తెలంగాణ

telangana

ETV Bharat / state

బీఆర్ఎస్ లోక్​సభ ఎన్నికల ప్రణాళికలు - కార్యకర్తల చేతిలో స్టీరింగ్ - BRS Meetings Parliament Elections

BRS Lok Sabha Preparatory Meetings : లోక్‌సభ ఎన్నికల సన్నాహకాల్లో వస్తున్న అభిప్రాయాలను సమీక్షించుకుని పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకునేందుకు భారత రాష్ట్ర సమితి సిద్ధమవుతోంది. పార్టీ శ్రేణులకు శిక్షణా కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు. శాసనసభ ఎన్నికల ఫలితాలు, కారణాలను విశ్లేషించి భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేయనున్నారు.

BRS Focus on Lok Sabha Elections 2024
BRS Lok Sabha Preparatory Meetings

By ETV Bharat Telangana Team

Published : Jan 13, 2024, 9:36 AM IST

బీఆర్ఎస్ లోక్​సభ ఎన్నికల ప్రణాళికలు - కార్యకర్తల చేతిలో స్టీరింగ్

BRS Lok Sabha Preparatory Meetings : శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలై అధికారాన్ని కోల్పోయిన భారత రాష్ట్ర సమితి పార్టీ లోక్‌సభ కసరత్తును కొనసాగిస్తూనే పరాజయాన్ని సమీక్షించుకుంటోంది. నియోజకవర్గాల వారీగా లోక్‌సభ సన్నాహక సమావేశాలు నిర్వహిస్తోంది. ఆయా నియోజకవర్గాల పరిధిలోని ప్రజాప్రతినిధులు, మాజీలు, ముఖ్యనేతలను పిలిచి వారికి దిశానిర్ధేశం చేయడంతో పాటు వారి అభిప్రాయాలను సేకరిస్తోంది. కొందరికి సమావేశంలో మాట్లాడే అవకాశం కల్పిస్తుండగా మిగిలిన వారు లిఖితపూర్వకంగా తమ అభిప్రాయాలు, సూచనలు ఇస్తున్నారు.

'100 రోజుల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్​ పప్పులు ఉడకవు - భవిష్యత్ అంతా బీఆర్​ఎస్​దే'

BRS Focus on Lok Sabha Elections 2024: శుక్రవారం వరకు పది నియోజకవర్గాలకు చెందిన సన్నాహక సమావేశాలు జరిగాయి. ఇందులో వచ్చిన అభిప్రాయాలను క్రోడీకరించిన పార్టీ నాయకత్వం ఓటమికి ప్రధాన కారణాలను గుర్తించింది. పరిపాలన మీద దృష్టిపెట్టి పార్టీని పట్టించుకోలేదని, పార్టీలో సంస్థాగత నిర్మాణం సరిగ్గా జరగలేదని, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే కేంద్రంగా పార్టీని నడపడం సరికాదన్న కారణాలు వ్యక్తమయ్యాయి. పదేళ్లలో కార్యకర్తల ఆర్థిక పరిస్థితిని పార్టీ పట్టించుకోలేదని పథకాల అమలులో కార్యకర్త పాత్ర లేకుండా నేరుగా లబ్ధిదారునికే చేరడం వల్ల లింకు లేకుండా పోయిందని తెలిపారు.

ఫిబ్రవరి నెల నుంచి ప్రతిరోజు కేసీఆర్​ తెలంగాణ భవన్​కు వస్తారు : హరీశ్ ​రావు

BRS Focus on Parliament Elections 2024 : ఆరు లక్షలకు పైగా రేషన్ కార్డులు ప్రతి నియోజకవర్గంలో 15వేలకు పైగా కొత్త ఫించన్లు ఇచ్చినప్పటికీ ప్రజల్లోకి తీసుకెళ్లలేదని వందలో ఒక్కరికి రాకపోతే అదే నెగెటివ్ గా ప్రచారమైందన్నారు. దళితబంధు కొందరికే రావడంతో మిగతా వారు ఓపికపట్ట లేక అసహనం ప్రదర్శించి వ్యతిరేకమయ్యారని, ఇతర కులాల్లో కూడా వ్యతిరేకత వచ్చిందని పేర్కొన్నారు.

