BRS Lok Sabha Preparatory Meetings : హ్యాట్రిక్‌పై కన్నేసి ఓటమి పాలైన భారత్ రాష్ట్ర సమితి, లోక్‌సభ ఎన్నికల కసరత్తు కొనసాగిస్తోంది. నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తోంది. ఆయా నియోజకవర్గాల పరిధిలోని ప్రజాప్రతినిధులు, మాజీలు, ముఖ్య నేతలను ఆహ్వానిస్తున్నారు. ఒక్కో శాసనసభ నియోజకవర్గం నుంచి వంద మందికి పైగా సన్నాహక సమావేశాలకు వస్తున్నారు.
ముఖ్య నేతలు వారికి దిశానిర్ధేశం చేయడంతో పాటు అభిప్రాయాలు తీసుకుంటున్నారు. ప్రతి రోజూ భోజన విరామం అనంతరం వారి నుంచి సూచనలు, సలహాలు తీసుకుంటున్నారు. ఒక్కో సమావేశంలో (BRS LokSabha Preparatory Meetings)20 నుంచి 40 మంది వరకు తమ అభిప్రాయాలు చెప్తున్నారు. ప్రధానంగా కార్యకర్తలు, ఉద్యమంలో కలిసి తిరిగిన వారిని అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోలేదని ఫిర్యాదులు వచ్చాయి. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల లబ్ధి నేరుగా అందిస్తుండడంతో పార్టీ, కార్యకర్తల ప్రమేయం లేకుండా పోయిందని అంటున్నారు.
పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తేనే హక్కులను కాపాడుకోగలం : హరీశ్ రావు
BRS Focus on Lok Sabha Elections 2024పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత్ రాష్ట్ర సమితిగా మార్చడంతో, తెలంగాణ అస్థిత్వాన్ని కోల్పోయే పరిస్థితి వచ్చిందని మరికొందరు పేర్కొన్నారు. వేదికపై కూర్చొన్న కొందరు నేతలు కూడా ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రెండు పడకల గదుల ఇళ్లు ఆశించిన మేర ఇవ్వకపోవడం, రుణమాఫీ అమలు జరగకపోవడంతో పాటు దళితబంధు, బీసీ బంధు లాంటి పథకాలు నష్టం చేశాయని నాయకులు చెబుతున్నారు.
ఇదే సమయంలో చేసిన పనులను సరిగ్గా చెప్పుకోకపోవడం, ప్రత్యర్థుల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టకపోవడం, పార్టీలోని గ్రూపు తగాదాలు ఓటమికి దారి తీశాయని అంటున్నారు. కొందరికే అన్ని పదవులు ఇవ్వడం ఇబ్బందికరంగా మారిందని చెప్తున్నారు. నేరుగా అభిప్రాయాలు చెప్పిన వారు కాకుండా మిగతా వారి నుంచి లిఖిత పూర్వకంగానూ సూచనలు, సలహాలు తీసుకుంటున్నారు. కొన్నింటిపై కేటీఆర్(KTR), హరీశ్‌రావు సహా సీనియర్ నేతలు అక్కడే స్పందిస్తున్నారు. అందులో భాగంగానే చిన్న చిన్న పొరపాట్లు జరిగాయని, ఇక నుంచి పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తామని చెప్తున్నారు.