BRS Legislature Meeting at Telangana Bhavan : నేడు బీఆర్ఎస్ (BRS) శాసనసభ పక్షం సమావేశం కానుంది. తెలంగాణ భవన్‌లో ఉదయం 9 గంటలకు ఎమ్మెల్యేలు సమావేశం కానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 39 మంది గులాబీ పార్టీ ఎమ్మెల్యేలుగా ఎన్నిక అయ్యారు. కేసీఆర్ ఆసుపత్రిలో ఉన్నందున మిగతా ఎమ్మెల్యేలు సమావేశానికి హాజరుకానున్నారు. భారత రాష్ట్ర సమితి శాసనసభాపక్ష నేతగా కేసీఆర్ను సమావేశంలో ఎన్నుకునే అవకాశం ఉందని తెలిసింది. అదేవిధంగా స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు సహకరించేలా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సమావేశం తర్వాత అందరూ కలిసి అసెంబ్లీకి వెళ్లి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
తెలంగాణ శాసనసభ ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఒవైసీ
ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఓవైసీ : ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 స్థానాల్లో గెలుపొంది అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ మినహా మిగతా గ్రామీణ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మరోవైపు రేపటి నుంచి శాసన సభ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఓవైసీ (Akbaruddin Owaisi) ఎన్నికయ్యారు.
ప్రొటెం స్పీకర్‌గా సభలో సీనియర్ శాసనసభ సభ్యుడు ఎవరైతే ఉంటారో వారే ఈ స్థానంలో ఉంటారు. అయితే ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన కేసీఆర్, ఆరుసార్లు ఎమ్మెల్యేలుగా ఎన్నికైన తలసాని శ్రీనివాస్ యాదవ్, దానం నాగేందర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. ఎంఐఎం నుంచి ఆరుసార్లు గెలుపొందిన అక్బరుద్దీన్ ఒవైసీ ఉన్నారు. కాంగ్రెస్ వైపు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరుసార్లు ఎన్నికై ఉన్నారు.