తెలంగాణ

telangana

ETV Bharat / state

BRS Party Campaign Strategy 2023 : హ్యాట్రిక్ కొట్టడమే ధ్యేయంగా.. కేసీఆర్ ప్రచార వ్యూహ రచనలు షురూ! - Telangana political news

BRS Party Campaign Strategy 2023 : అభ్యర్థుల ఖరారులో బీఆర్​ఎస్​ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ప్రత్యర్థి పార్టీలు సిద్ధం కాకముందే గులాబీ అభ్యర్థులను కేసీఆర్‌ రంగంలోకి దించారు. మిగతాపార్టీలు అభ్యర్థులను తేల్చకముందే.. రెండు విడతల ప్రచారం పూర్తిచేసేలా ప్రణాళికలు రచించారు. ఈనెల 25న మిగిలిన నాలుగు స్థానాలకు.. అభ్యర్థులను ప్రకటించనున్నారు. త్వరలో అభ్యర్థులతో సమావేశం నిర్వహించి ఎన్నికల వ్యూహాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.

CM KCR Contests from Two Seats
BRS Party Campaign Strategy

By

Published : Aug 22, 2023, 8:27 AM IST

Updated : Aug 22, 2023, 9:09 AM IST

BRS Party Campaign Strategy 2023 హ్యాట్రిక్ కొట్టడమే ధ్యేయంగా.. కేసీఆర్ ప్రచార వ్యూహ రచనలు షురూ!

BRS Party Campaign Strategy 2023 : మరోసారి ఒకేసారి 115 మంది అభ్యర్థులని ప్రకటించి విపక్షాలకు.. గులాబీ పార్టీ సవాల్ విసిరింది. కాంగ్రెస్, బీజేపీలు అభ్యర్థులని తేల్చకముందే రెండు,మూడుసార్లు ప్రచారం పూర్తిచేసేలా బీఆర్​ఎస్​(Bharat Rashtra Samithi) వ్యూహరచన చేసింది. అభ్యర్థుల ఖరారు కోసం బీఆర్​ఎస్​ నాయకత్వం కొన్ని నెలలుగా అనేక సర్వేలు చేయించింది. ఆ సర్వేల ఆధారంగా కొందరు ఎమ్మెల్యేలని పిలిచి పనితీరు మార్చుకోవాలని కేసీఆర్, కేటీఆర్ హెచ్చరించారు.

చెప్పినా తీరు మార్చుకోని నేతలను.. తరచుగా వివాదస్పదంగా మారిన కొందరిని చెప్పినట్లుగానే పక్కన పెట్టేశారు. ఖానాపూర్, ఉప్పల్, వైరా శాసనసభ్యుల పనితీరుపై సర్వేల్లో అసంతృప్తి సహా.. అవినీతి ఆరోపణలు రావడంతో పక్కనపెట్టినట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్యతరచూ మహిళలకు సంబంధించిన వివాదాల్లో తలదూర్చడంతో టికెట్ కోల్పోయినట్లు భావిస్తున్నారు.

CM KCR Contests from Two Seats : ఈసారి గజ్వేల్​తో పాటు కామారెడ్డి నుంచి కూడా కేసీఆర్ పోటీ

KCR To Contest In Kamareddy : వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వ వివాదంపై కోర్టుల్లో ఉన్నందున.. అక్కడ అభ్యర్థిని మార్చాల్సి వచ్చిందని స్వయంగా సీఎం కేసీఆర్​నే స్వయంగా చెప్పారు. ఆదిలాబాద్ ఎంపీగా ఆత్రంసక్కుని పోటీ చేయించాలని భావిచండంతో.. కోవాలక్ష్మిని పోటీకి దించినట్లు పార్టీనేతలు విశ్లేషిస్తున్నారు. కామారెడ్డిలో స్వయంగా కేసీఆర్ పోటీ చేయనున్నందున సిట్టింగ్ ఎమ్మెల్యే గంప గోవర్దన్ తప్పుకున్నారు. కోరుట్లలో ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు వినతిమేరకే ఆయన కుమారుడు కల్వకుంట్ల సంజయ్‌కి అవకాశమిచ్చారు.

BRS Party Election Plan 2023 : పోటీతీవ్రంగా ఉన్నందున 3 నెలలముందే టికెట్లు ప్రకటించేలా బీఆర్​ఎస్​ నాయకత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఒకవేళ అసంతృప్తి, అసమ్మతి భగ్గుమంటే.. వారం, పది రోజుల్లో చక్కదిద్దవచ్చునని భావిస్తోంది. మైనంపల్లి హన్మంతరావు మినహా.. మిగతా నేతల నుంచి ఇప్పటి వరకైతే చెప్పుకోదగిన అసమ్మతి కనిపించలేదు. అసంతృప్తితో ఉన్న నేతలందరినీ కలిసి మాట్లాడాలని అభ్యర్థులకు అధిష్ఠానం స్పష్టం చేసింది.

