తెలంగాణ

telangana

ETV Bharat / state

టోల్​ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోండి.. కేంద్రానికి ప్రశాంత్​రెడ్డి లేఖ - Prashant Reddy demands to withdraw toll tax hike

Prashant Reddy letter to centre On Toll Tax: ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి టోల్ ఛార్జీలు పెరగనున్నాయి. ఈ క్రమంలో కేంద్రం నిర్ణయాన్ని బీఆర్ఎస్ మంత్రి ప్రశాంత్ రెడ్డి వ్యతిరేకించారు. టోల్​ టాక్స్ పెంపు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రికి లేఖ రాశారు. ఇప్పటి వరకు తెలంగాణ నుంచి టోల్​ టాక్స్​ రూపంలో ఎంత వసూల్ చేశారనే విషయాన్ని ఆ లేఖలో పేర్కొన్నారు.

prasanth reddy
prasanth reddy

By

Published : Mar 30, 2023, 12:02 PM IST

Prashant Reddy letter to Centre On Toll Tax: ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి జాతీయ రహదారులపై టోల్ టాక్స్ రేట్ల పెంపుదల నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కేంద్ర రోడ్డు, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీకి బహిరంగ లేఖ రాశారు. ఇప్పటికే వసూలు చేస్తున్న టోల్ టాక్స్ తెలంగాణ ప్రజలకు పెనుభారంగా మారిందని తెలిపారు. మళ్లీ ఛార్జీలు పెంచితే 'మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు' అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

Prashant Reddy demands to withdraw toll tax hike : రాష్ట్ర పరిధిలోని 32 టోల్​గేట్ల వద్ద కేంద్రం ప్రభుత్వం టోల్​ టాక్స్​ వసూలును పెంచుతున్నట్లు తెలిసిందని మంత్రి ప్రశాంత్​రెడ్డి లేఖలో పేర్కొన్నారు. 2014లో తెలంగాణ నుంచి రూ. 600 కోట్ల టోల్​టాక్స్​ను కేంద్ర ప్రభుత్వం వసూలు చేసిందని తెలిపారు. ప్రతి ఏడాది ఈ ఛార్జీలు పెంచుకుంటూ పోవడం వల్ల.. 2023 నాటికి రూ. 1824 కోట్లకు చేరుకుందని అన్నారు. తొమ్మిదేళ్లలో టోల్​ టాక్స్​ను 300శాతం పెంచారని మండిపడ్డారు. ఈ టాక్స్​ వల్ల ట్రక్కుల ద్వారా సరఫరా చేసే నిత్యావసర ధరలు, సామాన్యులు ప్రయాణించే బస్సు ఛార్జీలు పెరిగాయని.. ఫలితంగా సామాన్యులుపై భారం పడుతోందని చెప్పారు.

toll tax hike news : తెలంగాణలో జాతీయ రహదారుల కోసం మంజూరీలు.. కాగితాల మీద కొండంత ఉంటే, ఖర్చు చేసింది మాత్రం గోరంతే గానే కనబడుతుందని లేఖలో మంత్రి ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. 2014 నుంచి ఇప్పటి వరకు కేంద్రం.. రాష్ట్రంలో 113 జాతీయ రహదారుల ప్రాజెక్టులు, సీఆర్ఐఎఫ్ పనులకు రూ. 1,25,176 కోట్లు మంజూరు చేసినట్లు కాగితాలపై చూపిస్తున్నప్పటికీ.. ఈ తొమ్మిదేళ్లలో ఖర్చు చేసింది కేవలం రూ. 20,350 కోట్లు మాత్రమేనని తెలిపారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు ద్వారా.. వాటిపై అదనపు రోడ్ సెస్సుల పేరిట తెలంగాణ నుంచి తొమ్మిదేళ్ల కాలంలో కేంద్రం ఎన్ని కోట్లు వసూలు చేసింది? ఆ డబ్బు ఎటు పోతుందో రాష్ట్ర ప్రజలకు లెక్క చెప్పాల్సిన అవసరముందని ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారుల కోసం రాష్ట్రంలో లక్షల కోట్లు ఖర్చు చేసిందని పదేపదే అబద్దాలు ప్రచారం చేస్తున్న రాష్ట్ర బీజేపీ నేతలకు కేంద్ర ప్రభుత్వం వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉందని ప్రశాంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రజలపైన బలవంతంగా అబద్ధాలను రుద్దుతోన్న బీజేపీలను అడ్డుకోవాల్సిన బాధ్యత కేంద్రానిదేనని అన్నారు. టోల్​టాక్స్, పెట్రోల్​, డీజిల్​పై సెస్​లు వసూలు చేస్తూ.. సామాన్యూలను అరిగోస పెడుతున్న కేంద్ర ప్రభుత్వం తమ వైఖరి మార్చుకోవాలని.. నాలుగు కోట్ల మంది ప్రజల పక్షాన విజ్ఞప్తి చేస్తున్నానని మంత్రి ప్రశాంత్​ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details