BRS focus on Telangana Assembly Elections 2023 : రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్లో ఆశావహుల దూకుడు పెరుగుతోంది. ముఖ్యంగా ఒకరికంటే ఎక్కువ మంది నాయకులున్న నియోజకవర్గాల్లో విభేదాలు అధికమవుతున్నాయి. ఇప్పటికే పోటాపోటీ కార్యక్రమాలతో ఎవరికి వారు సొంతవర్గాలను పెంచుకుంటున్నారు. పరస్పర ఆరోపణలతో రచ్చకెక్కుతున్నారు. ఇలాంటి వారిపై పార్టీ అధిష్ఠానం దృష్టి సారించింది. కొందరు నాయకులనుబీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, మరికొందరిని కేటీఆర్, హరీశ్‌రావులు పిలిపించుకుని సర్దిచెబుతున్నారు. పద్ధతి మారకుంటే బాగోదంటూ గట్టిగా హెచ్చరిస్తున్నారు. పార్టీ మారే ఆలోచన చేస్తున్న వారికి నచ్చజెప్పే పనిని పలువురు మంత్రులకు అప్పగించారు.
BRS Party Latest News :రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాలో ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీల మధ్య... ఎమ్మెల్యేలకు, జడ్పీ ఛైర్మన్ల మధ్య... ఎంపీలకు, ఎమ్మెల్యేలకు మధ్య టికెట్ల కోసం పంతం పెరుగుతోంది. మరికొన్నిచోట్ల ఎమ్మెల్యేలపై ద్వితీయ శ్రేణి నాయకులు అసంతృప్తితో ఉన్నారు. ఉమ్మడి వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లోని ఎక్కువ నియోజకవర్గాల్లో ఈ సమస్యలున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య ఎమ్మెల్సీ కడియం శ్రీహరిపై వరుసగా తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తుండటం, శ్రీహరీగట్టిగానే ప్రతి విమర్శలకు దిగడంతో వివాదం తీవ్రమైంది. దాంతో రాజయ్యను కేటీఆర్‌పిలిపించి మాట్లాడాకవాతావరణం ప్రస్తుతానికి సద్దుమణిగింది.
BRS MLA Tickets Issue Telangana:అలాగేమహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల్లోనూ విభేదాలు ఉన్నాయి. ఎమ్మెల్సీ వర్గీయులు మహబూబాబాద్ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా సమావేశం నిర్వహించి సిట్టింగ్ ఎమ్మెల్యేకు టిక్కెట్ ఇవ్వొద్దని కోరారు. మరో మేజర్ గ్రామపంచాయతీలోని నాయకులూ ఇలాంటి సమావేశమే నిర్వహించారు. పార్టీ నాయకత్వం ఇక్కడ సమస్య పరిష్కార బాధ్యతను మంత్రి సత్యవతి రాఠోడ్‌కు అప్పగించినట్లు తెలిసింది. డోర్నకల్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌కు వ్యతిరేకంగా పార్టీలోనే మరో వర్గం పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. జనగామలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డికివ్యతిరేకంగా ఆయన కూతురే కేసులుపెట్టడం, నాయకుల మధ్య విభేదాల నేపథ్యంలో జిల్లా ఎమ్మెల్సీ ఒకరికి ఈ నియోజకవర్గంపై దృష్టి కేంద్రీకరించాలని అధిష్ఠానం సూచించినట్లు సమాచారం.