'బీఆర్ఎస్ ఎప్పటికీ సెక్యులర్ పార్టీనే - తల తెగిపడినా దిల్లీ నేతలకు తలవంచం' BRS Election Campaign Josh : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో.. బీఆర్ఎస్ ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. అగ్రనేతలు కేటీఆర్, మంత్రి హరీశ్‌రావు.. రోడ్‌షోల్లో పాల్గొంటూ విపక్షాల విమర్శలను తిప్పికొడుతూ.. పదేళ్ల తెలంగాణ ప్రగతిని వివరిస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో.. రోడ్‌షోలో పాల్గొన్న బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్.. కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్(CM KCR) పోటీ చేస్తున్నారంటే.. కలిసోచ్చే కాలానికి నడిసోచ్చే కుమారుడు వస్తున్నట్టే అని అన్నారు.
కాంగ్రెస్‌ను నమ్మితే మోసపోతాం - పాపమంటే గోసపడతాం : హరీశ్‌రావు
కామారెడ్డికి సాగు నీరు, మరింత అభివృద్ధి చేసేందుకే, కేసీఆర్ వస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే.. అది బీజేపీకే లబ్ది చేకూరుస్తుందన్నారు. నరేంద్ర మోదీని ఎదుర్కొనే సత్తా.. కేవలం బీఆర్ఎస్కు మాత్రమే ఉందన్నారు. బీజేపీతో(BJP) తామెన్నడూ పొత్తు పెట్టుకోలేదని స్పష్టం చేసిన కేటీఆర్.. గోషామహల్, కరీంనగర్, కోరుట్లలో కాంగ్రెస్ కావాలనే డమ్మీ అభ్యర్థులను పెట్టిందన్నారు. మైనార్టీల సంక్షేమం కోసం.. దేశంలోనే ఎక్కువగా ఖర్చు చేసిన ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ అని తెలిపారు.
యువతను రెచ్చగొట్టి, చిచ్చుపెట్టాలని చూస్తున్న రాజకీయ నిరుద్యోగి రాహుల్‌గాంధీ : కేటీఆర్
కాంగ్రెస్‌కు ఓటేస్తే అది బీజేపీకి లబ్ది చేకూరుస్తుంది. కామారెడ్డికి.. సాగు నీరు, మరింత అభివృద్ధి చేసేందుకే కేసీఆర్ వస్తున్నారు. డిసెంబర్‌లో అసైన్డ్ భూములున్న వారికి పట్టాలిస్తాం. బీజేపీతో మేమెన్నడు పొత్తు పెట్టుకోలేదు. తల తెగిపడినా దిల్లీకి తలవంచబోము. గోషామహల్, కరీంనగర్, కోరుట్లలో కాంగ్రెస్ కావాలనే డమ్మీ అభ్యర్థులను పెట్టింది. మైనార్టీల సంక్షేమం కోసం దేశంలోనే ఎక్కువగా ఖర్చు చేసిన ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్.-కేటీఆర్, రాష్ట్ర మంత్రి
Telangana Assembly Election 2023 : జీవితంలో బీఆర్ఎస్ ఎప్పుడూ బీజేపీతో పొత్తుపెట్టుకోలేదు. కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ.. మండల పరిషత్ ఎన్నికల్లో కానీ.. అసెంబ్లీ ఎన్నికల్లోకానీ.. పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కడైనా పొత్తు పెట్టుకున్నామా.. జీవితంలో ఎప్పుడూ పొత్తు పెట్టుకోలేదు. బీఆర్ఎస్ను భయపెట్టడానికీ, ధమ్కీ ఇవ్వడానికీ, దభాయించడానికీ.. దిల్లీ నుంచి పెద్ద నాయకులు నరేంద్రమోదీ(PM Modi), అమిత్‌షా వచ్చారు. బీఆర్ఎస్ పార్టీని, సీఎం కేసీఆర్‌ను అణచివేయడానికి ప్రయత్నించారు.
ఓటరన్నా ఈసారి నీ ఓటు రేటెంతా - నీ లీడర్ ఇచ్చే చీప్‌లిక్కర్ రేటంతేనా?
తెలంగాణ ప్రజలు ప్రేమాభిమానాలు చూపడంతో వెనక్కితగ్గారు. మేం ఎవరికీ భయపడే వాళ్లం కాదు. దిల్లీ వాళ్లకు భయపడం, ఇంకా ఎవరికీ కూడా భయపడం. మేము ఎప్పటికీ సెక్యూలర్‌గానే(Secular Party) ఉంటాం. దిల్లీ నుంచి వచ్చిన కాంగ్రెస్ నేతలు కాలుకు బలపం కట్టుకొని తిరిగినా.. తెలంగాణలో ఆ పార్టీ గెలిచే పరిస్థితులు లేవని.. మంత్రి హరీశ్‌రావు అన్నారు.
Minister Harishrao Election Campaign :మహబూబాబాద్, నర్సంపేట, పాలకుర్తి, చేర్యాల, ఆలేరు, భువనగిరిలో రోడ్‌షోలో పాల్గొన్న హరీశ్‌రావు.. మోటార్లకు మీటర్లు పెట్టలేదని.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రూ.25 వేల కోట్లు నిధులు ఇవ్వలేదన్నారు. కాంగ్రెసోళ్ల ఆరు గ్యారంటీలు నమ్మితే.. కర్ణాటక వాళ్లలాగా గోస పడుతామని ప్రజలను హెచ్చరించారు. సోమవారం ఉదయం రైతుల ఖాతాల్లో రైతుబంధు(Raithu Bandhu) డబ్బులు జమ చేస్తామని హరీశ్‌రావు తెలిపారు. డిసెంబర్ 3 తర్వాత మిగిలిన వారికి వడ్డీతో సహా.. రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు.
సమైక్య వాదులంతా ఒక్కటై తెలంగాణ మీద దండెత్తడానికి వస్తున్నారు : హరీశ్ రావు
తుది దశకు చేరుకున్న ఎన్నికల ప్రచారాలు - హాట్ హాట్‌గా ప్రధాన పార్టీల అగ్రనేతల ప్రసంగాలు