BRS MLC KAVITHA on Adani companies: అదానీ వ్యవహారంపై కేంద్రానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నల వర్షం కురిపించారు.. ట్విటర్ వేదికగా ప్రజల పైసలతో ఆటలా? అని కవిత ప్రశ్నించింది. ఎల్ఐసీ పెట్టుబడులు ఆవిరవుతుంటే కేంద్రం ఎందుకు మౌనం వహిస్తోందని మండిపడ్డారు. సీబీఐ, ఈడీ రాజకీయ ప్రయోజనాల కోసమేనా మౌనం? అని ధ్వజమెత్తారు. ప్రజల డబ్బులతో ఆటలాడటం ఎంతవరకు సమంజసం అని అన్నారు.
ఎల్ఐసీలో పెట్టుబడులు పెట్టిన ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని ట్విటర్‌లో ప్రశ్నించారు. అదానీ కంపెనీల్లో ప్రభుత్వరంగ సంస్థ అయిన ఎల్ఐసీ పెట్టిన పెట్టుబడుల విలువ 11 శాతం మేర పడిపోవడం పట్ల కవిత స్పందించారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వానకిి ట్విట్టర్‌లో ప్రశ్నల వర్షం కురిపించారు. ఇంత పెద్ద కుంభకోణం జరిగి దాదాపు రూ.12 లక్షల కోట్లు నష్టపోయాయని అన్నారు. అయినా సీబీఐ, ఈడీ, రిజర్వ్ బ్యాంకు వంటి సంస్థలు ఎందుకు మౌనంగా ఉంటున్నాయని నిలదీశారు. ఆ సంస్థలను కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగించుకుంటారా అని మండిపడ్డారు.