రైతుబంధు తీసుకున్న సామాన్య రైతు ఎక్కువ ఎకరాలు ఉన్న భూస్వామికి వస్తే ఒప్పుకోలేదని వీటితో పాటు కొన్ని ఇతర కారణాలు ఉన్నాయని తెలిపారు. పథకాల అమలుతో భవిష్యత్‌లో తలెత్తబోయే ప్రజల్లో వ్యతిరేక ప్రభావాన్ని సరిగ్గా అంచనా వేయలేకపోవడం వల్ల ఇలాంటి ఫలితాలు వచ్చినట్లు విశ్లేషణల్లో తేలిందని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వివరించారు. రోజు వారీ అభిప్రాయాలను ఎప్పటికప్పుడు పార్టీ అధ్యక్షులు కేసీఆర్​కు నివేదిస్తున్నారు. ఆయన వాటిని పరిశీలించి కొందరితో ఫోన్లో మాట్లాడుతున్నారు.

"నేతలు, కార్యకర్తల నుంచి వచ్చిన అభిప్రాయాలను విశ్లేషించి పార్టీ రాష్ట్ర నాయకత్వం కొత్త కార్యాచరణ అమలు చేస్తుంది. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని గ్రామస్థాయి మొదలు రాష్ట్ర స్థాయి వరకు పార్టీ కమిటీలు సమర్థంగా ఉండేలా చూస్తున్నాము. ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అత్యధిక సీట్లు గెలుస్తుంది." -జగదీశ్‌రెడ్డి, మాజీ మంత్రి

BRS Parliament Election Plan : ఇక నుంచి ఎమ్మెల్యే చుట్టూ పార్టీ తిరిగే విధానం ఉండబోదని పార్టీ చుట్టూ ఎమ్మెల్యే తిరిగే పద్ధతి ఉంటుందని కేటీఆర్ సమావేశంలో ప్రకటించారు. పార్టీ కార్యకర్తల బాగోగులు చూసుకుంటామని ఇందుకోసం ట్రస్ట్ ఏర్పాటు చేస్తామని సీనియర్ నేత హరీశ్‌రావు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టే తప్పుడు కేసులను ఎదుర్కొంటామని జిల్లాల్లో కూడా లీగల్ టీంలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. నేతలు, కార్యకర్తల నుంచి వచ్చిన అభిప్రాయాలను విశ్లేషించిన పార్టీ రాష్ట్ర నాయకత్వం ఇప్పటికే కొంత కార్యాచరణ అమలు దిశగా సిద్ధమైంది.

పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని గ్రామస్థాయి మొదలు రాష్ట్ర స్థాయి వరకు పార్టీ కమిటీలు సమర్థంగా ఉండేలా చూడాలని నిర్ణయించారు. అన్ని స్థాయిల కార్యకర్తలకు శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి పర్యవేక్షణలో పార్టీ సంస్థాగత బలోపేతం, శిక్షణ లాంటి కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తున్నారు. ఇప్పటి వరకు పది లోక్ సభనియోజకవర్గాలసన్నాహక సమావేశాలు పూర్తయ్యాయి. సంక్రాంతి అనంతరం మిలిగిన ఏడు సమావేశాలు నిర్వహిస్తాయి. 22 వ తేదీతో సమావేశాలు పూర్తవుతాయి. ఆ తర్వాత క్షేత్ర స్థాయిలో శాసనసభ నియోజకవర్గాల వారీగా కూడా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తారు.

రైతుబంధు అంశాన్ని ప్రభుత్వం పరిహాసం చేస్తోంది : మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి

తార్ ​మార్ తక్కర్ ​మార్ ​- మళ్లీ టీఆర్​ఎస్​గా మారనున్న బీఆర్ఎస్?

ABOUT THE AUTHOR

...view details