తెలంగాణ

telangana

ETV Bharat / state

BRS Ministers Counter on PM Modi Speech : 'ప్రధాని హోదాలో వచ్చి.. కేసీఆర్‌ మీద అక్కసు వెళ్లగక్కి వెళ్లారు' - Minister Jagadeesh Reddy Counter on PM Modi Speech

BRS Ministers Counter on PM Modi Hanamkonda Speech : పార్టీలను చీల్చి.. ప్రభుత్వాలను కూల్చేది మోదీ సర్కారని బీఆర్‌ఎస్‌ మంత్రులు శ్రీనివాస్‌ గౌడ్‌, జగదీశ్‌ రెడ్డి విమర్శించారు. నరేంద్ర మోదీ.. ప్రధాని హోదాలో వచ్చి.. కేసీఆర్ మీద అక్కసు వెళ్లగక్కి వెళ్లారని మండిపడ్డారు. ఈ క్రమంలోనే బీజేపీ పాలనకు కేసీఆర్ చరమగీతం పాడబోతున్నారని పేర్కొన్నారు.

BRS Ministers Counter on PM Modi Speech
BRS Ministers Counter on PM Modi Speech

By

Published : Jul 8, 2023, 4:39 PM IST

Updated : Jul 8, 2023, 4:53 PM IST

BRS Ministers comments on modi warangal speech : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హనుమకొండలో చేసిన ప్రసంగంపై బీఆర్‌ఎస్‌ మంత్రులు తీవ్రస్థాయిలో ప్రతి విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఏ అభివృద్ధి జరగకపోతే.. తెలంగాణలోని వివిధ శాఖలకు దిల్లీలో అవార్డులు ఎందుకిస్తున్నట్లు అని హరీశ్‌రావు ప్రశ్నించగా.. వరంగల్‌ పర్యటనకు వచ్చిన మోదీ.. 9 ఏళ్లలో యువత కోసం చేసిన ఒక్క మంచిపనైనా ప్రజలకు చెప్పి ఉంటే బాగుండేదని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. ఈ క్రమంలోనే బీఆర్‌ఎస్‌ఎల్పీలో మాట్లాడిన మంత్రులు శ్రీనివాస్‌ గౌడ్, జగదీశ్‌ రెడ్డి.. ప్రధాని స్పీచ్‌పై తీవ్రంగానే స్పందించారు.

Minister Srinivas Goud Counter on PM Modi Speech : పార్టీలను చీల్చి.. ప్రభుత్వాలను కూల్చేది మోదీ సర్కారు అని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ విమర్శించారు. తెలంగాణలోనూ ప్రభుత్వాన్ని కూల్చాలని బీజేపీ కుట్ర చేసిందని.. అయితే మోదీ కుట్రలు, పాచికలు తెలంగాణలో పారలేదని తెలిపారు. బీజేపీ కుట్రలను తెలంగాణ ప్రజలు సాగనివ్వరన్నారు. బీజేపీ విధానాల వల్లే భారత్‌ ఇంకా అభివృద్ధి చెందలేదని ఆరోపించిన మంత్రి.. తెలంగాణ పథకాలు ఇతర రాష్ట్రాల్లోనూ అమలు చేయాలని డిమాండ్లు వస్తున్నాయని స్పష్టం చేశారు. మనకంటే చిన్న దేశాలు అభివృద్ధి సాధిస్తుంటే.. భారత్‌ ఇంకా ముందుకు వెళ్లట్లేదని మండిపడ్డారు.

Harish Rao Counter on PM Modi Speech : 'తెలంగాణలో అభివృద్ధి జరగకపోతే.. దిల్లీలో అవార్డులు ఎందుకిచ్చినట్లు?'

