BRS MLA Tickets Telangana 2023 :అధికార బీఆర్‌ఎస్‌లో టికెట్ల కోసం నేతల మధ్య తీవ్ర పోటీ కనిపిస్తోంది. నేడు జాబితా(BRS MLA Candidates List 2023) ప్రకటించే అవకాశం ఉండటంతో.. కొన్ని నెలలుగా చేస్తున్న ప్రయత్నాలకు మరింత పదును పెట్టారు. తమ సేవలను గుర్తించి అవకాశమివ్వాలని పార్టీ పెద్దలందరినీ నేతలు కోరుతున్నారు. వారం రోజులుగా ముమ్మర ప్రయత్నాలు చేశారు. అధిష్ఠానం ఆశీస్సులు పొందేందుకు యత్నిస్తూనే మద్దతుదారులతో సమావేశాలు, కార్యక్రమాలు నిర్వహిస్తూ బల ప్రదర్శనకు ప్రయత్నం చేస్తున్నారు. టికెట్ ఇవ్వకపోతే తాడో పేడో చూసుకుంటామంటూ అనుచరులతో పరోక్ష హెచ్చరికలు ఇస్తున్నారు. అనుకూల అంశాలను ప్రచారం చేసుకుంటూనే.. పార్టీలోని ప్రత్యర్థుల బలహీనతలు ఎత్తిచూపేలా ఎత్తులు పైఎత్తులు వేస్తున్నారు. ఆ పోటీ కొన్నిసార్లు శృతిమించి పలుచోట్ల రచ్చకెక్కాయి.
BRS Leaders Final Trials for MLA Ticket 2023 : హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో బీఆర్‌ఎస్ నేతల విబేధాలు పలు సందర్భాల్లో బయటపడ్డాయి. మేడ్చల్‌లో మంత్రి మల్లారెడ్డి(Minister Mallareddy), మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి బహిరంగ వేదికలపైనే విమర్శించుకున్నారు. ఉప్పల్‌లో ఎమ్మెల్యే భేతి సుభాశ్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ వర్గాలుగా విడిపోయి పోటీ పడగా.. బండారి లక్ష్మారెడ్డి హడావిడి లేకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. బండారి లక్ష్మారెడ్డికే టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతుండటంతో సుభాశ్ రెడ్డి, రామ్మోహన్ ఇప్పుడు ఒకటిగా మారి తమ ఇద్దరిలో ఎవరికైనా పర్వాలేదు కానీ లక్ష్మారెడ్డికి మాత్రం ఇవ్వొద్దని.. ఎమ్మెల్సీ కవితను కలిసి విజ్ఞప్తి చేశారు. కుత్బుల్లాపూర్‌లో ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు వర్గాలుగా విడిపోయి కార్యక్రమాలు చేపట్టారు. రాజేంద్రనగర్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌తో పాటు మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి ఆశిస్తున్నారు.
MLA Tickets Clash in BRS : బీఆర్‌ఎస్‌లో రచ్చకెక్కుతోన్న ఎమ్మెల్యే టికెట్ల రగడ..
BRS MLA Candidates List Telangana 2023 : అయితే బీఆర్‌ఎస్ నాయకత్వం మాత్రం ప్రకాశ్‌గౌడ్‌వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. కూకట్‌పల్లిలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఇప్పటికే జోరుగా ప్రచారం సాగిస్తుండగా.. గొట్టిముక్కల వెంకటేశ్వరరావు టికెట్‌పై ఆశతో పలు కార్యక్రమాలు చేస్తున్నారు. వికారాబాద్‌లో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి.. పట్నం మహేందర్‌రెడ్డి మధ్య భగ్గుమంటోంది. మహేందర్‌రెడ్డి హస్తం పార్టీ వైపు చూస్తున్నట్లు ప్రచారం సాగినా.. బీఆర్‌ఎస్ నాయకత్వం పిలిచి నచ్చచెప్పి మంత్రి పదవిపై హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
అంబర్‌పేటలో గత ఎన్నికల్లో బీజేపీ నేత కిషన్ రెడ్డిపై గెలిచిన న్యాయవాది కాలేరు వెంకటేశ్ పోటీకి మళ్లీ ఏర్పాట్లు చేసుకుంటుండగా.. గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఎడ్ల సుధాకర్‌రెడ్డి పోటాపోటీ కార్యక్రమాలు చేస్తున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ్యుడు సాయన్న అకాల మరణంతో అవకాశం ఇవ్వాలని ఆయన కుమార్తె లాస్య నందిత కోరుతుండగా.. రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఛైర్మన్ క్రిశాంక్, శ్రీ గణేశ్, బేవరేజెస్ కార్పొరేషన్ ఛైర్మన్ గజ్జెల నగేశ్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
BRS MLAs List Telangana 2023 : ఆసిఫాబాద్‌లో ఆత్రం సక్కు, కోవాలక్ష్మీ ప్రయత్నిస్తుండగా.. కోవాలక్ష్మీ వైపు బీఆర్‌ఎస్ అధిష్ఠానం మొగ్గు చూపుతోంది. మంచిర్యాలలో కొనసాగించాలని లేదా కుమారుడికి అవకాశమవ్వాలని ఎమ్మెల్యే దివాకర్ రావు కోరుతుండగా.. మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్, భారత జాగృతి లీగల్ సెల్ కన్వీనర్ తిరుపతివర్మ ఆశిస్తున్నారు. ఖానాపూర్‌లో రేఖా నాయక్, భూక్యా జాన్సన్ నాయక్ పోటాపోటీ ప్రయత్నాలు చేస్తుండగా.. అధిష్ఠానం భూక్యా జాన్సన్ నాయక్‌కు ప్రాధాన్యమిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. బోథ్ నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే రాఠోడ్ బాపూరావుతో పాటు మాజీ ఎంపీ నగేశ్, జడ్పీటీసీ సభ్యుడు అనిల్ జాదవ్ ప్రయత్నిస్తున్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి మూడోసారి తనకే టికెట్ అంటుండగా.. ఎమ్మెల్సీ భానుప్రసాద్ ప్రయత్నాలు చేస్తున్నారు.
MLA Tickets Clash in BRS : బీఆర్‌ఎస్ కారులో కుదుపులు.. నేతల మధ్య ముదిరిన విభేదాలు..!