తెలంగాణ

telangana

ETV Bharat / state

న్యూయర్ నుంచి బీఆర్ఎస్ కొత్త వ్యూహాలు - లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటాలని సన్నాహాలు

BRS Focus on Parliament Elections 2024 : శాసనసభ ఎన్నికల్లో దెబ్బతిన్న బీఆర్ఎస్, లోక్‌సభ ఎన్నికల్లో మళ్లీ సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. తెలంగాణ తరపున ప్రశ్నించే గొంతుకగా, ప్రజల్లోకి వెళ్లి మెజార్టీ స్థానాలను దక్కించుకోవాలన్న ఆలోచనతో ఉంది. అసెంబ్లీ ఎన్నికల ఓటమిని విశ్లేషించుకుంటూనే, తదుపరి ఎన్నికల సన్నాహంపై అంతర్గతంగా కసరత్తు ప్రారంభించింది.

BRS on LokSabha Elections 2024
BRS Focus on Parliament Elections 2024

By ETV Bharat Telangana Team

Published : Dec 26, 2023, 7:15 AM IST

న్యూయర్ నుంచి బీఆర్ఎస్ కొత్త వ్యూహాలు - లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటాలని సన్నాహాలు

BRS Focus on Parliament Elections 2024: కొత్త ఏడాది నుంచి లోక్ సభ ఎన్నికల కోసం కార్యాచరణను బీఆర్ఎస్ ప్రారంభించనుంది. ముందుగా హైదరాబాద్‌లో నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించి ఆ తర్వాత క్షేత్రస్థాయికి వెళ్లనున్నారు. తెలంగాణ తరపున ప్రశ్నించే గొంతుకగా లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కోవాలని గులాబీ పార్టీ భావిస్తోంది.

బీఆర్​ఎస్​ హయాంలో 50 లక్షల కోట్ల సంపద సృష్టించాం - కావాలని బద్నాం చేస్తున్నారు : కేటీఆర్

BRS on LokSabha Elections 2024 : లోక్‌సభ ఎన్నికల్లో ఆధిపత్యమే లక్ష్యంగా జనవరిలో భారత రాష్ట్ర సమితి కార్యాచరణ ప్రారంభించనుంది. శాసనసభ ఎన్నికల్లో పార్టీ ఓటమిని విశ్లేషించుకుంటూనే పార్లమెంట్ ఎన్నికల దిశగా బీఆర్ఎస్ కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే అంతర్గత కసరత్తు కొనసాగిస్తున్న గులాబీ పార్టీ నియోజకవర్గాల వారీగా ముఖ్యనేతలతో సమావేశాలకు శ్రీకారం చుట్టింది. చేవెళ్ల నియోజకవర్గం నుంచి ఈ సమావేశాలను ప్రారంభించింది. చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని ముఖ్యనేతలతో సోమవారం సమావేశమైన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నేతలకు దిశానిర్దేశం చేశారు.

దేశానికి టార్చ్ బేరర్​గా మారిన తెలంగాణ జ్యోతిని ఆరిపోనివ్వం : కేటీఆర్‌

Chevella BRS MP Candidate Revanth Reddy 2024 : చేవెళ్ల పార్లమెంట్ గడ్డపై మరోసారి గులాబీ జెండా ఎగరాలని ఆకాంక్షించిన ఆయన గెలుపే లక్ష్యంగా పని చేయాలని శ్రేణులకు సూచించారు. ఆ దిశగా అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీకి దాదాపు 98వేల ఆధిక్యం ఉందన్న అదే స్థాయి, అంతే స్ఫూర్తితో లోక్ సభ ఎన్నికల్లో పనిచేయాలని చేవెళ్ల నేతలకు ఉద్బోధించారు.

KTR Guides BRS Leaders Over Lok Sabha Elections 2024: శాసనసభ నియోజకవర్గాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలన్న కేటీఆర్‌ అసెంబ్లీ ఎన్నికల ఓటమితో కుంగిపోవద్దని మనోధైర్యం నింపారు. ఓటమి పాలైన బీఆర్ఎస్ అభ్యర్థులే నియోజకవర్గ ఇంఛార్జులుగా కొనసాగుతారని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెడతామన్న ఆయన నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించాలని నేతలకు సూచించారు. రాష్ట్రంలో అనేక సంక్షేమ పధకాలు అమలు చేసిన ఘనత బీఆర్ఎస్​దే అన్నారు.

ఎంపీ రంజిత్‌ రెడ్డి ఏమీ చేయలేదని కాంగ్రెస్ చెప్పడం సరికాదన్నారు. జనవరి మూడు నుంచి చేవెళ్లతో ప్రారంభించి లోక్‌సభ నియోజకవర్గాల వారీగా హైదరాబాద్‌లో ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాలు ఏర్పాటు చేస్తారు. గణతంత్ర దినోత్సవం నాటికి వీటిని పూర్తి చేస్తారు. ఆ తర్వాత క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ సమావేశాలు నిర్వహిస్తారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఈ సమావేశాలకు హాజరు కానున్నారు.

లోక్‌సభ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్ - పోటీకి సిట్టింగ్, మాజీ ఎంపీలు, మాజీ మంత్రుల ఆసక్తి

ప్రజా పాలన తెచ్చుకోవడంలో సింగరేణి కార్మికుల పాత్ర ప్రధానం : మంత్రి పొంగులేటి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details