తెలంగాణ

telangana

ETV Bharat / state

'వంటగ్యాస్‌పై కేంద్రం బండ బాదుడు.. ఇదేనా మహిళా దినోత్సవానికి మోదీ కానుక?' - తెలంగాణ వార్తలు

BRS Protests Today and Tomorrow on Cooking Gas Hike: మోదీ సర్కార్‌ వంట గ్యాస్‌ ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరుస్తోందని విపక్షాలు మండిపడ్డాయి. కేంద్రం తీరుకు నిరసనగా ఇవాళ, రేపు పెద్దఎత్తున ఆందోళన చేపడతామని బీఆర్ఎస్ ప్రకటించింది. మహిళ దినోత్సవ కానుకగా బీజేపీ ప్రభుత్వం.. గ్యాస్‌ ధరల్ని పెంచిందా అని రాష్ట్ర మంత్రులు ప్రశ్నించారు. రాష్ట్ర బీజేపీ నేతలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి.. ధరల్ని తగ్గించేలా చేయాలని చూడాలని సీపీఎం డిమాండ్‌ చేసింది.

BRS Protests Today and Tomorrow on Cooking Gas Hike
BRS Protests Today and Tomorrow on Cooking Gas Hike

By

Published : Mar 2, 2023, 7:11 AM IST

BRS Protests Today and Tomorrow on Cooking Gas Hike: గ్యాస్ సిలిండర్ ధర పెంపును నిరసిస్తూ బీఆర్ఎస్ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనుంది. రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఆధ్వర్యంలో ఇవాళ, రేపు నిరసన తెలపనున్నారు. సిలిండర్ ధర పెంపుతో ప్రజల ఇబ్బందులను.. కేంద్రానికి తెలిసేలా విభిన్న రీతుల్లో కార్యక్రమాలు చేయాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

BRS Protests Today and Tomorrow in Telangana: ప్రజలను ముఖ్యంగా మహిళలను భాగస్వామ్యం చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులకు కేటీఆర్ దిశా నిర్దేశం చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఎక్కడికక్కడ పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. మహిళ దినోత్సవం కానుకగా మోదీ సిలిండరు ధరలు పెంచారన్న నినాదాన్ని ప్రజల్లోకి బీఆర్ఎస్ తీసుకెళ్లనుంది.

'రోడ్ల పక్కన చిన్న చిన్న హోటెల్ పెట్టుకొని, వ్యాపారాలు చేసుకునేవారు. దేశంలో వారికి రూ.50, రూ.350 పెంచడం అంటే చిన్న అంశంగా కావచ్చు. కానీ ఈ దేశంలో అదానీ, అంబానీలే కాదు. ఆప్​ కూడా పేదవాళ్లు ఉన్నారు. వాళ్ల బతుకుదెరువు కూడా ఈ పని మీదే వెలదీసున్నారనే విషయాన్ని బీజేపీ గ్రహిస్తే మంచిదచని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను'. -సత్యవతి రాథోడ్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి

పెంచిన ఎల్పీజీ సిలిండరు ధరలను వెంటనే తగ్గించాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎనిమిదేళ్ల మోదీ పాలనలో సిలిండర్‌ ధర రూ.745 పెరిగిందన్నారు. మహిళా దినోత్సవం కానుకగా ప్రధాని గ్యాస్‌ సిలిండర్‌ ధర పెంచారా..? అని మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌ ప్రశ్నించారు. బీజేపీ ‌అంటే ప్రజల జేబులు ఖాళీ చేసే పార్టీగా మారిందని మండిపడ్డారు.

ఎన్నికలు అయిపోగానే ధరలు పెంచటం కేంద్ర ప్రభుత్వానికి అలవాటుగా మారిందని విమర్శించారు. పెంచిన గ్యాస్‌ ధరల్ని ఉపసంహరించాలని బీజేపీ రాష్ట్ర నాయకులు కేంద్రంపై ఒత్తిడి తేవాలని సీపీఎం డిమాండ్‌ చేసింది. మోదీ సర్కారు తీరుతో సామాన్యుల నడ్డి విరుగుతోందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు.

'నిజంగానే ఈరోజు మోదీ ప్రభుత్వ పాలన భారతదేశంలో ప్రజలందరికీ కూడా ఒక గుదిబండ లాగా తయారయింది. ఆ రోజు రూ.410 ఇచ్చినా, గ్యాస్ సిలిండర్ ఉన్నప్పుడు రూ.40 సబ్సిడినే. ఈరోజు రూ.1155 ధర పెరిగిన కూడా సబ్సిడి రూ.40 ఇస్తున్నారు. అయితే రాను రాను ఈ సబ్సిడి కూడా ఎగ్గొట్టే ప్రయత్నం ఈరోజు బీజేపీ ప్రభుత్వం చేస్తుంది'. -సబితా ఇంద్రారెడ్డి, విద్యా శాఖ మంత్రి

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details