BRS Congress Debate on SC ST Declaration :ఇటీవల చేవెళ్ల ప్రజాగర్జన సభలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన.. ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ హాట్ టాపిక్‌గా మారింది. అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెెస్లు ఈ అంశంపై పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మంత్రి కేటీఆర్(KTR) ట్విటర్ వేదికగా ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్‌పై విమర్శలు గుప్పించారు. తాజాగా కేటీఆర్.. విమర్శలను పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) తిప్పికొట్టారు.
KTR on Congress SC ST Declaration :కాంగ్రెస్‌ది డిక్లరేషన్ సభ కాదు.. అధికారం రానే రాదనే ఫ్రస్ట్రేషన్ సభగా కేటీఆర్ అభివర్ణించారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లైనా ఎస్సీ, ఎస్టీలు వెనకబడి ఉన్నారంటే ప్రధాన కారణం కాంగ్రెస్సేనని కేటీఆర్ విమర్శించారు. దళిత, గిరిజన బిడ్డలకు కాంగ్రెస్ చేసిన దశాబ్దాల పాపమే.. ఆ పార్టీని మరో వందేళ్లయినా శాపంలా వెంటాడుతూనే ఉంటుందని ధ్వజమెత్తారు. కర్ణాటకలో నమ్మి ఓటేసిన ప్రజలను నట్టేట ముంచిన కాంగ్రెస్ పార్టీకి.. పాలించే ఎబిలిటీ లేదని, ప్రజల్లో క్రెడిబిలిటీ లేదని దుయ్యబట్టారు.
KTR Tweet on Congress SC ST Declaration కర్ణాటకలో కనీసం రేషన్ ఇవ్వలేని కాంగ్రెస్.. ఇక్కడికొచ్చి డిక్లరేషన్ ఇస్తే ఎవరు నమ్ముతారని కేటీఆర్ ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ పేరిట.విజన్ లేని కాంగ్రెస్ డజన్ హామీలు గాలీలోని దీపాలని చైతన్యానికి ప్రతీకైన తెలంగాణ ప్రజలకు తెలుసని అన్నారు. తెలంగాణ రాష్ట్రం అంటేనే.. దేశానికే ఓ పరిపాలనా పాఠంగా నిలిచిందని తెలిపారు. ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చని పార్టీ కాంగ్రెస్ అయితే.. ఇవ్వని హామీలెన్నో అమలు చేసిన ప్రభుత్వం తమదంటూ ట్వీట్ చేశారు.