BRS Wins Maharashtra Gram Panchayat Elections :టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్‌గా మారిన తర్వాత.. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) దేశరాజకీయాలపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే వివిధ రాష్ట్రాలకు చెందిన నేతలు, కార్యకర్తలు బీఆర్ఎస్‌లో చేరారు. ముఖ్యంగా మహారాష్ట్రపై కేసీఆర్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. అక్కడ తరచూ సభలు నిర్వహిస్తూ ఆ రాష్ట్ర ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేశారు. అక్కడి ప్రజలకు తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, పథకాల గురించి వివరిస్తూ ముందుకు సాగారు.
తెలంగాణలో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తున్నామని కేసీఆర్ మహారాష్ట్ర ప్రజలకు వివరించారు. అందుకే దేశమంతా తెలంగాణ మోడల్ కావాలంటోందని చెబుతూ వచ్చారు. రాష్ట్రంలో సాధ్యమైనప్పుడు.. మహారాష్ట్రలో ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించారు ఇక్కడ కూడా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఆ పథకాలన్నీ అమలు చేస్తామని ప్రజలకు చెప్పండని మహారాష్ట్ర బీఆర్ఎస్ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ అజెండాకు ఆకర్షితులైన కొంత మంది మహారాష్ట్ర నేతలు ఇప్పటికే గులాబీ పార్టీలో చేరారు. అక్కడి రైతులు కూడా బీఆర్ఎస్కు జై కొడుతున్నారు.
మహారాష్ట్ర ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ.. ఇక యుద్దమే!
Maharashtra BRS : ఈ నేపథ్యంలో అక్కడ జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు పోటీలోకి దిగారు. పోటీ చేయడమే కాకుండా.. మహారాష్ట్ర గ్రామ పంచాయతీ ఎన్నికల్లో (Maharashtra Gram Panchayat Elections).. విజయం సాధించారు. ఆ రాష్ట్రంలో మొత్తం 20 పంచాయతీల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు.
ఒక్క భండారా జిల్లాలోనే 66 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. రెండు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 64 స్థానాలకు ఎన్నికలు జరగగా. వీటిలో మొహదీ తాలూకాలోనే అత్యధికంగా 57 ఉన్నాయి. వీరిలో ఎన్సీపీకి చెందిన అజిత్ పవార్ గ్రూపు తరఫు నుంచి 25 మంది సర్పంచ్‌లు, బీజేపీ 10 , కాంగ్రెస్ 9, ఇతరులు ముగ్గురు, 19 స్థానాల్లో బీఆర్‌ఎస్ సర్పంచ్ అభ్యర్థులు విజయం సాధించారు. నాందేడ్ జిల్లాలోనూ ఓ స్థానాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మొత్తం 20 పంచాయతీల్లో గులాబీ పార్టీ బలపరిచిన అభ్యర్థులు విజయం ఢంకా మోగించారు. అంతకుముందు జరిగిన పంచాయతీ ఉపఎన్నికలో బీఆర్ఎస్ విజయం సాధించింది. ఔరంగాబాద్ సమీప గంగాపూర్ తాలూకాలోని అంబేలోహల్ గ్రామ పంచాయతీ ఒకటో వార్డుకు ఉపఎన్నికలు నిర్వహించగా.. బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిన వార్డు సభ్యుడు గెలుపొందిన విషయం తెలిసిందే.
ఇది రాజకీయ పోరాటం కాదు.. జీవన్మరణ పోరాటం: కేసీఆర్
మరోవైపు ఇటీవలే బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్రలో బీఆర్ఎస్ శిక్షణ శిబిరంలో పాల్గొన్ని.. కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.మహిళా, దళిత, ఓబీసీ, విద్యార్థి, రైతు, యువత, కార్మిక తదితర విభాగాలకు.. గ్రామస్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. బీఆర్ఎస్ పార్టీ విధానాలు, తెలంగాణలో అమలవుతున్న పథకాలతో రూపొందిన పుస్తకాలు, పాటల సీడీలు, పెన్ డ్రైవ్‌లు, సభ్యత్వ పుస్తకాలు సమకూర్చామని తెలియజేశారు. ఇవన్నీ ప్రజల్లోకి వెళ్లాలని కేసీఆర్ అన్నారు.
KCR Maharashtra Tour : హారతులతో ఘనస్వాగతం.. అడుగడుగునా గులాబీ పూల వర్షం..
KCR: 'మహారాష్ట్రలో తెలంగాణ మోడల్ అమలు చేసి తీరుతాం'