తెలంగాణ

telangana

ETV Bharat / state

LIVE UPDATES : ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు తెలివిగా ఆలోచించాలి: కేసీఆర్‌

BRS Manifesto 2023
BRS Manifesto Release

By ETV Bharat Telangana Team

Published : Oct 15, 2023, 11:59 AM IST

Updated : Oct 15, 2023, 5:16 PM IST

17:15 October 15

  • కొన్ని పార్టీలు వచ్చి ఇప్పుడు మాయమాటలు చెప్తాయి: కేసీఆర్‌
  • ఒక్క అవకాశం ఇవ్వమని కాంగ్రెస్‌ పార్టీ అడుగుతోంది: కేసీఆర్‌
  • కాంగ్రెస్‌ పార్టీకి ఈ రాష్ట్ర ప్రజలు పది, పన్నెండు అవకాశాలు ఇచ్చారు
  • పదికి పైగా అవకాశాలు పొందిన కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రాన్ని అంధకారం చేసింది
  • 2014లో రూ.200 ఉన్న పింఛన్లను రూ.వెయ్యికి పెంచాం: కేసీఆర్‌
  • ఆర్థిక పరిస్థితి మెరుగుపడగానే పింఛన్లను రెట్టింపు చేశాం: కేసీఆర్‌
  • ఎవరూ అడగకుండానే రైతుల కోసం రైతుబంధు తెచ్చాం: కేసీఆర్‌
  • రైతుబంధుతో రాష్ట్ర వ్యవసాయ విధానమే మారిపోయింది
  • కాంగ్రెస్‌ హయాంలో విద్యుత్‌ సరఫరా ఎలా ఉండేదో ప్రజలు ఆలోచించాలి
  • ఇప్పుడు ఎక్కడా ట్రాన్స్‌ఫార్మర్లు, మోటార్లు కాలటం లేదు
  • ప్రాజెక్టులు నిర్మించి సాగునీరు, తాగునీరు తెచ్చుకున్నాం: కేసీఆర్

17:14 October 15

  • ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు తెలివిగా ఆలోచించాలి: కేసీఆర్‌
  • స్పష్టమైన అవగాహనతో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలి
  • 9 ఏళ్ల క్రితం తెలంగాణ ఎలా ఉండేది... ఇప్పుడు ఎలా ఉంది: కేసీఆర్‌
  • 9 ఏళ్ల క్రితం విద్యుత్ కొరత, సాగునీరు, తాగునీరు లేదు, రాష్ట్రం నుంచి ప్రజల వలసలు ఉండేవి
  • సమస్యలు పరిష్కరానికి కొన్ని నెలల పాటు మేధోమథనం చేశాం
  • అందరి సహకారంతో ఇవాళ రాష్ట్రాన్ని అన్ని అంశాల్లో నంబర్‌ వన్‌గా నిలిపాం
  • వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లో మనకు ఎవరూ సాటి రారు, పోటీ లేరు
  • ఇప్పటివరకు సాధించిన విజయాలు ఇలాగే కొనసాగాలి: కేసీఆర్‌

16:51 October 15

  • హుస్నాబాద్‌ ప్రజా ఆశీర్వాద సభకు చేరుకున్న సీఎం కేసీఆర్‌

16:08 October 15

  • ప్రగతిభవన్‌ నుంచి హుస్నాబాద్‌కు బయలుదేరిన సీఎం కేసీఆర్‌
  • హుస్నాబాద్‌లో ప్రజా ఆశీర్వాద సభకు హాజరుకానున్న కేసీఆర్‌
  • హుస్నాబాద్‌లో భారాస ఎన్నికల శంఖారావం పూరించనున్న కేసీఆర్‌

14:56 October 15

  • జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో లక్ష రెండు పడకగదుల ఇళ్లు
  • అగ్రవర్ణ పేదల కోసం ప్రతి నియోజకవర్గానికి ఒక గురుకుల పాఠశాల
  • మహిళా సంఘాలకు స్వశక్తి భవనాలు
  • రాష్ట్రంలో అనాథల కోసం ప్రత్యేక పాలసీ రూపొందిస్తాం
  • ప్రభుత్వ ఉద్యోగుల ఓపీఎస్‌ కోసం కమిటీ ఏర్పాటు

