తెలంగాణ

telangana

ETV Bharat / state

BRS Focus On Telangana Assembly elections 2023 : అభ్యర్థుల ఎంపికపై బీఆర్​ఎస్ ఫోకస్.. హ్యాట్రికే టార్గెట్ - BRS Focus On Telangana Assembly elections 2023

Telangana Assembly elections 2023 : మూడోసారి అధికారపగ్గాలు చేపట్టి.. హ్యాట్రిక్‌ కొట్టాలని భావిస్తున్న బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై కసరత్తును వేగవంతం చేసింది. కొన్ని స్థానాల్లో మార్పులు-చేర్పులు అనివార్యమని భావిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ సర్వేల ఫలితాల ఆధారంగా దీనిపై ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రజావ్యతిరేకత ఇతర కారణాల ద్వారా సిట్టింగ్‌ అభ్యర్థిని మార్చాల్సి వస్తే.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపైనా దృష్టిసారించినట్లు తెలుస్తోంది.

BRS Focus On Assembly elections
BRS Focus On Assembly elections

By

Published : Jun 11, 2023, 7:11 AM IST

BRS Focus On Selection Of Assembly Election Candidates :రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంది. అన్ని పార్టీలు అసెంబ్లీ పోరుకు అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తున్నాయి. ఈ విషయంలో ముందుండే అధికార బీఆర్ఎస్ అభ్యర్థుల ఎంపిక కసరత్తును వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. 2018లో దాదాపుగా సిట్టింగ్‌లకే కేసీఆర్‌ అవకాశం కల్పించారు. ఈసారీ అదే ఫార్మూలాను అమలుచేస్తామని పార్టీ సమావేశాల్లో చెబుతున్నప్పటికీ.. కొన్నిచోట్ల మార్పులు ఖాయమని సమాచారం వినిపిస్తోంది. ఏదైనా కారణంతో సిట్టింగ్‌ అభ్యర్థుల్ని మార్చాల్సి వస్తే అక్కడ ప్రత్యామ్నాయం ఎవరనే విషయంపైనా ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

Telangana Assembly elections 2023 :పార్టీకి పట్టు ఉండి, ప్రత్యర్థులు బలహీనంగా ఉండటం వల్ల గెలిచే అవకాశం ఉన్నచోట.. సిటింగ్‌పై వ్యతిరేకత ఉన్నప్పటికీ తిరిగి వారికే టికెట్లు ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. ప్రత్యర్థి బలంగా ఉండి, ప్రస్తుత ఎమ్మెల్యే గెలిచే అవకాశం లేనిచోట మాత్రమే అభ్యర్థిని మార్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే పలు సర్వేల ద్వారా ముఖ్యమంత్రి అన్ని నియోజకవర్గాలపై ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. కానీ ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులపై స్పష్టత వచ్చే వరకు వేచి చూసే ధోరణితో ఉన్నట్లు సమాచారం.

BRS Focus On Telangana Assembly elections 2023 :వ్యతిరేకత లేకపోయినా ఇతరత్రా కారణాలతో ఒకరిద్దరు ఎమ్మెల్యేలను మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ నియోజకవర్గం నుంచిబీఆర్ఎస్ కొత్త అభ్యర్థిని రంగంలోకి దింపే అవకాశం ఉంది. ఇక్కడి నుంచి చెన్నమనేని రమేశ్‌ 2009 నుంచి వరుసగా గెలుపొందారు. కానీ ఆయన పౌరసత్వం సమస్యను పరిగణనలోకి తీసుకొని రానున్న ఎన్నికల్లో చెలిమడ లక్ష్మీనరసింహారావును పోటీ చేయించాలనిబీఆర్ఎస్ అధిష్ఠానం నిర్ణయించినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ఆయనను నియోజకవర్గంలో పనిచేసుకోమన్న సూచనల మేరకు నియోజకవర్గ పరిధిలో వైద్య శిబిరాలు, ఇతరత్రా కార్యక్రమాలతో గత కొంతకాలంగా ఆయన చురుగ్గా పనిచేస్తున్నారు. వయోభారం కారణంగా కూడా ఒకరిద్దరిని మార్చే అవకాశం ఉంది.

BRS Candidates for Telangana Assembly elections 2023 :ప్రజల్లో వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలు పనితీరు మార్చుకోవాలని పార్టీ సమావేశాల్లో కేసీఆర్‌ హెచ్చరించారు. కార్యకర్తలను కలుపుకొని వెళ్తూ, వివాదాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఇలాంటి చోట తరచూ సర్వేలు చేయిస్తూ ప్రత్యామ్నాయంపై కూడా దృష్టి పెట్టినట్లు సమాచారం. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో నలుగురు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో ఇద్దరు తరచూ వివాదాల్లో కూడా ఉంటున్నారు. వీటిలో ఓ నియోజకవర్గంపై దృష్టి పెట్టాలని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డికి అధిష్ఠానం సూచించినట్లు తెలిసింది. ఇక్కడ అభ్యర్థిని మార్చుతారా? లేదా అనే స్పష్టత ఇవ్వకపోయినా.. ముందు జాగ్రత్త చర్యగా పార్టీలో ఉన్న సమస్యలను పరిష్కరించి అందరినీ ఒక తాటిపైకి తీసుకురావడానికే పల్లాను వినియోగిస్తున్నట్లు సమాచారం. మిగిలిన నియోజకవర్గాలపై కూడా ఇలాంటి వ్యూహాలనే అనుసరిస్తున్నట్లు తెలిసింది.

BRS Focus On Selection Of Candidates For Assembly Elections : స్టేషన్‌ ఘన్‌పూర్‌లో ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరిల మధ్య విభేదాలున్నాయి. రాజయ్య కొన్ని వివాదాలను కూడా ఎదుర్కొన్నారు. ఇప్పటివరకు తుది నిర్ణయం తీసుకోకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో మార్చాల్సి వస్తే కడియం శ్రీహరి కుమార్తె వైపు అధిష్ఠానం మొగ్గు చూపే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఈ జిల్లాలోనే కాంగ్రెస్‌ అభ్యర్థి బలంగా ఉన్న ఓ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి గట్టి అభ్యర్థి లేకపోవడంతో పలు ప్రత్యామ్నాయాల గురించి ఆలోచిస్తున్నట్లు తెలిసింది.

CM KCR On Assembly Election 2023 : ఇక ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని ఓ ఎమ్మెల్యేపై అసంతృప్తి ఉన్నా అక్కడ అంతకంటే బలమైన అభ్యర్థి లేకపోవడం పార్టీకి పట్టు ఉన్నట్లు గుర్తించారు. దీనికి తోడూ ప్రత్యర్థి పార్టీలకు కూడా బలమైన అభ్యర్థులు లేకపోవడంతో ఆ ఎమ్మెల్యేనే కొనసాగించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఇటీవల వివాదాలను ఎదుర్కొన్నారు. ఇలాంటి నియోజకవర్గాల విషయంలో ఏం చేస్తారో చూడాల్సి ఉంది. పెద్దపల్లి జిల్లాలో పార్టీ వీడిన ఓ మాజీ ఎమ్మెల్యేను తిరిగి రప్పించి కీలకమైన ఓ నియోజకవర్గం నుంచి పోటీ చేయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇలా ప్రతి నియోజకవర్గ సమాచారాన్ని సర్వేల ద్వారా, నిఘా వర్గాల ద్వారా సేకరించి.. బలమైన అభ్యర్థులను రంగంలోకి దించే ప్రక్రియను అధికార పార్టీ ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details