BRS Campaign in Telangana 2023 హ్యాట్రిక్ విజయమే లక్ష్యం.. ప్రచారంలో దూసుకుపోతున్న బీఆర్ఎస్.. BRS Campaign in Telangana For Hattrick Win 202 :అసెంబ్లీ ఎన్నికల సంగ్రామంలో గెలిచి అధికార పీఠం మరోసారి కైవసం చేసుకోనేలా బీఆర్ఎస్ కసరత్తులు ముమ్మరం చేసింది. ఎక్కడికక్కడ గులాబీ శ్రేణులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తోంది. రైతుబంధు, దళితబంధు వంటి సంక్షేమ పథకాలతో పాటు మేనిఫెస్టోను జనాల్లోకి విస్తృతంగా తీసుకెళ్తోంది. సంగారెడ్డి జిల్లా వట్‌పల్లిలో ఎమ్మెల్యే నిర్వహించిన అలయ్...బలయ్ కార్యక్రమానికి హాజరైన మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రాన్ని నిలబెట్టేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తుంటే.. ప్రతిపక్షాలు ఆగం చేయాలని చూస్తున్నాయని మండిపడ్డారు.
BRS MLA Candidates B Forms Issue : 10 మంది బీఆర్ఎస్ అభ్యర్థులకు ఇంకా అందని బీఫామ్.. ఆ స్థానాల్లో తొలగని ఉత్కంఠ
Telangana Assembly Elections 2023 : పొరపాటున కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కర్ణాటక మాదిరే.. కటిక చీకట్లు అలుముకుంటాయని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మండిపడ్డారు. వందేళ్ల వయసు దాటినా కాంగ్రెస్ పార్టీకి రాజకీయ పరిణతి లేదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ధ్వజమెత్తారు. రైతుల అకౌంట్లలో డబ్బులు పడుతుంటే కాంగ్రెస్‌కు కళ్లు మండుతున్నాయని నాగర్‌కర్నూల్‌లో ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి విమర్శించారు.
Harish Rao Interesting Comments : 'కేసీఆర్ మళ్లీ సీఎం కాకపోతే.. తెలంగాణ మరో అమరావతి అవుతుంది'
''తెలంగాణలో కాంగ్రెస్ చెప్పే మాటలను నమ్మవద్దు. కర్ణాటకలో 5 గంటలే కరెంటు ఇస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పారు. కానీ రైతులకు మూడు గంటలే కరెంటు వస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ ఏవీ అమలు కావు. కాంగ్రెస్ చెప్పే అబద్దాలను నమ్మవద్దు. ఎవరెన్ని కుట్రలు చేసినా హ్యాట్రిక్ కేసీఆర్‌దే..ప్రజల ఆశీర్వాదంతో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది.'' - హరీశ్‌రావు, ఆర్థిక శాఖ మంత్రి
BRS Campaign in Telangana Assembly Elections 2023 :అభివృద్ధి, సంక్షేమంలో సికింద్రాబాద్‌ను అగ్రస్థానంలో నిలుపుతున్నామని డిప్యూటీ స్పీకర్ పద్మారావు వెల్లడించారు. మేడ్చల్ పరిధిలో బీఆర్ఎస్ చేరికల సందర్భంగా మంత్రి మల్లారెడ్డి ఓ వృద్ధురాలిని ఒడిలో కూర్చోబెట్టుకున్నారు. మరోవైపు.. ప్లేట్లు, గ్లాసులు పంచి సేవ చేసినట్లు చెప్పుకుంటున్నారని మైనంపల్లి హన్మంతరావుపై పద్మాదేవేందర్‌రెడ్డి విమర్శించారు. ముదిరాజ్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేశ్.. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ప్రగతి సాగుతోందని వివరించారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్‌లో ప్రచారం నిర్వహించిన హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్ కుమార్ మహిళలతో కలిసి కోలాటాలాడారు. ఇల్లెందు నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే హరిప్రియ బీఆర్ఎస్మేనిఫెస్టో అంశాలను వివరించారు.
BRS Campaign in Telangana 2023 : ప్రచారంలో కారు జోరు.. ప్రజల్లో జోష్ నింపుతున్న ముగ్గురు నాయకులు
Harish Rao on Assembly Elections : బీఆర్ఎస్ స్కీమ్స్ అన్నీ సూపర్ హిట్.. ఎవరెన్ని కుట్రలు చేసినా హ్యాట్రిక్ కేసీఆర్‌దే : హరీశ్‌రావు