తెలంగాణ

telangana

By ETV Bharat Telangana Team

Published : Jan 3, 2024, 10:47 AM IST

ETV Bharat / state

పార్లమెంట్ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్ - నేటి నుంచి సన్నాహక సమావేశాలు

BRS Lok Sabha Elections 2024 : శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలైన భారత్​ రాష్ట్ర సమితి ఇవాళ్టి నుంచి లోక్‌సభ ఎన్నికల కార్యాచరణను ప్రారంభించనుంది. తెలంగాణ భవన్‌ వేదికగా నేటి నుంచి ఆదిలాబాద్‌తో ప్రారంభించి నియోజకవర్గాల వారీ సన్నాహక సమావేశాలు జరగనున్నాయి. ముఖ్య నేతలతో సమావేశమై వారి అభిప్రాయాలు తీసుకొని పార్లమెంట్ ఎన్నికల కోసం కార్యాచరణ ఖరారు చేయనున్నారు. రెండు విడతల్లో జరగనున్న సమావేశాలను 21వ తేదీతో ముగించి గణతంత్ర దినోత్సవం తర్వాత క్షేత్రస్థాయి సమావేశాలు నిర్వహించేందుకు భారాస సిద్ధమవుతోంది.

BRS Review On Upcoming Lok Sabha Elections
BRS Lok Sabha Elections 2024

లోక్‌సభ ఎన్నికల కోసం భారత రాష్ట్ర సమితి సమాయత్తం

BRS Lok Sabha Elections 2024:లోక్‌సభ ఎన్నికల కోసం భారత్​ రాష్ట్ర సమితి సమాయత్తమవుతోంది. అందులో భాగంగా బుధవారం నుంచి నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు జరగనున్నాయి. ఆయా నియోజకవర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులు, మాజీలు, ముఖ్యనేతలతో ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారు. అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ భవన్ వేదికగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, సెక్రటరీ జనరల్ కేశవరావు, సీనియర్ నేతలు మధుసూధనాచారి, హరీష్ రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి తదితర ముఖ్యులు ఈ సమావేశాలు నిర్వహించనున్నారు.

BRS Parliament Elections 2024 : ఆయా లోక్ సభ నియోజకవర్గాల పరిధిలోని ముఖ్య నేతలందరినీ సమావేశాలకు ఆహ్వానించారు. నియోజకవర్గాలకు చెందిన ఎంపీలు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, జెడ్పీ ఛైర్మన్లు, మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్లు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ల మాజీ ఛైర్మన్లు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లు, జిల్లా పార్టీ అధ్యక్షులు ఇతర ముఖ్యనేతలు సమావేశాలకు హాజరవుతారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై సమావేశంలో చర్చిస్తారు. ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలైన నేపథ్యంలో దాన్ని అధిగమించి మరీ లోక్‌సభ ఎన్నికలకు నేతలు, శ్రేణులను సన్నద్ధం చేసే విషయమై దృష్టి సారిస్తారు.

లోక్​సభ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్ - న్యూ ఇయర్ తర్వాత కేసీఆర్ బాస్ వస్తారు

BRS Review On Upcoming Lok Sabha Elections :క్షేత్రస్థాయిలో నేతల అభిప్రాయాలను వినేందుకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. సమావేశంలో ముఖ్యనేతల అభిప్రాయాలు తీసుకుని పటిష్టమైన కార్యాచరణను రూపొందించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి పాలైన సీట్లపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. ఓటమికి గల కారణాలను విశ్లేషిస్తూనే లోటుపాట్లను సరిదిద్దుకొని ముందుకెళ్లే విషయమై చర్చించనున్నారు. నేటి నుంచి సన్నాహక సమావేశాల నేపథ్యంలో పార్టీ ముఖ్యులకు అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. కేటీఆర్ సహా కొందరు ముఖ్యులతో మాట్లాడిన ఆయన నేతలు, శ్రేణులకు వివరించాల్సిన అంశాలపై సూచనలు చేసినట్లు తెలిసింది.

న్యూయర్ నుంచి బీఆర్ఎస్ కొత్త వ్యూహాలు - లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటాలని సన్నాహాలు

నియోజకవర్గాల వారీగా సమావేశాలు ప్రారంభం : ఇవాళ్టి నుంచి రెండు విడతల్లో సన్నాహక సమావేశాలు జరగనున్నాయి. ఆదిలాబాద్ నియోజకవర్గంతో సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కరీంనగర్, చేవెళ్ల, పెద్దపల్లి, నిజామాబాద్, జహీరాబాద్, ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్, భువనగిరి నియోజకవర్గాల భేటీలు వరుసగా 12వ తేదీ వరకు జరగనున్నాయి. సంక్రాంతి అనంతరం తిరిగి 16వ తేదీన నల్గొండతో ప్రారంభమై నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, మెదక్, మల్కాజ్ గిరి నియోజకవర్గాల సమావేశాలు రోజుకొకటి చొప్పున జరగుతాయి.

21వ తేదీన సికింద్రాబాద్, హైదరాబాద్ నియోజకవర్గాలతో సన్నాహక సమావేశాలు ముగుస్తాయి. సన్నాహక సమావేశాల అనంతరం క్షేత్రస్థాయిలో బీఆర్​ఎస్​ సమావేశాలు జరగనున్నాయి. గణతంత్ర దినోత్సవం అనంతరం ఈ సమావేశాలు నిర్వహించేందుకు బీఆర్​ఎస్​ యంత్రాంగం కసరత్తు చేస్తోంది.

పారిశుద్ధ్య కార్మికులతో కలిసి భోజనం చేసిన కేటీఆర్

బీఆర్​ఎస్​ హయాంలో 50 లక్షల కోట్ల సంపద సృష్టించాం - కావాలని బద్నాం చేస్తున్నారు : కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details