తెలంగాణ

telangana

ETV Bharat / state

BRS fires on Congress : 'కాంగ్రెస్ నేతలు బీసీలను కించపరుస్తున్నారు'

BRS Ministers Comments on Congress : కాంగ్రెస్ నేతలు బీసీలను కించపరుస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధ్వజమెత్తారు. బీసీలందరనీ ఏకం చేస్తామని.. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటించి భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని పేర్కొన్నారు. కొందరు బీసీ ఓట్లతో గెలిచి.. వారినే టార్గెట్‌ చేస్తున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. బీసీలను వెనక్కి నెట్టేలా కొందరు నేతలు చూస్తున్నారని మరో మంత్రి గంగుల ఆరోపించారు.

BRS Ministers
BRS Ministers

By

Published : Jul 19, 2023, 3:58 PM IST

BRS BC Ministers fires on Congress : రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైంది. ఇప్పటికే కొన్ని పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతు ఎన్నికల బరిలో దిగేందుకు సిద్ధంకాగా.. మరికొన్ని పార్టీలు పొత్తులతో బలం పెంచుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ఓ వైపు ఇప్పటికే అధికార బీఆర్ఎస్​ మూడో దఫా విజయం సాధించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తుంటే.. ప్రతిపక్షాలు సైతం ఈసారి తెలంగాణలో అధికారం చేజిక్కుంచుకోవాలని తహతహలాడుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే రాష్ట్రంలో ఫ్రీ పవర్ మంటలు కొనసాగుతుండగా తాజాగా 'బీసీ' నినాదం పై రాజకీయ పార్టీలు కన్నేశాయి.

Ministers fires on Congress : ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీసీ ఓట్లను ఆకర్షించేందుకు పార్టీలు ఎత్తులు పై ఎత్తులు రచిస్తున్నాయి. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్​లో బీసీలకు సీట్ల కేటాయింపు వివాదం మెల్లమెల్లగా వెలుగులోకి వస్తోంది. తాజాగా అధికార పార్టీలోని బీసీ మంత్రులు ఇవాళ మంత్రి తలసాని ఇంట్లో సమావేశమయ్యారు. ఈ భేటీలో అబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, ఇతర బీసీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, బీసీలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రులు... బీసీల పట్ల కాంగ్రెస్​ పార్టీ వ్యవహారిస్తున్న తీరుపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు.

Talasani Srinivas Yadav fires on Congress : కాంగ్రెస్ నేతలు బీసీలను కించపరుస్తున్నారని పశు సంవర్ధక శాఖమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధ్వజమెత్తారు. బీసీ నేతలను విమర్శిస్తే ఊరుకోమని తలసాని హెచ్చరించారు. బీసీలందరనీ ఏకం చేస్తామని.. త్వరలోనే కార్యాచరణ ప్రకటించి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని మంత్రి తలసాని వ్యాఖ్యానించారు. తెలంగాణలో బీసీలను విమర్శిస్తే కాంగ్రెస్ నేతలను ప్రజల్లో తిరగకుండా చేస్తామని మండిపడ్డారు. బీఆర్​ఎస్ హయాంలో బీసీ ఆత్మగౌరవ భవనాలు నిర్మించామని మంత్రి తలసాని తెలిపారు. రైతుబంధు, రైతుబీమా వల్ల ఎక్కువగా బీసీ వర్గాలకు లబ్ధి జరుగుతోందన్నారు.

త్వరలో బీసీల భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం :బీసీ నేతలను ఎదగకుండా కాంగ్రెస్ కుట్ర చేస్తోందని అబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ఆరోపించారు. వ్యక్తులను టార్గెట్ చేయాలని ఆ పార్టీ భావిస్తోందని వ్యాఖ్యానించారు. కొందరు ఎన్నికలలో బీసీ ఓట్లతో గెలిచి.. ఇప్పుడు బీసీలనే టార్గెట్‌ చేస్తున్నారని శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. నోరు ఉందని ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. త్వరలో బీసీల భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. రాష్ట్రంలో బీసీల జనాభా 56 శాతం ఉందని మరో మంత్రి గంగుల కమలాకర్‌ పేర్కొన్నారు. బీసీలను వెనక్కి నెట్టేలా కొందరు నేతలు చూస్తున్నారని గంగుల ఆరోపించారు. బీసీలు బానిసలు కాదని మంత్రి గంగుల వ్యాఖ్యానించారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details