14:41 October 15

  • రైతు బంధు మెుదటి సంవత్సరం రూ.12 వేల వరకు పెంపు
  • సౌభాగ్య లక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతి నెల రూ.3వేలు
  • అర్హులైన లబ్ధిదారులకు రూ.4 వందలకే గ్యాస్‌ సిలిండర్‌
  • అక్రిడిటేషన్‌ ఉన్న ప్రతి జర్నలిస్టుకు రూ.4 వందలకే గ్యాస్‌ సిలిండర్‌
  • కేసీఆర్‌ ఆరోగ్యరక్ష పేరుతో రూ.15 లక్షల వరకు బీమా పథకం
  • జర్నలిస్టులకు ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో రూ.15 లక్షల వరకు వైద్య సేవలు

14:31 October 15

  • దివ్యాంగుల పింఛను రూ.6 వేల వరకు పెంపు
  • దివ్యాంగుల పింఛను తొలి ఏడాది రూ. 5వేలకు పెంపు
  • దివ్యాంగుల పింఛను ప్రతి ఏటా రూ.300 చొప్పున పెంపు
  • అర్హులైన పేద మహిళలకు రూ.3వేలు చొప్పున భృతి

14:29 October 15

  • దశల వారీగా ఆసరా పింఛన్ల మెుత్తం పెంపు
  • మెుదటి ఏడాది రూ.3 వేలకు పెంపు
  • ఆసరా పింఛన్లు ఏటా రూ.5వందల చొప్పున రూ.5వేల వరకు పెంపు

14:26 October 15

  • తెల్ల రేషన్‌ కార్డు ఉన్న కుటుంబాలకు సన్నబియ్యం అందిస్తాం
  • 'తెలంగాణ అన్నపూర్ణ' పథకం ద్వారా సన్నబియ్యం

14:22 October 15

  • రాష్ట్రంలో తెల్ల రేషన్‌ కార్డు ఉన్న కుటుంబాలకు కేసీఆర్‌ బీమా చేయిస్తాం
  • 93 లక్షల కుటుంబాలకు కేసీఆర్‌ బీమా ద్వారా లబ్ధి చేకూరుతుంది
  • కేసీఆర్‌ బీమా...ప్రతి ఇంటికి దీమా: కేసీఆర్‌

14:18 October 15

  • ఏటా 3 కోట్ల టన్నుల ధాన్యం పండిస్తున్నాం
  • వ్యవసాయరంగంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానానికి చేరుకుంది
  • తెలంగాణలో రైతుబంధు, రైతుబీమా పథకం తెచ్చాం
  • బీఆర్​ఎస్​నే మళ్లీ అధికారంలో వస్తుంది: కేసీఆర్‌

14:15 October 15

  • గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చే కార్యక్రమం కొనసాగుతుంది
  • గిరిజనులకు ఇచ్చిన అన్ని హామీలను భారాస ప్రభుత్వం అమలుచేసింది
  • భవిష్యత్‌లోనూ గిరిజనులకు మరిన్ని పథకాలు తెస్తాం
  • లంబాడీ తండాలు, గోండు గూడెలను పంచాయతీలు చేస్తాం
  • రాష్ట్రం ఏర్పడ్డ నాడు ఉన్న క్లిష్ట పరిస్థితులు ఉన్నాయి
  • క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొని రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిచింది
  • తలసరి ఆదాయం, విద్యుత్‌ వినియోగంలో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉంది
  • బీసీల్లో వృత్తి పనులు చేసుకునే వర్గాలకు సంక్షేమ పథకాలు కొనసాగిస్తాం

14:12 October 15

  • ఎన్నికల ప్రణాళికలో లేని వాటిని కూడా అమలు చేశాం: కేసీఆర్‌ కల్యాణలక్ష్మి పథకం ఎవరూ అడగకపోయినా అమలుచేశాం
  • ఎన్నికల ప్రణాళికలో లేనివాటినీ అమలుచేసిన ఘనత మాదే
  • రాష్ట్రంలో ప్రశాంత వాతావరణ పరిస్థితులు ఉన్నాయి: కేసీఆర్‌
  • దళితబంధు లాంటి పథకం దేశంలో ఎక్కడా లేదు: కేసీఆర్‌
  • దళితబంధును కొనసాగిస్తాం: కేసీఆర్‌

