తెలంగాణ

telangana

ETV Bharat / state

BRS Parliamentary Party meeting at Pragati Bhavan : చట్టసభల్లో మహిళలు, బీసీలకు 33 శాతం రిజర్వేషన్‌లు కల్పించాలి: సీఎం కేసీఆర్ - Women Reservation Bill in Telangana

BRS Meeting at Pragathi Bhavan
KCR Latest Meeting in Pragathi Bhavan

By ETV Bharat Telangana Team

Published : Sep 15, 2023, 2:46 PM IST

Updated : Sep 15, 2023, 7:19 PM IST

14:42 September 15

BRS Parliamentary Party meeting at Pragati Bhavan : చట్టసభల్లో మహిళలు, బీసీలకు 33 శాతం రిజర్వేషన్‌లు కల్పించాలి: సీఎం కేసీఆర్

BRS Parliamentary Party meeting at Pragati Bhavan : చట్ట సభల్లో 33 శాతం బీసీ రిజర్వేషన్‌ సహా.. 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లు(Women Reservation Bill).. రెండింటినీ పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టాలని బీఆర్​ఎస్​ పార్లమెంటరీ పార్టీ సమావేశం డిమాండ్‌ చేసింది. ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్​ అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సంయుక్త సమావేశం జరిగింది. ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, బిల్లులపై చర్చించారు. బీసీ బిల్లు, మహిళా బిల్లు ఈ రెండు బిల్లులను పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టే దిశగా ఎంపీలు చేపట్టాల్సిన కార్యాచరణ, సంబంధిత అంశాలపై సుదీర్ఘంగా చర్చించింది.

BC Reservation Bill Discuss in Parliament: మహిళా సంక్షేమం, బీసీల అభ్యున్నతి కోసం పార్టీ కట్టుబడి ఉందని కేసీఆర్​ స్పష్టం చేశారు. ఈ దిశగా పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో పార్టీ డిమాండ్లు రాజ్యసభ, లోక్​సభల్లో ఎంపీలు లేవనెత్తాలని దిశానిర్దేశం చేశారు. బీసీ కులాలను సామాజిక విద్య, ఆర్థిక రంగాల్లో మరింత బలపడే విధంగా దేశవ్యాప్తంగా ముందుకు నడిపించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని తెలిపారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం బీసీల అభివృద్ధి, సంక్షేమం దిశగా అమలు చేస్తున్న పథకాలు, కార్యాచరణ సత్పలితాలు ఇస్తున్నాయని పేర్కొన్నారు.

CM KCR Review on Palamuru Rangareddy Project : ఈ నెల 16న పాలమూరు-రంగారెడ్డి వెట్ రన్‌.. ప్రారంభించనున్న కేసీఆర్

KCR Reference to 33 Percent BC Reservationin Telangana : ముఖ్యంగా రాజకీయ అధికారంలో బీసీల భాగస్వామ్యం మరింత పెంచడం ద్వారానే సర్వతోముఖాభివృద్ధి సాధ్యమని బీఆర్​ఎస్​ పార్లమెంటరీ పార్టీ పునరుద్ఘాటించింది. అందులో భాగంగా బీసీలకు పార్లమెంటు, అసెంబ్లీ చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్‌ను అమలు చేయాల్సిందేనని ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ దిశగా ఈ పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టి చిత్తశుద్దిని నిరూపించుకోవాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేసింది. తెలంగాణ ఏర్పాటైన తర్వాత నిర్వహించిన మొదటి అసెంబ్లీ సెషన్​లోనే బీసీ రిజర్వేషన్ బిల్లు( BC Reservation Bill in Telangana)పై చర్చించి ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపించిందనే విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసి పంపి తొమ్మిదేళ్లు గడుస్తున్నా.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మౌనం వహిస్తుందని ఆరోపించారు. సమావేశంలో చర్చించి తీసుకున్న నిర్ణయం మేరకు బీసీ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్‌ లేఖ రాశారు.

సమావేశం తరవాత బీఆర్​ఎస్​ ఎంపీలు ఏం మాట్లాడారు: బీఆర్​ఎస్​ పార్లమెంటరీ పార్టీ సమావేశం అనంతరం ఎంపీలు వెంకటేశ్​ నేత, రంజిత్​రెడ్డిలు మాట్లాడారు.. "ఈ నెల 18 నుంచి ఐదు రోజుల పాటు జరగనున్న పార్లమెంట్‌ సమావేశాల్లో మహిళా బిల్లు, ఓబీసీ రిజర్వేషన్ బిల్లుల అంశాలు ప్రస్తావిస్తాం. ఉభయసభల్లో ప్రస్తావించాలని మా అధినేత దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాం. అప్పటి నుంచి పట్టించుకోలేదు. ఈ విషయంలో కేంద్రాన్ని నిలదీస్తాం" అని అన్నారు.

CM KCR Inaugurates 9 Medical Colleges : 'వైద్యవిద్యలో నవశకం.. ఒకేరోజు 9 వైద్య కాలేజీలు ప్రారంభించడం శుభపరిణామం'

CM KCR Message On Forest Martyrs Day : ''జంగల్ బచావో–జంగల్ బడావో'ను చిత్తశుద్ధితో అమలు చేయాలి'

CM KCR Review on Palamuru Rangareddy Project : పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై నేడు సీఎం కేసీఆర్ సమీక్ష

Last Updated : Sep 15, 2023, 7:19 PM IST

ABOUT THE AUTHOR

...view details