BRS Chief KCR Video Message to BRS Workers and Fans : హైదరాబాద్ సోమాజీగూడ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR) బీఆర్ఎస్ కార్యకర్తలకు, అభిమానులకు విజ్ఞప్తి చేశారు. తనను చూసేందుకు దయచేసి యశోద ఆసుపత్రికి రావద్దని వేడుకున్నారు. కార్యకర్తలు వందలాదిగా రావడం వల్ల ఆసుపత్రిలోని వందలాది మంది రోగులకు ఇబ్బంది కలుగుతుందని అన్నారు. తాను ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నానని, త్వరలో సాధారణ స్థితికి చేరుకుని మీ మధ్యకు వస్తానని ఆసుపత్రిని వీడియో సందేశాన్ని(KCR Video Message) విడుదల చేశారు.
"దయచేసి సహకరించండి. ఇన్ఫెక్షన్ వస్తదని డాక్టర్లు నన్ను బయటకు పంపడం లేదు. ఎవరూ యశోద దవాఖానాకు రాకండి. తన ఆరోగ్యం పరిస్థితి గురించి తెలుసుకొని పరామర్శించడానికి యశోద ఆసుపత్రికి తరలివచ్చిన ప్రజలకు విజ్ఞప్తి. తాను ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. త్వరలో సాధారణ స్థితికి చేరుకుంటాను. అప్పటిదాకా అందరూ సంయమనం పాటించండి. ఎవరూ యశోద దవాఖానాకు రావొద్దు. ఎందుకంటే తనతో పాటు వందలాది మంది పేషెంట్లు ఆసుపత్రిలో ఉన్నారు. వారికి ఎలాంటి ఇబ్బంది కలుగకూడదు."-కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత
కేసీఆర్ తుంటి మార్పిడి శస్త్రచికిత్స విజయవంతం
కేసీఆర్ను పరామర్శించిన మంత్రులు దామోదర రాజనర్సింహా, శ్రీధర్ బాబు :మరోవైపు యశోద ఆసుపత్రి(Yashoda Hospital)లో చికిత్స పొందుతున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను పలువురు నేతలు పరామర్శించారు. మంత్రులు దామోదర రాజనర్సింహ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు కేసీఆర్ను కలిశారు. మాజీ ముఖ్యమంత్రి ఆరోగ్యంగా ఉన్నారని, మరో రెండు, మూడు రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని మంత్రి దామోదర రాజనర్సింహా చెప్పారు.