తెలంగాణ

telangana

ETV Bharat / state

చిదంబరం మాట్లాడిన తీరు చూస్తుంటే హంతకుడే సంతాపం తెలిపినట్టుంది : కేటీఆర్ - చిదంబరంపై ఎక్స్​ వేదికగా స్పందనలు

BRS Ministers Fires on Chidambaram Comments on Telangana : తెలంగాణ ఉద్యమంలో స్వరాష్ట్రం కోసం ఆత్మబలిదానం చేసుకోవం ఎంతో బాధాకరమని కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రంలో దుమారం రేపుతున్నాయి. చిదంబరం వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఆయన మాట్లాడిన తీరు చూస్తుంటే హంతకుడే సంతాపం తెలిపినట్టుందని కేటీఆర్ అన్నారు. మరోవైపు హిరోషిమాపై అణుబాంబు వేసిన అమెరికా సారీ చెప్పినట్టుందని హరీశ్ రావు ఎద్దేవా చేశారు.

Harishrao
Minister KTR On Congress Leader Chidambaram Statements

By ETV Bharat Telangana Team

Published : Nov 17, 2023, 1:52 PM IST

BRS Ministers Fires on Chidambaram Comments on Telangana :తెలంగాణ ఉద్యమంలో కొందరు ఈ నేల కోసం ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని.. ఆ ఆత్మహత్యలకు అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆలస్యం చేయడమే కారణమని, కాంగ్రెస్‌దే బాధ్యత అని బీఆర్ఎస్​ ఆరోపించడం సరికాదని కాంగ్రెస్​ మాజీ మంత్రి చిదంబరం వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ సీఎం అయిన తరవాత ఈ ప్రభుత్వ పాలనలో నాలుగు వేల మంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు. ఈ ఆత్మహత్యలకు బాధ్యులు ఎవరని ఆయన ప్రశ్నించారు.

చిదంబరం వ్యాఖ్యలపై బీఆర్​ఎస్​ మంత్రులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. కాంగ్రెస్‌ నేత చిదంబరం మాట్లాడిన తీరు చూస్తుంటే.. హంతకుడే సంతాపం తెలిపినట్లుగా ఉందని మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు విమర్శించారు. తెలంగాణపై ప్రకటన చేసిన తర్వాత.. దాన్ని వెనక్కి తీసుకున్న ఫలితంగానే ఉద్యమంలో యువకులు బలిదానం చేశారని పేర్కొన్నారు.

'ఆర్థిక వ్యవస్థ పతనంపై ప్రజల్లో భయాందోళనలు'

KTR on Chidambaram Comments on Telangana : రాష్ట్ర సాధన ఉద్యమంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయినందుకు బాధగా ఉందన్న చిదంబరం వ్యాఖ్యలపై కేటీఆర్‌ ‘ఎక్స్‌’ వేదికగా స్పందించారు. చిదంబరం స్పందన చాలా ఆలస్యమైందన్న కేటీఆర్‌.... 1952-2014 మధ్య కాలంలో వందల మంది తెలంగాణ యువత ఆత్మబలిదానాలు చేసుకోవడానికి కాంగ్రెస్‌ పార్టీదే బాధ్యత అని స్పష్టం చేశారు. ఇప్పుడు మీరు ఎంత కష్టపడ్డా.. కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణకు చేసిన అన్యాయాలను ప్రజలు మర్చిపోరన్నారు. మరోవైపు చిదంబరం వ్యాఖ్యలపై ‘ఎక్స్‌’ వేదికగా స్పందించిన మంత్రి హరీశ్‌ రావు .. అప్పటి నెహ్రూ ప్రభుత్వం తాత్సారం చేయడం వల్లే కదా పొట్టి శ్రీరాములు చనిపోయారని అన్నారు. చరిత్ర తెలియనిది కేసీఆర్‌కు కాదు.. చిదంబరమే వక్ర భాష్యాలు చెబుతున్నారని మండిపడ్డారు.

చిదంబరానికి నిరసన సెగ.. సొంత పార్టీ న్యాయవాదుల నుంచే..

ఇంతకీ చిదంబరం ఏం అన్నారంటే.. : తెలంగాణలో కేసీఆర్‌ సర్కారు అన్ని రంగాల్లో విఫలమైందని కేంద్ర మాజీ మంత్రి చిదంబరం విమర్శించారు. ద్రవ్యోల్బణంతో పాటు నిరుద్యోగంతోపాటు అన్ని రకాలనిత్యావసరాల సరుకుల ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. గాంధీభవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడిన చిదంబరం... వంట గ్యాస్ ధరలు తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కువగా ఉన్నాయని ధ్వజమెత్తారు. బీఆర్​ఎస్​ పాలనలో అప్పులు 404శాతం పెరిగాయని, ప్రజలపై తలసరి అప్పు దాదాపుగా లక్ష రూపాయలు ఉందని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో కొందరు ఈ నేల కోసం ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని చిదంరబం వ్యాఖ్యానించారు.

"కొత్త రాష్ట్రంలో కేసీఆర్‌ సర్కార్‌ అన్ని రంగాల్లో విఫలమవడంతో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, నిత్యావసరాల ధరలు భారీగా పెరిగాయి. పెట్రోల్‌, డీజిల్‌ ధరలూ దేశంలోకెల్లా ఇక్కడే ఎక్కువగా ఉన్నాయి. టీఎస్‌పీఎస్సీలో 22 లక్షల మంది నిరుద్యోగులు పేర్లు నమోదు చేసుకున్నారు. నిరుద్యోగులకు నెలకు రూ.3,016 భృతి చెల్లిస్తామని 2018 ఎన్నికల్లో హామీ ఇచ్చి అమలు చేయలేదు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కాంగ్రెస్‌కు ప్రజలు ఒక్క అవకాశం ఇవ్వాలి. కాంగ్రెస్‌ ప్రకటించిన గ్యారంటీల అమలుకు నిధులను సమకూర్చుకునేందుకు రాష్ట్ర నేతలు హోంవర్క్‌ చేసిన తరవాతే వాటిని ప్రకటించారు. తెలంగాణలో 12 మంది సీఎం పదవికి పోటీపడుతున్నారని బీఆర్ఎస్ విమర్శిస్తోందంటే ఇది ప్రశంసలా భావిస్తాం. అంతమంది సమర్థులున్న ప్రజాస్వామ్య పార్టీ కాంగ్రెస్‌ అని గుర్తించాలి. ఏ ఒక్కరో సీఎంగా పాలించే పార్టీ మాది కాదు’ - చిదంబరం, కేంద్ర మాజీ మంత్రి

కేంద్రమాజీ మంత్రి చిదంబరం రాకతో... సిక్రిందాబాద్​లో సందడి

విపక్షాల కూటమి సమావేశానికి 26 పార్టీలు.. ఉమ్మడి అభ్యర్థుల కోసం కమిటీ!

ABOUT THE AUTHOR

...view details