జరగనున్న శాసనసభ ముందుకు రానున్న ఆర్థిక శాఖ శ్వేతపత్రంపై కసరత్తు కొనసాగుతోంది. రాష్ట్ర ఆవిర్భావం మొదలు ఇప్పటి వరకు వివిధ రూపాల్లో ఖజానాకు(State Treasury) వచ్చిన మొత్తం, చేసిన వ్యయం, సంబంధించిన పూర్తి వివరాలతో శ్వేత పత్రం విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ప్రత్యేకించి అప్పుల విషయమై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించింది. 2014 జూన్ రెండు నాటికి ఉన్న మిగులు బడ్జెట్ క్రమంగా ఎలా లోటులోకి వెళ్ళింది.

Telangana Assembly Sessions 2023 : వివిధ రకాలుగా తీసుకున్న అప్పులు ఏ మేరకు పెరిగాయన్న విషయాలను వివరించేందుకు సర్కార్ రంగం సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka) ఆదేశాల మేరకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. శ్వేతపత్రంలో ఉండాల్సిన అంశాలు, వివరాలకు సంబంధించి ఇచ్చిన నిర్దేశం మేరకు వివరాలను సిద్ధం చేస్తున్నారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సర్కార్​ ఫోకస్​ - శాసనసభ వేదికగా లెక్కతేల్చేందుకు సిద్ధం

విద్యుత్ శాఖకు సంబంధించి అప్పులు లోటు ఎక్కువగా ఉన్నందున ఆ విషయమై ప్రత్యేకంగా దృష్టి సారించారు. రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు ఆయా రంగాల వారీగా చేసిన ఖర్చు, ప్రస్తుత ఆర్థిక పరిస్థితి సంబంధిత వివరాలను శ్వేత పత్రంలో ప్రధానంగా పేర్కొననున్నారు.

రాజకీయ కక్ష సాధింపుతోనే నాపై కేసులు - హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి మల్లారెడ్డి

కర్ణాటక సీఎం వీడియోపై కేటీఆర్ ట్వీట్ - తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న సిద్ధరామయ్య

ABOUT THE AUTHOR

...view details