తెలంగాణ

telangana

ETV Bharat / state

బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడిపై లుక్ అవుట్ నోటీసులు - యాక్సిడెంట్ కేసు అప్‌డేట్

BRS Ex MLA Shakeel Son Accident Case Update : బోధన్ మాజీ ఎమ్మెల్యే కుమారుడిపై పంజాగుట్ట పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. షకీల్ తనయుడు రాష్ డ్రైవింగ్ చేసి ప్రజా భవన్ వద్ద బారికేడ్లు ధ్వంసం చేసి హల్​చల్ సృష్టించిన విషయం తెలిసిందే.

Lookout Notices for BRS Ex MLA Shakeel Son
Lookout Notices

By ETV Bharat Telangana Team

Published : Dec 27, 2023, 11:02 AM IST

Updated : Dec 27, 2023, 12:03 PM IST

BRS Ex MLA Shakeel Son Accident Case Update :బోధన్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడి​పై పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు. అయితే షకీల్ కుమారుడు ముంబయి నుంచి దుబాయికి వెళ్లినట్లు సమాచారం. కేసు నుంచి తప్పించుకునేందుకు డ్రైవర్‌ను లొంగిపొమ్మని చెప్పినట్లు తెలుస్తోంది.

Lookout Notices for BRS Ex MLA Shakeel Son : నిందితుడిని నగరానికిరప్పించేందుకు పంజాగుట్ట పోలీసుల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నెల 23వ తేదీన అర్ధరాత్రి బేగంపేటలోనిప్రజాభవన్ వద్ద ఉన్న బారికేడ్లను బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు కారుతో ఢీకొట్టాడు. మద్యం మత్తులో ఉన్న ఆయన కారులో ప్రయాణిస్తూ ఢీకొట్టగా, పంజాగుట్ట పోలీసులు దీనిపై కేసు నమోదు చేశారు.

అసలు ఆ రాత్రి ఇదీ జరిగింది :ఈ నెల23వ తేదీన అర్ధరాత్రి 2.45 గంటల సమయంలో ప్రజాభవన్ ముందున్న బారికేడ్లను బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ తనయుడు సాహిల్ కారు ఢీకొట్టింది. దీంతో పంజాగుట్ట పోలీసులు వెంటనే స్పాట్​కు చేరుకున్నారు. కారు సాహిల్​దేనని, నడిపింది కూడా అతనేనని గుర్తించారు. బ్రీత్ ఎనలైజ్ టెస్ట్ కోసం అతనిని పంజాగుట్ట స్టేషన్​కు తీసుకెళ్లారు. తండ్రి షకీల్ అదే రోజు రాత్రి పోలీస్ స్టేషన్​కు వచ్చినట్లు సమాచారం. సాహిల్​ను కేసు నుంచి తప్పించి, అతని ఇంట్లో పని చేస్తున్న అబ్దుల్ ఆసిఫ్​ను నిందితుడిగా చేర్చే ప్రయత్నం చేసినట్లు తెలిసింది.

ప్రజాభవన్ ముందు జరిగిన కారు ప్రమాదంలో నిందుతుణ్ని తప్పిస్తున్నారా - పోలీసుల పాత్రపై అధికారులు అనుమానం

సీసీ టీవీ ఫుటేజీ పరిశీలన :ఇదిలా ఉండగా, బ్రీత్ ఎనలైజ్ టెస్ట్​కు తీసుకెళ్తున్న టైమ్​లో సాహిల్ పారిపోయాడని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే పోలీసులు కేసును తప్పుదోవ పట్టించారన్న విషయం సీపీ శ్రీనివాస్ రెడ్డి దృష్టికి వెళ్లింది. ఈ నేపథ్యంలో ఆయన అంతర్గత విచారణకు ఆదేశించారు. సీపీ ఆదేశాల మేరకు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ దర్యాప్తు చేశారు. ప్రజాభవన్ నుంచి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ దాకా ఉన్న సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించారు. అలాగే స్టేషన్​లోని కెమెరాల్లో సాహిల్​ను స్టేషన్​కు తీసుకొచ్చినట్లు గుర్తించారు.

నైట్ డ్యూటీలో ఉన్న పోలీసులు సాహిల్​ను తప్పించి అబ్దుల్ ఆసిఫ్​ను నిందితుడిగా చేర్చినట్లు డీసీపీకి అర్థమైంది. ఆ రోజు నైట్ డ్యూటీలో సీఐ దుర్గారావు, ఏఎస్ఐ విజయ్​కాంత్ ఉన్నట్లు ఆయన గుర్తించారు. విచారణ చేస్తున్న సమయంలో ఇన్​స్పెక్టర్ దుర్గారావు అస్వస్థతకు గురికాగా, అతన్ని కేర్ హాస్పిటల్​కు తరలించారు. తర్వాత ఇన్​స్పెక్టర్​ను సీపీ శ్రీనివాస్ రెడ్డి సస్పెండ్ చేశారు.

ఏ1గా సాహిల్, ఏ2గా అబ్దుల్ :నిందితులను కోర్టులో హాజరుపరిచే టైమ్​లో సాహిల్ పేరు ఎఫ్ఐఆర్​లో లేదని డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. అంతర్గత విచారణ తర్వాత రిమాండ్ రిపోర్టులో మాత్రం ఏ1గా సాహిల్​ను, ఏ2గా అబ్దుల్​ను చేర్చినట్లు వెల్లడించారు. ర్యాష్ డ్రైవింగ్ కింద కేసు నమోదు చేశామని , బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ కారు డ్రైవ్ చేసినట్లుగా గుర్తించామని చెప్పారు. సాహిల్ పరారీలో ఉన్నాడని, మిగిలినవారిని అదుపులోకి తీసుకుని రిమాండ్​కు తరలించామని డీసీపీ వివరించారు.

కారును ఢీకొట్టి టోల్​ప్లాజా క్యాబిన్​లోకి దూసుకెళ్లిన లారీ

చెరువులోకి దూసుకెళ్లిన కారు - ప్రాణాలతో బయటపడిన నలుగురు, ఒకరి దుర్మరణం

Last Updated : Dec 27, 2023, 12:03 PM IST

ABOUT THE AUTHOR

...view details