14:06 October 15

  • తెలంగాణ భవన్‌లో కేసీఆర్‌ మీడియా సమావేశం
  • కాసేపట్లో బీఆర్ఎస్ మ్యానిఫెస్టో ప్రకటించనున్న కేసీఆర్‌
  • రాష్ట్రం ఏర్పడినప్పుడు అగమ్యఘోచర పరిస్థితులు ఉండేవి: కేసీఆర్‌
  • కరెంట్‌, నీటి సౌకర్యాలు ఉండేవి కావు: సీఎం కేసీఆర్‌
  • మ్యానిఫెస్టోలో చెప్పని వాటిని కూడా అమలు చేశాం
  • 90 శాతం అమలు చేశాం

13:10 October 15

  • బీఆర్​ఎస్​ అభ్యర్థులకు బీఫారాలు అందిస్తున్న సీఎం కేసీఆర్‌

12:39 October 15

  • కాసేపట్లో కేసీఆర్‌ మీడియా సమావేశం
  • మీడియా సమావేశంలో బీఆర్​ఎస్ మ్యానిఫెస్టో ప్రకటించనున్న కేసీఆర్‌

12:31 October 15

  • ఇవాళ, రేపు బీఫారాలు అందిస్తాం..: కేసీఆర్‌
  • ఒక్కో అభ్యర్థికి రెండు బీఫారాలు అందిస్తాం..: కేసీఆర్‌

12:26 October 15

  • మన నాయకులపై గతంలో కొన్ని కేసులు పెట్టారు: కేసీఆర్‌
  • మనవాళ్లు గెలిచినా సాంకేతికంగా ఇబ్బంది పెడతారు: కేసీఆర్‌
  • వనమా వంటి నాయకుల విషయంలో అలా జరిగింది: కేసీఆర్‌
  • సందేహాలు ఉంటే మన న్యాయ బృందాన్ని సంప్రదించండి: కేసీఆర్‌
  • నామినేషన్ల విషయంలో అజాగ్రత్త వద్దు: సీఎం కేసీఆర్‌

12:21 October 15

  • బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే అభ్యర్థులతో సీఎం కేసీఆర్‌ భేటీ
  • కొన్నిచోట్ల మార్పులు చేర్పులు చేయాల్సి వచ్చింది: కేసీఆర్‌
  • వేములవాడలో వాస్తవానికి మార్చాల్సిన అవసరం లేదు: కేసీఆర్‌
  • న్యాయపరమైన అంశాల వల్ల వేములవాడలో మార్చాం: కేసీఆర్‌
  • మార్పులు, చేర్పులు అన్నీ సానుకూలంగా జరిగాయి: కేసీఆర్‌
  • ఎన్నికల వేళ కొన్ని కోపతాపాలు ఉంటాయి.. సహజమే..: కేసీఆర్‌
  • ఎన్నికల వేళ అభ్యర్థులకు ఓపిక, సంయమనం అవసరం: కేసీఆర్‌
  • అందరూ నాయకులను కలుపుకొని పోవాలి: సీఎం కేసీఆర్‌

12:13 October 15

  • బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే అభ్యర్థులతో సీఎం కేసీఆర్‌ భేటీ
  • తెలంగాణ భవన్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్
  • తెలంగాణ తల్లికి నివాళులు అర్పించిన కేసీఆర్‌

12:09 October 15

  • ప్రగతి భవన్‌ నుంచి తెలంగాణ భవన్‌కు బయలుదేరిన సీఎం కేసీఆర్
  • తెలంగాణ భవన్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్
  • తెలంగాణ తల్లికి నివాళులు అర్పించిన కేసీఆర్‌

10:21 October 15

LIVE UPDATES : బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే అభ్యర్థులతో సీఎం కేసీఆర్‌ భేటీ

  • మరికాసేపట్లో తెలంగాణ భవన్‌కు రానున్న సీఎం కేసీఆర్‌
  • బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జిలతో కేసీఆర్‌ భేటీ
  • పార్టీ అభ్యర్థులకు బీ ఫారాలు అందజేయనున్న కేసీఆర్‌
  • ఎన్నికల ప్రచారంపై అభ్యర్థులకు దిశానిర్దేశం చేయనున్న కేసీఆర్‌
  • మధ్యాహ్నం 12.15 గం.కు మ్యానిఫెస్టో ప్రకటించనున్న కేసీఆర్‌
  • తెలంగాణ భవన్‌కు చేరుకుంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు
  • తెలంగాణ భవన్‌కు చేరుకుంటున్న మంత్రులు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జులు
Last Updated : Oct 15, 2023, 5:16 PM IST

ABOUT THE AUTHOR

...view details