BRS Focus on Telangana Assembly Elections : అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడటంతో. ప్రజల్లో సానుకూల ప్రభావం కలిగించే నిర్ణయాలపై బీఆర్ఎస్ సర్కార్ దృష్టిసారించింది. విపక్షాలకు ఎలాంటి అస్త్రాలు ఇవ్వకూడదని లక్ష్యంగా పెట్టుకుంది. నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్నరైతు రుణమాఫీని పూర్తిస్థాయిలో అమలు చేయాలని నిర్ణయించడమే దీనికి నిదర్శనంగా నిలుస్తోంది. ఇందుకోసం రూ.19,000 కోట్లను కేటాయించింది. నెలన్నరలోగా ఈ మొత్తాన్ని జమ చేయాలంటే అందుకు తగ్గట్లుగా నిధులను సమీకరించుకోవాల్సి ఉంటుంది.
Telangana Govt on Non-tax income : భారీ పన్నేతర ఆదాయం సమకూర్చుకోవాలని ప్రభుత్వం ప్రణాళిక
BRS Strategy for Telangana Assembly Elections 2023 : ఇప్పటికే రాష్ట్ర ఖజానాపై భారం ఎక్కువగా ఉన్నప్పటికి.. ఎన్నికల్లో ఇదే అంశాన్ని విపక్షాలు ప్రచారాస్త్రంగా చేసుకొనే అవకాశం ఎక్కువగా ఉండటంతో రుణమాఫీ చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. గత ఎన్నికల సమయంలో లక్ష వరకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చినా.. తర్వాత కాలంలో కరోనా కారణంగా రాష్ట్ర ఆదాయం తగ్గడం, ఇతర వ్యయాలు పెరగడంతో ఈ అంశాన్ని పక్కన పెట్టింది.
తిరిగి పునఃప్రారంభించిన ప్రభుత్వం.. గురువారమే రూ.18,241 కోట్ల బడ్జెట్ విడుదలకు ఉత్తర్వులు ఇచ్చింది. రూ.37,000 నుంచి రూ.41,000 లోపు రుణమున్న 62,758 మంది రైతుల ఖాతాల్లో రూ.237.85 కోట్లు జమ చేసింది. ఎన్నికలకు ముందుగా అన్నదాతలకు రుణమాఫీ మొత్తం చేరుతుండటంతో అందరికి గుర్తుండిపోతుందని, ఎన్నికల్లోనూ దీని ప్రభావం ఉంటుందని బీఆర్ఎస్ వర్గాలు అభిప్రాయపడ్డాయి. రుణమాఫీని విస్తృతంగా రైతుల్లోకి తీసుకెళ్లడానికి వీలుగా రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు కూడా నిర్వహిస్తోంది.
Telangana Assembly Elections 2023 : ఈ క్రమంలోనే రైతుల విషయంలో నిర్ణయం తీసుకుని ఒకరోజు గడవక ముందే.. ఉద్యోగ సంఘాల నాయకులు సీఎం కేసీఆర్‌ను కలిశారు. పీఆర్‌సీపై కమిషన్ ఏర్పాటు చేయడం.. మధ్యంతర భృతిని త్వరలోనే ప్రకటించడం లాంటివి ఈ సందర్భంగా చర్చకు వచ్చాయి. వీటిపైనా ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఉద్యోగ సంఘాల నాయకులు పేర్కొన్నారు. దీన్నిబట్టి త్వరలోనే పీఆర్‌సీ ఏర్పాటుతోపాటు ఐ.ఆర్.పైనా నిర్ణయం తీసుకొనే అవకాశముంది.
Telangana Decade Celebration 2023 : ఘనంగా ముగిసిన రాష్ట్ర దశాబ్ది వేడుకలు