తెలంగాణ

telangana

ETV Bharat / state

BRS Leaders Fires on Governor Tamilisai : తెలంగాణ విషయంలో గవర్నర్‌ తమిళిసై వైఖరిలో మార్పు లేదు: మంత్రి హరీశ్‌రావు

BRS Leaders Fires on Governor Tamilisai : నామినేటెడ్ కోటా ఎమ్మెల్సీలకు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ పేర్లను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తిరస్కరించడాన్ని మంత్రి హరీశ్​రావు తప్పుబట్టారు. రాజకీయ నేపథ్యం ఉందని ఇద్దరు పేర్లను తిరస్కరించడం దారుణమన్నారు. రాజకీయ నేపథ్యం ఉందని తెలంగాణ ఉద్యమకారులను అవమానపరిచిన తమిళిసై.. తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా ఉంటూ నేరుగా గవర్నర్‌గా నియామకం కాలేదా అని ప్రశ్నించారు.

BRS Leaders Fires on Governor Tamilisai
BRS Leaders

By ETV Bharat Telangana Team

Published : Sep 25, 2023, 10:41 PM IST

Updated : Sep 26, 2023, 6:35 AM IST

BRS Leaders Fires on Governor Tamilisai : దాసోజు శ్రవణ్‌, కుర్రా సత్యనారాయణ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని గవర్నర్ తమిళిసైసౌందరరాజన్(Governor Tamilisai) తిరస్కరించడం దారుణమని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్​రావు అన్నారు. దశాబ్దాలుగా ప్రజాసేవలో ఉన్న అత్యంత వెనకబడిన వర్గాలకు చెందిన వారిద్దరూ.. బీఆర్ఎస్ సభ్యులుగా ఉన్నందునే అనర్హులనడం కరెక్ట్ కాదని మంత్రి వ్యాఖ్యానించారు. అలాంటప్పుడు తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా చేసిన తమిళిసై.. తెలంగాణ గవర్నర్‌గా ఎలా ఉంటారని మండిపడ్డారు. పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న వ్యక్తికి రాష్ట్ర గవర్నర్‌గా ఇవ్వచ్చా అని ప్రశ్నించారు.

Harish Rao Comments On Governor Tamilisai :సర్కారియా కమిషన్‌ ప్రతిపాదనల ప్రకారంగవర్నర్‌ పదవిలో తమిళిసై ఉండవద్దు కదా అని మంత్రి పేర్కొన్నారు. బీజేపీకి చెందిన గులాం అలీ ఖతానాను రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు పంపలేదా అన్నారు. రాష్ట్రపతి కోటాలో బీజేపీ నేతలు మహేశ్‌ జఠ్మలానీ, సోనాల్‌ మాన్‌సింగ్‌, రాంషఖల్‌, రాకేశ్‌ సిన్హా.. తదితరులను నియమించలేదా అని ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీలో ప్రత్యక్షంగా ఉన్న జితిన్‌ ప్రసాద్‌, గోపాల్‌ అర్జున్‌ బూర్జీ, చౌదరీ వీరేంద్ర సింగ్‌, రజనీకాంత్‌ మహేశ్వరీ, సాకేత్‌ మిశ్రా.. హన్స్‌రాజ్‌ విశ్వకర్మ.. ఇలా ఎంతో మందిని గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా నియమించారని హరీశ్​రావు తెలిపారు.

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒక విధానం.. కలిసి లేని రాష్ట్రాల్లో మరో విధానం అమలు చేస్తారా మంత్రి హరీశ్​రావు ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వానికి ఒక నీతి.. బీజేపీయేతర రాష్ట్రాలకు మరో నీతి ఉంటుందా అని మండిపడ్డారు. తెలంగాణ విషయంలో గవర్నర్‌ వైఖరిలో మార్పు లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం తప్పు చేసినప్పుడు గవర్నర్‌ సరిచేస్తే ఏమో అనుకోవచ్చు కానీ.. నీతి, నిజాయతీతో పని చేస్తున్నప్పుడు కూడా గవర్నర్‌ కక్ష పూరితంగా వ్యవహరించడం సరి కాదన్నారు. రెండుసార్లు బిల్లులను పంపినా ఆమోదించని గవర్నర్.. ఇప్పుడేమో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను తిరస్కరించడం మరీ దారుణమన్నారు. తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారని మంత్రి హరీశ్​రావు వ్యాఖ్యానించారు.

BRS Leaders Fires on Governor Tamilisai : 'తమిళిసైకి గవర్నర్‌గా కొనసాగే అర్హత లేదు.. వెంటనే రాజీనామా చేయాలి'

Srinivas Goud Fires On Governor Tamilisai :కేంద్రమంత్రి కిషన్​రెడ్డి కుట్ర వల్లే ఎమ్మెల్సీ నియామక దస్త్రాలను తెలంగాణ గవర్నర్(Telangana Governor) తిరస్కరించారని రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. మహబూబ్​నగర్ జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి మాట్లాడారు. కేబినెట్ ఆమోదం పొందిన ఎమ్మెల్సీ అభ్యర్థులు కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్ ఎలాంటి సామాజిక సేవ చేయలేదంటూ.. వాళ్లు రాజకీయ నాయకులని పేర్కొంటూ గవర్నర్ తిరస్కరించడాన్ని అయన తప్పుబట్టారు.

Srinivas Goud Comments on Governor Decision :తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా పని చేసిన తమిళిసై.. రాజకీయాల నుంచి నేరుగా గవర్నర్ కావొచ్చని, బీఆర్ఎస్ బడుగు, బలహీన వర్గాల వారిని చట్టసభలకు పంపితే తప్పా అని ప్రశ్నించారు. బీజేపీకి ఓ న్యాయం.. బీఆర్ఎస్​కు ఒక న్యాయమా అని ఆయన నిలదీశారు. గవర్నర్ చర్య సమాఖ్య స్ఫూర్తికి విఘాతమని మంత్రి పేర్కొన్నారు. గవర్నర్ చర్య వెనక కిషన్​రెడ్డి కుట్ర ఉందని ఆరోపించారు. బడుగు బలహీన వర్గాల మీద కిషన్​రెడ్డికి నిజంగా ప్రేమ ఉంటే రాష్ట్రానికి రానున్న ప్రధానితో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని ప్రకటింపజేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే కిషన్​రెడ్డిని బీసీల వ్యతిరేకిగా భావించాల్సి వస్తుందని అన్నారు. ప్రధాని బీసీ అయినా.. బీసీలకు తీరని అన్యాయం జరుగుతోందన్నారు. బీజేపీలో పని చేసి పదవులు పొందిన వాళ్లే సమాజ సేవకులా.. ఇతర పార్టీల్లోని వారు సేవకులు కాదా అని ఎదురుదాడికి దిగారు. కేంద్రమంత్రి కిషన్​రెడ్డి కక్షపూరితంగా తెలంగాణలోని బడుగు, బలహీన వర్గాల వారిని ఎదగనీయకుండా కుట్ర చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు.

Governor Tamilisai Rejected Nominated Quota MLCs Names : నామినేటెడ్‌ కోటా ఎమ్మెల్సీల పేర్లు తిరస్కరించిన గవర్నర్‌

Last Updated : Sep 26, 2023, 6:35 AM IST

ABOUT THE AUTHOR

...view details