'పార్టీలను చీల్చి ప్రభుత్వాలను కూల్చేది మోదీ సర్కారు. తెలంగాణలోనూ ప్రభుత్వాన్ని కూల్చాలని బీజేపీ కుట్ర చేసింది. మోదీ కుట్రలు, పాచికలు తెలంగాణలో పారలేదు. బీజేపీ కుట్రలను తెలంగాణ ప్రజలు సాగనివ్వరు. తెలంగాణ పథకాలు ఇతర రాష్ట్రాల్లోనూ అమలు చేయాలని డిమాండ్లు వస్తున్నాయి. బీజేపీ విధానాల వల్లే భారత్‌ ఇంకా అభివృద్ధి చెందలేదు. మనకంటే చిన్న దేశాలు అభివృద్ధి సాధిస్తుంటే.. భారత్‌ ఇంకా ముందుకు వెళ్లట్లేదు.' - శ్రీనివాస్‌ గౌడ్‌, ఆబ్కారీ శాఖ మంత్రి

Minister Jagadeesh Reddy Counter on PM Modi Speech : వరంగల్ సభలో ప్రధాని మోదీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై చేసిన ఆరోపణలను విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఖండించారు. సూర్యాపేటలో మాట్లాడిన ఆయన.. ప్రధాని హోదాలో ఉన్న మోదీ తన స్థాయిని తగ్గించుకొని అబద్ధాలు చెప్పారని విమర్శించారు. అవినీతిలో బీజేపీ కాంగ్రెస్‌ను మించిపోయిందని ఎద్దేవా చేశారు. మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటకలో జరిగిన అవినీతే బీజేపీ పాలనకు సాక్ష్యం అన్నారు. తమ బండారం ఎక్కడ బయటపడుతుందో అనే భయంతోనే కేసీఆర్ కుటుంబంపై మోదీ అవాకులు, చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. బ్యాంకులకు రూ.లక్షల కోట్లు టోకరా పెట్టిన బడా బాబులే బీజేపీకి ఆప్తమిత్రులని ఆరోపించారు. కొద్దిమంది కోసం దేశాన్ని తాకట్టు పెట్టిన ఘనుడు ప్రధాని మోదీ అని తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. ఈ క్రమంలోనే చైతన్యవంతమైన వరంగల్, తెలంగాణ ప్రజానీకం మోదీ అబద్ధాలను నమ్మరన్నారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టి.. ప్రభుత్వాలను కూల్చడమే బీజేపీ సర్కార్ పని అని విమర్శించారు. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రజల మనసులో స్థానం లేదన్న ఆయన.. బీజేపీ దుర్మార్గపు పాలనకు త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ చరమగీతం పాడబోతున్నారని పేర్కొన్నారు.

ప్రధాని హోదాలో కేసీఆర్‌ మీద అక్కసు వెళ్లగక్కారు. అవినీతిలో కాంగ్రెస్‌ను మించింది బీజేపీ. బ్యాంకులకు రూ.వేల కోట్లు ఎగవేసిన బడా బాబులు మోదీ బంధువులే. కొద్దిమంది కోసం దేశాన్ని తాకట్టు పెట్టిన ఘనుడు మోదీ. రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చడమే మోదీ సర్కార్ పని. బీజేపీ పాలనకు కేసీఆర్ చరమగీతం పాడబోతున్నారు. - జగదీశ్‌రెడ్డి, విద్యుత్‌ శాఖ మంత్రి

BRS Ministers Counter on PM Modi Speech : 'ప్రధాని హోదాలో వచ్చి.. కేసీఆర్‌ మీద అక్కసు వెళ్లగక్కి వెళ్లారు'

ఇవీ చూడండి..

Kajipet Wagon Factory : కాజీపేట రైల్వే వ్యాగన్ తయారీ పరిశ్రమ ఎలా ఉంటుందంటే..

KTR Tweet About AP Reorganization Act Guarantees : 'ఏపీ పునర్విభజన చట్టం హామీలు ఎటు పోయాయి'

Last Updated : Jul 8, 2023, 4:53 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details