తెలంగాణ

telangana

ETV Bharat / state

BRS Special Strategy against Disgruntled Leaders : అసంతృప్తులపై బీఆర్‌ఎస్ ప్రత్యేక వ్యూహం.. సొంత పార్టీ నేతలకు సముదాయింపు.. కాంగ్రెస్‌ నాయకులపై ఆకర్షణ మంత్రం - కాంగ్రెస్​నేతలను ఆకర్షిస్తున్న బీఆర్​ఎస్​

BRS Special Strategy against Disgruntled Leaders in Telangana : ఒకవైపు సొంత పార్టీలోని అసంతృప్తులను దారికి తెచ్చుకుంటూనే.. ఇతర పార్టీల్లోని అసమ్మతి నేతలను బీఆర్​ఎస్​ పార్టీలోకి ఆహ్వానిస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్​ పార్టీ నేతలను చేర్చుకునేందుకు వేగంగా పావులు కదుపుతోంది. అందుకు కాంగ్రెస్​లోని ద్వితీయ శ్రేణి నాయకులను గుర్తించే పనిలో నిమగ్నమైంది.

BRS Party in Telangana
Congress Leaders Joining in BRS Party in Telangana

By ETV Bharat Telangana Team

Published : Oct 13, 2023, 1:08 PM IST

BRS Special Strategy against Disgruntled Leaders in Telangana :శాసనసభ ఎన్నికలకు(Telangana Assembly Election 2023) ఇంకా దాదాపు 50 రోజుల సమయం మాత్రమే ఉంది. అన్ని పార్టీలు తమదే విజయమని ప్రచారం చేసుకుంటున్నాయి. బీఆర్​ఎస్​ 115 స్థానాలకు ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించగా.. కాంగ్రెస్​, బీజేపీ మాత్రం ఇంకా అభ్యర్థుల ప్రకటనను జాప్యం చేస్తున్నాయి. ఈలోపు గులాబీ దళం​ మాత్రం ఒకవైపు సొంత పార్టీలోని అసంతృప్తులను దారికి తెచ్చుకుంటూనే.. మరోవైపు కాంగ్రెస్​లోని అసమ్మతి నాయకులను ఆకర్షించే పనిలో పడింది. హస్తం పార్టీలో టికెట్​ దక్కే అవకాశం లేక.. అసంతృప్తితో ఉన్న వారిని, అభ్యర్థులకు సహకరించని ద్వితీయ శ్రేణి నాయకులను గుర్తించి పార్టీలో చేర్చుకునేందుకు వేగంగా పావులు కదుపుతోంది.

ఇప్పటికే వివిధ నియోజకవర్గాలకు చెందిన పలువురు నాయకులను పార్టీలో చేర్చుకోగా.. కాంగ్రెస్​ జాబితా ప్రకటించిన తర్వాత ఇంకొందరు వచ్చే అవకాశం ఉందని బీఆర్​ఎస్​ భావిస్తోంది. అందులో ఇల్లందు అభ్యర్థికి సహకరించబోమని చెప్పిన పార్టీ నాయకులతో శుక్రవారం మంత్రి కేటీఆర్​ సమావేశమయ్యారు. దేవరకొండ నియోజకవర్గంలో కాంగ్రెస్​ టికెట్​(Congress MLA Candidate List) కోసం పలువురు పోటీపడగా.. జడ్పీ మాజీ ఛైర్మన్​ బాలూనాయక్​కు వచ్చే అవకాశం ఉండటంతో.. అక్కడ కాంగ్రెస్​ నేత బిల్యా నాయక్​.. కేటీఆర్​ సమక్షంలో బీఆర్​ఎస్​లో చేరారు.

