తెలంగాణ

telangana

ETV Bharat / state

BRS on Congress Comments : 'రైతుల శత్రువు కాంగ్రెస్.. ఫ్రీ కరెంట్​పై ఆ పార్టీది దుర్మార్గపు ఆలోచన' - కాంగ్రెస్​పై బీఆర్​ఎస్ నేతలు ఫైర్

BRS on Congress Free Power Cancel Comments : రాష్ట్రంలో ఉచిత విద్యుత్ అవసరం లేదన్న కాంగ్రెస్‌ ప్రకటనపై బీఆర్​ఎస్ నేతలు మండిపడ్డారు. రైతులకు ఉచిత విద్యుత్‌ రద్దు చేయాలని ఆ పార్టీ దుర్మార్గపు ఆలోచన చేస్తోందని మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. హస్తం పార్టీ వ్యవసాయ, రైతు వ్యతిరేక ఆలోచనా విధానానికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. రైతులకు మొదటి శత్రువు కాంగ్రెస్‌ పార్టీ అని మంత్రి జగదీశ్​ రెడ్డి ఆరోపించారు.

BRS
BRS

By

Published : Jul 11, 2023, 1:12 PM IST

Updated : Jul 11, 2023, 1:41 PM IST

రైతులకు మొదటి శత్రువు కాంగ్రెస్‌ పార్టీ : జగదీశ్​ రెడ్డి

BRS Leaders fires on Congress :రాష్ట్ర రాజకీయాలలో చర్చనీయాంశంగా మారిన ఉచిత విద్యుత్తు అవసరం లేదన్న కాంగ్రెస్‌ ప్రకటనను బీఆర్​ఎస్ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆ ప్రకటనపై బీఆర్​ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ ​రెడ్డి, రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌, ఇతర నేతలు మండిపడ్డారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ పార్టీ రైతు వ్యతిరేక ఆలోచనా విధానాలపై ఇవాళ, రేపు బీఆర్​ఎస్ నిరసనలకు పిలుపునిచ్చింది. ప్రతి గ్రామంలో హస్తం పార్టీ దిష్టిబొమ్మలు దహనం చేయాలని కోరింది.

KTR on Congress Free Power Cancel Comments :రైతు వ్యతిరేక విధానాలను కాంగ్రెస్‌ మరోసారి బయటపెట్టిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. కర్షకులకు 24 గంటలు ఉచిత విద్యుత్ వద్దంటూ ప్రకటించిన కాంగ్రెస్‌ దుర్మార్గపు ఆలోచన చేస్తుందని దుయ్యబట్టారు. గతంలోనూ రైతులకు విద్యుత్‌ ఇవ్వకుండా గోస పెట్టారని విమర్శించారు. కాంగ్రెస్‌ ఆలోచనల్ని తెలంగాణ రైతులు, ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించాలన్నారు. హస్తం పార్టీ వ్యవసాయ, రైతు వ్యతిరేక ఆలోచనా విధానానికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. గ్రామాల్లో ఆ పార్టీ దిష్టి బొమ్మలను దహనం చేయాలని సూచించారు.

Jagadish Reddy fires on Congress : రైతులకు మొదటి శత్రువు కాంగ్రెస్‌ పార్టీ అని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్​ రెడ్డి ఆరోపించారు. దేశంలో వ్యవసాయ రంగాన్ని నాశనం చేసింది హస్తం పార్టీ అని మండిపడ్డారు. గతంలో రైతుల పట్ల కాంగ్రెస్‌ పార్టీ కక్షపూర్తిత పాలన చేసిందన్నారు. గతంలో రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్‌ హామీని ఆ పార్టీ విస్మరించిందని దుయ్యబట్టారు. వైఎస్‌ఆర్‌ హయాంలో 9 గంటల విద్యుత్‌ ఇవ్వట్లేదని రైతులు ధర్నా చేశారని జగదీశ్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఉచిత విద్యుత్​పై ఆ పార్టీ అధ్యక్షుడు చేసిన ప్రకటనపై రైతులతో కలిసి బీఆర్​ఎస్ శ్రేణులు నిరసనలు చేస్తారన్నారు.

'రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తే ఎందుకు ఏడుపు. ప్రజలకు ఏదీ ఉచితంగా ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్‌కు లేదు. కాంగ్రెస్‌ నేతలు రైతు వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారు. సాగుకు 3 గంటల ఉచిత విద్యుత్‌ చాలని మాట్లాడుతున్నారు. కాంగ్రెస్‌ నేతలకు ఇంట్లో 24 గంటల విద్యుత్‌ ఉండాలి. రైతులకు మాత్రం 24 గంటల విద్యుత్‌ ఉండవద్దా? కాంగ్రెస్‌ పార్టీ రైతుల పట్ల దుర్మార్గపు ఆలోచనలు చేస్తోంది. తెలంగాణ రైతులకు కాంగ్రెస్‌ పార్టీ సమాధానం చెప్పాలి. కాంగ్రెస్‌ మోసపూరిత వైఖరికి వ్యతిరేకంగా రైతులతో కలిసి నిరసనలు చేస్తాం.'-జగదీశ్​ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి

కాంగ్రెస్‌ రైతుబంధు, కాళేశ్వరం ప్రాజెక్టూ వద్దంటుంది : రైతులకు ఉచిత విద్యుత్​పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి... రానున్న రోజుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు, రైతుబంధు సైతం వద్దంటారని రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ వి. ప్రకాశ్ అన్నారు. పీసీసీ అధ్యక్షుడు వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికే ధరణి ఎత్తివేస్తామన్న రేవంత్.. ప్రకటనతో రైతులు అందరూ ఆందోళన వ్యక్తం చేశారని తెలిపారు. అజ్ఞానంతో రైతులకు మూడు గంటల విద్యుత్ సరఫరా సరిపోతుందన్నారని ఆక్షేపించిన ప్రకాశ్.. 24 గంటల ఉచిత విద్యుత్​తో దేశానికి అన్నం పెట్టేలా తెలంగాణ రైతులు ఎదిగారని వివరించారు.

ఇవీ చదవండి :

Last Updated : Jul 11, 2023, 1:41 PM IST

ABOUT THE AUTHOR

...view details