తెలంగాణ

telangana

ETV Bharat / state

Kishan Reddy On CM KCR : 'బీఆర్ఎస్ ప్రతినిధులు రాకపోతే.. పార్లమెంట్ ప్రారంభోత్సవం ఆగిపోతుందా' - కేసీఆర్​

Kishan Reddy On CM KCR : పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవంపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రతినిధులు రాకపోతే పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం ఆగిపోతుందానని ప్రశ్నించారు. సికింద్రాబాద్​లో జరిగిన కౌశల్​ మహోత్సవ్​ స్కిల్​ డెవలప్​మెంట్​ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

Kishan Reddy
Kishan Reddy

By

Published : May 26, 2023, 3:59 PM IST

Kishan Reddy On CM KCR : పోరాడి తెచ్చుకున్న తెలంగాణ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ వైఖరి కారణంగా నష్టపోతుందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ప్రజాప్రయోజనాలను కాపాడటంలో కేసీఆర్‌ పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. రాజకీయపరమైన స్వలాభం కోసం, ఘర్షణాత్మక వైఖరి ప్రదర్శించడమే తప్ప.. బీఆర్​ఎస్​ సర్కారు బాధ్యతల్ని నిర్వర్తించటం లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ చేస్తున్న అభివృద్ధి, ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలకు వచ్చేందుకు కేసీఆర్‌కు తీరిక ఉండదని ఆరోపించిన కిషన్‌రెడ్డి.. రాజకీయ స్వలాభం కోసం ఎక్కడికైనా వెళ్తారని దుయ్యబట్టారు. సికింద్రాబాద్​లో జరిగిన కౌశల్​ మహోత్సవ్​ స్కిల్​ డెవలప్​మెంట్​ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

బీఆర్​ఎస్​ ప్రతినిధులు రాకపోతే.. ప్రారంభం ఆగిపోతుందా : పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవంపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రతినిధులు రాకపోతే పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం ఆగిపోతుందానని ప్రశ్నించారు. కేంద్రం నిర్వహించే సమావేశాలకు కేసీఆర్ హాజరుకాకపోవటం బాధ్యతారాహిత్యమని.. సచివాలయం ప్రారంభోత్సవానికి గవర్నర్​ను ఎందుకు ఆహ్వానించలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ట్విన్ టవర్స్ శిలాఫలకంపై స్థానిక ఎంపీనైన నా పేరు కూడా లేదని.. బీఆర్ఎస్​తో నీతులు చెప్పించుకునే పరిస్థితుల్లో బీజేపీ లేదని తెలిపారు. రేపటి నీతిఅయోగ్ సమావేశానికి దూరంగా ఉండటం దుర్మార్గపు చర్య అని.. సీఎం కేసీఆర్ వైఖరిని ఎండగట్టారు.

"తెలంగాణ ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏ సమావేశానికి రాడు. ఈ 27వ తేదీన జరిగే నీతి ఆయోగ్ మీటింగ్​కు కూడా రావటం లేదని వర్తమానం అందింది. ఇది ఒక బాధ్యతారహితమైన చర్య. ఈ రకంగా భారత ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలకు సీఎం రాలేదు. వేల కోట్లు ఖర్చు చేసి నిర్మించిన ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి కేసీఆర్​ రారు. కాని మహారాష్ట్ర వెళ్లడానికి మాత్రం సమయం ఉంటుంది." - కిషన్​ రెడ్డి, కేంద్ర మంత్రి

జాబ్​ మేళాకు నిరుద్యోగులు హాజరు కావాలి : జూన్ 3, 4 తేదీల్లో హైదరాబాద్ నగరంలో జరిగే జాబ్ మేళాకు భారీగా నిరుద్యోగులు హాజరుకావాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. అనేక సంస్థలతో కలిసి ఈ మేళాను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. 8వ తరగతి పాసైన, ఫెయిలైన 18 సంవత్సరాలు నిండిన 35 సంవత్సరాలు మధ్యలో ఉన్నవారికి ఈ మేళాలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతోందని వివరించారు.

కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ప్రధానమంత్రి కౌశల్​ వికాస యోజన కార్యక్రమం రూపకల్పన చేసి.. స్కిల్​ ఇండియా పేరుతో యువతను స్కిల్స్​ వైపు నడిపించడం జరుగుతోందని స్పష్టం చేశారు. అందరూ ఐటీ ఉద్యోగాలు చేస్తే.. ఇళ్లల్లో మరి ప్లంబింగ్​ పనులు ఎవరు చేస్తారని తెలిపారు. జర్మనీ, జపాన్​ వంటి దేశాలు ఇక్కడి నుంచి స్కిల్స్​ గల యువతను తీసుకొని వెళుతున్నారని చెప్పారు.

బీఆర్ఎస్ ప్రతినిధులు రాకపోతే.. పార్లమెంట్ ప్రారంభోత్సవం ఆగిపోతుందా

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details