తెలంగాణ

telangana

ETV Bharat / state

BRS Mini Plenary: నేడు రాష్ట్రవ్యాప్తంగా BRS మినీ ప్లీనరీ సమావేశాలు - బీఆర్‌ఎస్‌ మినీ ప్లీనరీ

BRS Mini Plenary Today: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. నియోజకవర్గ స్థాయి ప్లీనరీకి బీఆర్‌ఎస్‌ సిద్ధమైంది. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రతినిధుల సభలు జరగనున్నాయి. ఎన్నికల శంఖారావంలా ఈ సభలు నిర్వహించాలని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గులాబీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ జరిగే ప్రతినిధుల సభల్లో కనీసం 6 తీర్మానాలు చేయాలని.. పార్టీ నాయకత్వం దిశానిర్దేశం చేసింది. ఉద్యమ ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ.. తొమ్మిదేళ్ల అభివృద్ధి, సంక్షేమంపై చర్చించడంతో పాటు.. బీజేపీ వైఫల్యాలను ఎండగట్టనున్నారు.

BRS Mini Plenary
BRS Mini Plenary

By

Published : Apr 25, 2023, 6:54 AM IST

Updated : Apr 25, 2023, 7:00 AM IST

BRS Mini Plenary Today : ఏప్రిల్‌ 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా మినీ ప్లీనరీలు నిర్వహించేందుకు భారత రాష్ట్ర సమితి సిద్ధమైంది. తొలిసారి అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో పార్టీ ప్రతినిధుల సభలను నిర్వహిస్తోంది. ప్రతీ నియోజకవర్గంలో సుమారు మూడున్నర వేల మంది ప్రతినిధులతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు నాలుగు లక్షల మంది నేటి సభల్లో పాల్గొననున్నారు. స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలు, మేయర్లు, ఛైర్మన్లు తదితర ముఖ్య నేతలు సహా దాదాపు మూడు వేలకు పైగా ప్రతినిధులు హాజరు కానున్నారు.

BRS Mini Plenaries in Telangana Today: ఉదయమే నగరం, పట్టణం, గ్రామమంతటా పార్టీ జెండాలను ఎగురవేయనున్నారు. పది గంటలకల్లా నాయకులు, కార్యకర్తలు సభ ప్రాంగణానికి చేరుకుంటారు. ఉద్యమ కాలం నుంచి రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొమ్మిదేళ్లలో సాధించిన అభివృద్ధి, సంక్షేమంపై సభల్లో లోతుగా చర్చిస్తారు. ఈ సందర్భంగా ప్రతినిధుల సభలో కనీసం ఆరు అంశాలపై తీర్మానాలు చేయాలని బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇప్పటికే పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

వాటిపైనే ప్రధాన చర్చ..: దళిత బంధు, రైతు బంధు, రైతు బీమా, ఆసరా, ఇంటింటికీ మంచి నీరు, కాళేశ్వరం ప్రాజెక్టు వంటివి ప్రజలకు వివరించడంతో పాటు.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేస్తోందనే చర్చను సభల్లో ప్రధానంగా చేపట్టనున్నారు. ఈ నెల 27న బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవం హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌లో నిర్వహించనున్నారు. ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అధ్యక్షతన పార్టీ జనరల్ బాడీ సమావేశం జరగనుంది. రాష్ట్ర, జాతీయ రాజకీయ పరిస్థితులపై పలు తీర్మానాలు ప్రవేశపెట్టి, చర్చించి ఆమోదిస్తారు.

అక్టోబరు 10న వరంగల్‌లో మహా సభ..: మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ జిల్లా అధ్యక్షులు సహా సుమారు 300 మంది సమావేశంలో పాల్గొననున్నారు. అక్టోబరు 10న వరంగల్‌లో మహా సభను నిర్వహించనున్నట్లు బీఆర్‌ఎస్‌ ఇప్పటికే ప్రకటించింది. బీఆర్‌ఎస్‌ ఇప్పటికే పల్లెలు, పట్టణాలు, నగరాల స్థాయిలో ఆత్మీయ సమ్మేళనాలను జోరుగా నిర్వహిస్తోంది. ఈ సమ్మేళనాలకు కార్యకర్తల నుంచి మంచి స్పందనే వస్తుంది. వచ్చే నెలాఖరు వరకు ఈ ఆత్మీయ సమ్మేళనాలు జరపాలని పార్టీ నాయకత్వం తెలిపింది.

BRS Mini Plenary: నేడు రాష్ట్రవ్యాప్తంగా BRS మినీ ప్లీనరీ సమావేశాలు
Last Updated : Apr 25, 2023, 7:00 AM IST

ABOUT THE AUTHOR

...view details