తెలంగాణ

telangana

ETV Bharat / state

BRS Leaders Fires on PM Modi : 'తెలంగాణకు ప్రధాని మోదీ కొత్తగా ఇచ్చిందేంటి..?' - పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్

BRS Leaders Fires on PM Modi : పాలమూరు ప్రజాగర్జన వేదికగా ప్రధాని నరేంద్రమోదీ చేసిన విమర్శలపై బీఆర్ఎస్​ తీవ్రస్థాయిలో మండిపడింది. మరోసారి ప్రధాని అవాస్తవాలు ప్రచారం చేశారన్న మంత్రులు.. విభజన హామీల్లో ఒకటైన గిరిజన వర్సిటీని తొమ్మిదేళ్ల తర్వాత ఇచ్చి.. అదేదో తమ గొప్పగా చెప్పుకోవడం ఏంటని ప్రశ్నించారు. బీఆర్ఎస్ స్టీరింగ్‌ కేసీఆర్ చేతిలో పదిలంగా ఉంటే.. బీజేపీ స్టీరింగ్‌ మాత్రం అదానీ చేతిలోకి వెళ్లిందని విమర్శించారు.

BRS Leaders Fires on PM Modi
BRS Leaders

By ETV Bharat Telangana Team

Published : Oct 2, 2023, 7:07 AM IST

BRS Leaders Fires on PM Modi 9 ఏళ్లలో కేంద్రం తెలంగాణకు చేసిందేమి లేదు BRS మంత్రులు

BRS Leaders Fires on PM Modi :మహబూబ్‌నగర్‌ పర్యటనలో పాలమూరు ప్రజాగర్జన(Praja Garjana Meeting) వేదికగా ప్రధాని నరేంద్రమోదీ(Narendra Modi) ఆరోపణలు, విమర్శలపై బీఆర్ఎస్​ దీటుగా బదులిచ్చింది. సామాజిక మాధ్యమం ఎక్స్‌లో స్పందించిన మంత్రి కేటీఆర్.. నమో అంటే నమ్మించి మోసం చేయడమేనని ఇది తెలంగాణ ప్రజలకు తెలుసన్నారు. తెలంగాణ ప్రజలు కాదు.. జాతీయస్థాయిలో దేశప్రజలు అధికార మార్పు కోరుకుంటున్నారని పేర్కొన్నారు.

Minister KTR Reaction on PM Modi Speech :బీఆర్ఎస్​ స్టీరింగ్ కేసీఆర్ చేతిలోనే పదిలంగా ఉందన్న కేటీఆర్‌.. భాజపా స్టీరింగ్ అదానీ చేతిలోకి వెళ్లిపోయిందని విమర్శించారు. కేంద్రప్రభుత్వం కిసాన్ సమ్మాన్(Kisan Samman) కింద ఇచ్చింది నామమాత్రమేనన్న మంత్రి.. చిన్నరాష్ట్రమైనప్పటికీ తెలంగాణ 70 లక్షల మంది రైతులకు 72 వేల కోట్లను నేరుగా ఖాతాల్లో వేసిందన్నారు. పెద్దపల్లిలో జరిగిన బహిరంగ సభలోనూ రైతు రుణమాఫీ(Rythu Runa Mafi) చేయలేదన్న ప్రధాని చేసిన విమర్శలను కేటీఆర్ తిప్పికొట్టారు.

'రాష్ట్రానికి గిరిజన విశ్వవిద్యాలయం, పసుపు బోర్డు' ప్రకటించిన ప్రధాని

Niranjan Reddy on PM Modi : ప్రధాని మోదీ మహబూబ్‌నగర్‌ సభలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి(Palamuru Rangareddy Lift Irrigation Project) జాతీయ హోదా ప్రకటించకపోవడం పాలమూరు ప్రజలను వంచించడమేనని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి(Niranjan Reddy) విమర్శించారు. కృష్ణా జలాలలో తెలంగాణ వాటా గురించిప్రధాని ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.

విభజన చట్టం హామీలను తుంగలో తొక్కిన బీజేపీ సర్కార్‌, ఎన్నికల ముంగిట గిరిజనులపై కపట ప్రేమ నటిస్తోందని మంత్రి సత్యవతి రాఠోడ్‌ విమర్శించారు. గిరిజన వర్సిటీ కోసం రాష్ట్ర ప్రభుత్వం 335 ఎకరాల స్థలాన్ని కేటాయించినా కాలయాపన చేస్తూ.. ఇప్పుడు గిరిజనుల ఓట్ల కోసం యూనివర్సిటీ ఏర్పాటును ప్రకటించారని మంత్రి ఆరోపించారు. ప్రధాని మోదీ తెలంగాణకు కొత్తగా చేసిందేమి లేదని 9ఏళ్ల క్రితమే గిరిజన విశ్వవిద్యాలయాన్ని మంజూరు చేశారని మంత్రి హరీశ్‌రావు గుర్తుచేశారు. తొమ్మిదేళ్లలో కృష్ణా జలాల కేటాయింపులు ఎందుకు పూర్తిచేయలేదని ప్రశ్నించారు.

BRS Leaders Reacts on PM Modi Speech in Mahabubnagar :ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలోనే రెండు రాష్ట్రాల్లో గిరిజన వర్సిటీ, పసుపు బోర్డులు ఏర్పాటు చేయాలని ఉందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ తెలిపారు. పదేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ మంజూరు చేస్తున్నట్లు ప్రధాని ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పాలమూరు జిల్లాలో అడుగుపెట్టిన ప్రధాని పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయహోదా ప్రకటించకపోవడం దారుణమని బీఆర్ఎస్​ ఎంపీ రంజిత్‌రెడ్డి విమర్శించారు.

KTR Fires on Modi in Twitter : "బరాబర్​ మాది కుటుంబపార్టీయే.. రాష్ట్రమే మా కుటుంబం"

PM Modi Palamuru Praja Garjana Public Meeting : 'తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు.. రాబోయేది చెప్పింది చేసే ప్రభుత్వం'

ABOUT THE AUTHOR

...view details