BRS MP Nama Nageswararao Fires on Central Government : మణిపుర్ హింసాత్మక ఘటన దేశానికే సిగ్గుచేటని లోక్‌సభలో బీఆర్ఎస్ ఎంపీ నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు. విదేశాల్లోనూ భారత్ పరువు మంటగలిసిందని విమర్శించారు. మోదీ సర్కారుపై విపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై జరుగుతున్న చర్చలో బీఆర్ఎస్ తరపున నామ ప్రసంగించారు. ప్రధాని మోదీ మణిపుర్‌కు అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని ఆయన డిమాండ్ చేశారు. మణిపుర్‌లో శాంతి పునరుద్ధరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అని పునరుద్ఘాటించారు. ఈ క్రమంలోనే అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలని కేంద్రానికి నామ నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు.
Nama responded on Manipur issue :చిన్న రాష్ట్రాల పట్ల మోదీ సర్కార్ తీరు సరిగా లేదని నామ నాగేశ్వరరావు ఆరోపించారు. విభజన చట్టం హామీలను నెరవేర్చాలని కేంద్రాన్ని 9 సంవత్సరాలుగా కోరుతున్నామని గుర్తు చేశారు.కాజీపేటకు రైల్వేకోచ్ ఫ్యాక్టరీ మంజూరు చేయాలని ఎన్నోసార్లు అడిగామని పేర్కొన్నారు. కోచ్ ఫ్యాక్టరీలను మహారాష్ట్ర, గుజరాత్‌కు ఇచ్చి.. మాకు రిపేర్ ఫ్యాక్టరీ ఇచ్చారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో ట్రైబల్ యూనివర్సిటీ (Tribal University) ఏర్పాటు చేయాలని కోరామని నామ నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు.
Nama Comments: 'రాష్ట్రాన్ని చాలా విషయాల్లో కేంద్రం అన్యాయం చేస్తోంది..'
MP Nama Nageswararao Speech in LokSabha :తెలంగాణకు కేెెెంద్రం మెడికల్ కాలేజీలు, నవోదయ విద్యాసంస్థలు ఇవ్వట్లేదని విమర్శించారు. రాష్ట్రం పట్ల మోదీ సర్కార్ వివక్ష చూపిస్తోందని ధ్వజమెత్తారు. నవోదయ విద్యాలయాల కోసం ఎన్నోసార్లు లేఖలు రాశామని గుర్తు చేశారు. యూపీఏ ప్రభుత్వం మంజూరు చేసిన ఐటీఐఆర్ ప్రాజెక్టును (ITIR Project) కేెంద్ర ప్రభుత్వం రద్దు చేసిందని మండిపడ్డారు. తెలంగాణ కూడా దేశంలో భాగమే కదా అని నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు.
బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీకి కేంద్రం మొండిచెయ్యి.. కారణం ఆయనే : కేటీఆర్
Nama NageshwarRao on Telangana Development :తెలంగాణ పథకాలను కేంద్రం అనుసరిస్తోందని నామ నాగేశ్వరరావు తెలిపారు. ఇంటింటికి నల్లా ద్వారా మంచినీరు ఇస్తున్న.. ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే పెద్ద రాష్ట్రాల్లో ఏదైనా ఇంటింటికీ మంచినీరు ఇస్తోందా అని ప్రశ్నించారు. రూ.24,000 కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫార్సు చేసినా ఒక్క రూపాయి ఇవ్వలేదని మండిపడ్డారు. హర్ ఘర్ జల్ పథకం కింద అన్ని రాష్ట్రాలకు నిధులు ఇస్తున్నారని నామ నాగేశ్వరరావు వివరించారు.