తెలంగాణ

telangana

ETV Bharat / state

'దర్యాప్తు సంస్థల్ని ప్రధాని మోదీ ఉసిగొల్పుతున్నారు' - ModiKillsDemocracy

BRS stands with MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ నేపథ్యంలో మహిళా మంత్రులు సత్యవతి రాఠోడ్, సబితా ఇంద్రారెడ్డి.. ఆమెకు మద్దతుగా దిల్లీ చేరుకున్నారు. మహిళా నాయకత్వం అంటే మోదీకి గిట్టదనే విషయం స్పష్టంగా అర్ధమవుతుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. ఈడీ, సీబీఐ కేసులకు భయపడమని మంత్రి సత్యవతి రాఠోడ్ స్పష్టం చేశారు.

ministers
ministers

By

Published : Mar 11, 2023, 5:05 PM IST

BRS stands with MLC Kavitha: తెలంగాణలో మహిళా సాధికారత కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అమలుచేస్తున్న పథకాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందనే భయంతోనే దర్యాప్తు సంస్థల్ని ప్రధాని మోదీ ఉసిగొల్పుతున్నారని.. రాష్ట్ర మహిళా మంత్రులు విమర్శించారు. ఎమ్మెల్సీ కవితపై ఈడీ విచారణ చేపట్టిన వేళ ఆమెకు మద్దతుగా మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాఠోడ్ దిల్లీకి చేరుకున్నారు.

మహిళలకు 33 శాతం నుంచి 50 శాతం రిజర్వేషన్లు కేసీఆర్​ పెంచారని సత్యవతి రాఠోడ్ గుర్తు చేశారు. హైదరాబాద్​ మేయర్ పీఠాన్ని మహిళకు కట్టబెట్టారని తెలిపారు. ఈడీ, సీబీఐ కేసులకు భయపడమని పేర్కొన్నారు. ఎవరి మీద ఎందుకు కేసులు పెడుతున్నారో భారతదేశం మొత్తం గమనిస్తోందని వివరించారు. ప్రతిపక్షాలపై మాత్రమే ఈడీ, సీబీఐ దాడులు జరుగుతాయని ఆరోపించారు. బండి సంజయ్ నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని ఆమె హితవు పలికారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్​ పార్టీ అధికారంలోకి వస్తుందని సత్యవతి రాఠోడ్ స్పష్టం చేశారు.

మహిళా నాయకత్వం అంటే మోదీకి గిట్టదనే విషయం స్పష్టంగా అర్ధమవుతుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. తన చేతిలో ఉన్న దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పి కేసీఆర్ వెన్నంటి ఉన్నవారిని వేధిస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారని తెలిపారు. మహిళకు మేయర్‌ స్థానం కట్టబెట్టిన ప్రభుత్వం తమదని పేర్కొన్నారు. మహిళలకే మార్కెట్‌ కమిటీ ఛైర్‌పర్సన్లు ఇచ్చిన ఘనత కేసీఆర్​కే దక్కుతుందని సబితా ఇంద్రారెడ్డి వివరించారు.

సీఎం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు బండి సంజయ్‌కు కనిపించట్లేదా:కల్యాణ లక్ష్మి ద్వారా ప్రభుత్వమే లక్ష రూపాయలు ఇస్తుందని సబితా ఇంద్రారెడ్డి వివరించారు. సీఎం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు బండి సంజయ్‌కు కనిపించట్లేదా అని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఆమె ఖండించారు. సొంత నిధులతో మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికి నీరు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి అని అన్నారు. ఆరోగ్యలక్ష్మి, కేసీఆర్‌ కిట్‌ వంటి కార్యక్రమాల ద్వారా ఆడబిడ్డలకు అండగా ఉన్నామని గుర్తు చేశారు. మహిళలకు భద్రత కల్పించాలని షీటీమ్స్‌ ఏర్పాటు చేశామని సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు.

"మహిళా నాయకత్వం అంటే మోదీకి గిట్టదనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. తన చేతిలో ఉన్న దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పి కేసీఆర్ వెన్నంటి ఉన్నవారిని వేధిస్తున్నారు. ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారు. మహిళకు మేయర్‌ స్థానం కట్టబెట్టిన ప్రభుత్వం తమది. మహిళలకే మార్కెట్‌ కమిటీ ఛైర్‌పర్సన్ పదవులు ఇచ్చిన ఘనత కేసీఆర్​కే దక్కుతుంది." -సబితా ఇంద్రారెడ్డి , మంత్రి

"మహిళలకు 33 శాతం నుంచి 50 శాతం రిజర్వేషన్​లు కేసీఆర్​ పెంచారు. హైదరాబాద్​ మేయర్ పీఠాన్ని మహిళకు కట్టబెట్టారు. ఈడీ, సీబీఐ కేసులకు భయపడం." - సత్యవతి రాఠోడ్, మంత్రి

దర్యాప్తు సంస్థల్ని ప్రధాని మోదీ ఉసిగొల్పుతున్నారు: మంత్రులు

ఇవీ చదవండి:'కవితమ్మా ధైర్యంగా ఉండండి.. ఈడీ దర్యాప్తును యావత్ దేశం గమనిస్తోంది'

కవితపై బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు.. విచారణకు ఆదేశించిన మహిళా కమిషన్

5 గంటలుగా కవితపై ఈడీ ప్రశ్నల వర్షం.. ఏం జరగనుంది..?

ABOUT THE AUTHOR

...view details