DCC President Sridhar Joined BRS Party : గతంలో టీడీపీ నుంచి పోటీ చేసిన బిల్యానాయక్​ తర్వాత కాంగ్రెస్​ గూటికి చేరారు. దేవరకొండలో ఇప్పటికే బీఆర్​ఎస్​ సిట్టింగ్​ అభ్యర్థికి సీటు ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో ఆయనకు వేరే పదవి ఇస్తామని కేటీఆర్​ హామీ ఇచ్చారు. మెదక్​ నుంచి మైనంపల్లి రోహిత్​కు కాంగ్రెస్​ టికెట్​ ఖరారయ్యే అవకాశం ఉండటంతో.. అక్కడ కాంగ్రెస్​ నేతలు అసంతృప్తితో ఉన్నారు. వారిలో మాజీ ఎమ్మెల్యే శశిధర్​రెడ్డి ఇంటికి మంత్రి హరీశ్​రావు వెళ్లి.. బీఆర్​ఎస్​ పార్టీలోకి ఆహ్వానించారు. అదే స్థానం నుంచి టికెట్​ ఆశించిన తిరుపతిరెడ్డి కూడా గులాబీ కండువా కప్పుకున్నారు. అయితే శశిధర్​రెడ్డి కూడా చేరితే మెదక్​ నుంచి కాంగ్రెస్​కు చెందిన ఇద్దరు ముఖ్య నేతలు బీఆర్​ఎస్​లో చేరినట్లు అవుతుంది.

Telangana Congress Clashes : కాంగ్రెస్‌లో కాక రేపుతున్న చేరికలు.. సీనియర్లు వర్సెస్ జూనియర్లతో పార్టీకి తలనొప్పి

Telangana Election BRS Plan 2023 : ఈసారి మల్కాజి​గిరి కాంగ్రెస్​ టికెట్​ ఎలాగైనా మైనంపల్లి హనుమంతరావుకే ఖరారు అవుతుందని భావించి.. మెదక్​ డీసీసీ అధ్యక్షుడు శ్రీధర్​ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆఖరికి ఆయనను కాంగ్రెస్​ నేతలు రాహుల్​గాంధీ వద్దకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి వచ్చి నేరుగా బీఆర్​ఎస్​లో చేరారు. అనంతరం శ్రీధర్​కు అత్యంత వెనకబడిన తరగతుల కార్పొరేషన్​(ఎంబీసీ)కి ఛైర్మన్​గా ప్రభుత్వం నియమించింది. అలాగే మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు బీఆర్​ఎస్​ నుంచి కాంగ్రెస్​ పార్టీలో చేరగానే ఆ నియోజకవర్గ కాంగ్రెస్​ నేత అభిలాశ్​రావు బీఆర్​ఎస్​ తీర్థం పుచ్చుకున్నారు.

సొంత నేతలతో వరుస భేటీలు : బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్​ 115 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాక కొన్నిచోట్ల కొందరు నేతలు అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే వారితో జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. స్టేషన్ ​ఘన్​పూర్​, జనగామ ఎమ్మెల్యేలకు కార్పొరేషన్​ ఛైర్మన్​ పదవులను ఇచ్చింది. అలాగే నర్సాపూర్​లో సిట్టింగ్​ ఎమ్మెల్యేతో పలు దఫాలు చర్చించారు. అయితే ఇప్పటి వరకు అక్కడి అభ్యర్థిని ప్రకటించలేదు. అలాగే ఉప్పల్​లో టికెట్​ దక్కని సిట్టింగ్​ ఎమ్మెల్యే సుభాశ్​రెడ్డి వేరే పార్టీలోకి వెళ్లకుండా చూస్తున్నారు. మరోవైపు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పరిగి, వికారాబాద్​, ఎల్బీనగర్​ నియోజకవర్గాల బీఆర్​ఎస్​ నాయకులు ఇప్పటికే కాంగ్రెస్​లో చేరారు. ఇంకా మానుకొండూరు నుంచి కూడా కాంగ్రెస్​లోకి చేరికలు జరిగాయి. ఇలాంటి చోట్ల బీఆర్​ఎస్​కు నష్టం కలుగకుండా చూసుకునేందుకు కాంగ్రెస్​ ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని తమవైపు తిప్పుకుంటుంది.

BRS Aiming for Hattrick Telangana 2023 : ఓవైపు హ్యాట్రిక్​పై కేసీఆర్ ఫోకస్​.. మరోవైపు మహబూబ్​నగర్​లో మూడోసారి గెలుపుపై కన్నేసిన ఎమ్మెల్యేలు

Khanapur MLA Rekha Nayak Resigns BRS : అసంతృప్త నేతల రాజీనామాల పర్వం.. బీఆర్​ఎస్​కు రేఖానాయక్​, కసిరెడ్డి గుడ్​బై

ABOUT THE AUTHOR

...view details