BRS Won Post Of Sarpanch In Maharashtra : మహారాష్ట్ర రాజకీయాల్లోకి కొత్తగా అడుగుపెట్టిన బీఆర్ఎస్.. బోణి ప్రారంభించింది. తొలి ప్రయత్నంలో సర్పంచ్ పదవిని సొంతం చేసుకుంది. ఛత్రపతి శంభాజీనగర్ జిల్లా గంగాపూర్‌లోని సావ్ఖేడా గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలో బీఆర్ఎస్ బలపరిచిన సుష్మా విష్ణు ములే సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
సుష్మా విష్ణు ములే సర్పంచ్‌గా ఎన్నికవ్వడంతో.. బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్రతో పాటు గంగాపూర్ ఖుల్తాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోకి అడుగుపెట్టినట్లు అయింది. ఈ ఎంపిక ప్రక్రియను స్వయంగా బీఆర్ఎస్ నాయకులు పర్యవేక్షించి.. గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎంపిక ప్రక్రియను చేశారు. సర్పంచ్ ఎన్నికలో సభ్యులందరి తరఫున సుష్మా విష్ణు మూలేనే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీనితో మహారాష్ట్రలో బీఆర్ఎస్ అడుగుపెడుతూ.. తన ఉనికి చాటుకుంటుంది.
- KCR ON BRS: 'బీఆర్ఎస్ మొదటి కార్యక్షేత్రం మహారాష్ట్ర'
- Maharashtra leaders joined BRS: 'బీఆర్ఎస్లో చేరిన పలువురు మహారాష్ట్ర నేతలు'
BRS Sarpanch In Maharashtra : మహారాష్ట్రలో రాజకీయ పరిస్థితులను పరిశీలిస్తే.. భారత రాష్ట్ర సమితి అక్కడి రాజకీయాల్లోకి బలంగానే ప్రవేశించిందని చెప్పవచ్చు. అక్కడ పార్టీ సర్పంచ్ అభ్యర్థి ఏకగ్రీవం అవ్వడానికి ప్రధాన కారణం.. రైతుల సమస్యలు, కరెంటు సమస్యలు, నీటి సమస్యలు వంటి ప్రధానమైన సమస్యలను పరిష్కరించి బీఆర్ఎస్ పనులను ప్రారంభించింది. అలాగే బీజేపీకి వ్యతిరేకంగా ఏకతాటిపైకి వచ్చే పార్టీల్లో కేసీఆర్ కూడా ముందు వరుసలో ఉండడం కూడా గెలవడానికి ఆస్కారం అయ్యింది. అందుకే గంగాపూర్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి అధిక సంఖ్యలో ఇతర పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు వచ్చి చేరుతున్నారు.