టికెట్ దక్కని అభ్యర్థులకు కేసీఆర్ భరోసా :అవసరమైతే పిలిచి మాట్లాడాలని.. ఆయా జిల్లాల మంత్రులు, ముఖ్యనేతలకు అధిష్టానం సూచించింది. అసమ్మతి తలెత్తకుండా ముందుగానే బీఆర్​ఎస్​ నాయకత్వం జాగ్రత్త పడింది. టికెట్ దక్కని అభ్యర్థులను కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు(Minister Harish Rao) ముందే పిలిచి మాట్లాడి పరిస్థితి వివరించి భవిష్యత్త్‌పై హామీ ఇచ్చారు. తాండూరు మాజీ ఎమ్మెల్యే మహేందర్ రెడ్డికి మంత్రి పదవి ఆఫర్ ఇచ్చారు.

BRS MLA Tickets Telangana 2023 : ఒక్క ఛాన్స్‌ కోసం కొందరు.. మరో ఛాన్స్‌ కోసం ఇంకొందరు.. టికెట్ల కోసం చివరి ప్రయత్నాలు

Telangana Assembly Election 2023 : అవకాశం దక్కని సిట్టింగ్‌లకు భవిష్యత్త్‌లో ఎమ్మెల్సీ, ఎంపీలుగా అవకాశమిస్తామని చెప్పినట్లు సమచారం. వీలైనంత వరకు నేతలెవరూ పార్టీ వీడకుండా నచ్చచెప్పాలనే ఆలోచనతో ఉన్న అధిష్ఠానం.. ఒకవేళ వినకపోతే.. వదిలేయాలని.. అయితే అలాంటి వారి వెంట ద్వితీయ శ్రేణి నాయకత్వం వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని భావిస్తోంది.

రెండో జాబితా అభ్యర్థుల ఎంపికపై అధిష్ఠానం కసరత్తుల పర్వం :మిగిలిన నాలుగు స్థానాలకు ఈనెల 25న అభ్యర్థులను ప్రకటించనున్నారు. జనగామలో సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీ పల్లారాజేశ్వర్ రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి పోటీ పడుతున్నారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి వైపు అధిష్ఠానం మొగ్గుచూపుతున్నా మిగతావారికి నచ్చచెప్పాకే ప్రకటించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. నర్సాపూర్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్(Telangana State Commission for Women) ఛైర్‌పర్సన్ సునీత లక్ష్మారెడ్డి ఆశిస్తున్నారు. వయోభారం కారణంగా మదన్‌రెడ్డి బదులు సునీత లక్ష్మారెడ్డికి అవకాశం ఇవ్వాలని అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. గతఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా రాజాసింగ్ గెలిచిన గోషామహల్‌లో మాజీ శాసనసభ్యుడు ప్రేంసింగ్ రాథోడ్ బదులుగా నియోజకవర్గ ఇన్​ఛార్జి నందకిషోర్ వ్యాస్‌ని పోటీకి దించాలని ఆలోచిస్తున్నా తుది కసరత్తు చేస్తున్నారు. ఎమ్​ఐఎమ్​ స్థానమైన నాంపల్లిపై కొంత కసరత్తు చేయాల్సి ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

KCR to Start Election Campaign From Warangal : ఈనెల 25న రెండో జాబితా ప్రకటించాక అభ్యర్థులతో కేసీఆర్ సమావేశం కానున్నారు. పోలింగ్ వరకు అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు. అభ్యర్థులు రానున్న మూడు నెలల్లో ప్రతి ఓటరును కనీసం నాలుగైదుసార్లు వ్యక్తిగతంగా కలిసేలా వ్యూహాలు రూపొందిస్తున్నారు. ఇతర పార్టీలు అభ్యర్థులను ప్రకటించేలోగా.. అభ్యర్థులు ప్రతిఇంటికి కనీసం రెండుసార్లు వెళ్లాలని పార్టీవ్యూహం. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ సభలు, రోడ్ షోలు నిర్వహించనున్నారు. అక్టోబరు 16న వరంగల్‌లో భారీ సభలో అధికారికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభించి అదే రోజున బీఆర్​ఎస్​ ఎన్నికల మేనిఫెస్టో(Election Manifesto) ప్రకటించనుంది.

LIVE UPDATES : ఒకేసారి 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్‌.. కానీ ఆ ఏడు స్థానాల్లోనే మార్పు

CM KCR Released BRS MLAs Candidate List : 'రాష్ట్ర ప్రగతిని కొనసాగించాలనేదే అజెండా'.. అక్టోబర్​ 16న వరంగల్​లో సింహగర్జన సభ

Last Updated : Aug 22, 2023, 9:09 AM IST

ABOUT THE AUTHOR

...view details