తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్ర హక్కుల కోసం కొట్లాడటం కాంగ్రెస్‌, బీజేపీ వల్ల కాదు : కేటీఆర్‌ - Parliament Elections

BRS Focus on Parliament Elections : లోటుపాట్లు సవరించుకొని తగిన కార్యాచరణతో లోక్‌సభ ఎన్నికలకు సిద్ధంకానున్నట్లు బీఆర్ఎస్ తెలిపింది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌పై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని హామీల అమలులో ఆలస్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు స్పష్టం చేసింది. కాంగ్రెస్, బీజేపీకి తెలంగాణ ప్రయోజనాలు పట్టవని రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడే పార్టీగా మద్దతివ్వాలని విజ్ఞప్తి చేసింది. నేతలు, శ్రేణుల అభిప్రాయాలకు అనుగుణంగానే అభ్యర్థిత్వాల ఎంపిక ఉంటుందని బీఆర్ఎస్ వెల్లడించింది.

KTR Meeting With Leaders on Parliament Elections
BRS Focus on Parliament Elections

By ETV Bharat Telangana Team

Published : Jan 4, 2024, 9:50 AM IST

రాష్ట్ర హక్కుల కోసం కొట్లాడటం కాంగ్రెస్‌, బీజేపీ వల్ల కాదు : కేటీఆర్‌

BRS Focus On Parliament Elections 2024 : శాసనసభ ఎన్నికల్లో ఓటమిపాలైన బీఆర్ఎస్లోక్‌సభ ఎన్నికల్లో పుంజుకునే కార్యాచరణపై దృష్టిపెట్టింది. పార్లమెంట్ ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో లోక్ సభ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలకు శ్రీకారం చుట్టింది. తొలుత ఆదిలాబాద్ లోక్‌సభ పరిధిలోని ప్రజా ప్రతినిధులు, మాజీలు, ముఖ్య నేతలతో తెలంగాణ భవన్‌లో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, సీనియర్ నేతలు హరీశ్‌రావు తదితరులు సమావేశమయ్యారు. శాసనసభ ఎన్నికల్లో ఓటమి కారణాలు, అభిప్రాయాలని నేతల నుంచి తీసుకున్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోతాడని ప్రజలు భావించలేదని నేతలు తెలిపారు.

లోక్​సభ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్ - న్యూ ఇయర్ తర్వాత కేసీఆర్ బాస్ వస్తారు

KTR Meeting With Leaders on Parliament Elections : ఓటమికి కుంగిపోవాల్సిన అవసరంలేదని కలసికట్టుగా పోరాడితే లోక్ సభ ఎన్నికల్లో గెలుపు సాధిస్తామని పార్టీ సీనియర్ నేతలు కేశవరావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కడియం శ్రీహరి సూచించారు. అభివృద్ధి, సంక్షేమపరంగా కేసీఆర్ సర్కారు ఎలాంటి లోటుచేయకపోయినా ఎందుకు ఓటమిపాలయ్యామో విశ్లేషించుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

బలమైన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ఉందని పార్టీకి గెలుపు, ఓటములు కొత్తకాదన్న హరీశ్‌రావు 2008, 2009 ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రానప్పటికీ తిరిగి పుంజుకున్న విషయాన్ని గుర్తుచేశారు. నేతలు, శ్రేణులు ఐక్యంగా పోరాడితే పార్టీకి పూర్వ వైభవం వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌పై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని, అది అనుకూలంగా మలుచుకొని ముందుకెళ్లాలని నేతలకు హరీష్ రావు సూచించారు.

న్యూయర్ నుంచి బీఆర్ఎస్ కొత్త వ్యూహాలు - లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటాలని సన్నాహాలు

''కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చి గెలిచింది. తెలంగాణ గళం, బలం, దళం పార్లమెంటులో చూడాలంటే బీఆర్ఎస్ గెలవాలి. తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడే ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమే. అందరి అభిప్రాయానికి అనుగుణంగా లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. కేసీఆర్‌ పూర్తిగా కోలుకున్నాక నేతలతో సమావేశం అవుతారు" - కేటీఆర్ , కార్యనిర్వాహక అధ్యక్షుడు

KTR About BRS Party Strategies In Parliament Elections: కృతిమ సానుకూలతని సృష్టించుకొని కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందన్న కేటీఆర్ నేతల అభిప్రాయాన్ని అధినేత దృష్టికి తీసుకెళ్తామని అవసరమైన మేరకు సవరణలు చేస్తామని, లోటుపాట్లు సరిదిద్దుతామని తెలిపారు. ఎన్నికల హామీలు అమలు చేయలేక కాంగ్రెస్ తెలంగాణను విఫల రాష్ట్రంగా చూపే ప్రయత్నం చేస్తోందని ఆక్షేపించారు.

వందరోజుల్లో గ్యారంటీలు అమలు చేయకపోతే కాంగ్రెస్‌ను బొంద పెడతామని హెచ్చరించారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు దిల్లీ నాయకత్వం కింద పనిచేసే వారని ఆ రెండు పార్టీలకు తెలంగాణ ప్రయోజనాలు పట్టవని కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడే ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని గుర్తుచేశారు. తెలంగాణ గళం, దళం, బలంగా కేసీఆర్ దండుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు.

ప్రజాపాలనకు వస్తున్న స్పందన చూసి బీఆర్ఎస్​కు నిద్ర పట్టడం లేదు : మంత్రి పొన్నం

పార్లమెంట్ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్ - నేటి నుంచి సన్నాహక సమావేశాలు

ABOUT THE AUTHOR

...view details