BRS Working President KTR at Raj Bhavan :పదేళ్లలో బీఆర్ఎస్ పార్టీ అనేక అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టిందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గుర్తుచేశారు. తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ ముఖ్యనేతలు సమావేశమయ్యారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడుకేటీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు పాల్గొన్నారు.
BRS Meeting at Telangana Bhavan : ఈ సమావేశంలో ఎన్నికల ఫలితాలు, భవిష్యత్ కార్యాచరణపై బీఆర్ఎస్ నేతల చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. ఎన్నికల ఫలితంగా ప్రజలు మరో పార్టీకి అవకాశం ఇచ్చినా, బీఆర్ఎస్ గౌరవప్రదమైన స్థానాలను కట్టబెట్టుకుందని స్పష్టం చేశారు. ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష బాధ్యతను విజయవంతంగా నిర్వహిద్దామని ఎమ్మెల్యేలు, నేతలతో చెప్పారు. బీఆర్ఎస్ నాయకత్వంపై సానుకూల స్పందన వస్తోందని వెల్లడించారు.
KTR, Telangana Elections Results 2023 Live : కాంగ్రెస్‌కు గుడ్ లక్ - ఓడిపోయామని బాధగా ఉన్నా
KTR on Telangana Election Results 2023 :రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోతుందని అనుకోలేదంటూ అన్ని వర్గాల నుంచి మెసేజ్లు వసున్నాయని తమ పార్టీ నేతలు చెబుతున్నారని కేటీఆర్ తెలిపారు. త్వరలోనే బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తామని వివరించారు. తెలంగాణ భవన్ కేంద్రంగా ప్రజలకు అందుబాటులో ఉంటామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు.