BRS Campaign in Telangana 2023 : కర్ణాటక నుంచి కాంగ్రెస్ నాయకులు, గుజరాత్ నుంచి బీజేపీ నేతలు డబ్బు మూటలతో వస్తున్నారని.. వారి కుట్రలను తిప్పికొట్టాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపునిచ్చారు. దుబ్బాక భారత రాష్ట్ర సమితి అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డికి మద్దతుగా దౌల్తాబాద్‌లో ఆయన రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా విపక్షాలపై విమర్శలు గుప్పించిన కేటీఆర్ (Minister KTR).. హస్తం పార్టీకి ఓటేస్తే రాష్ట్రం మళ్లీ అంధకారమవుతుందని అన్నారు.
"ఈ ఎన్నిక తెలంగాణ తలరాతను మారుస్తుంది. ఎవరి చేతిలో తెలంగాణ సురక్షితంగా ఉంటుందో ఆలోచించి ఓటు వేయాలి. మోసగాళ్లు చెబుతోంది నమ్మొద్దు. మీ ముందు కనిపిస్తున్న అభివృద్ధిని చూడండి. బాగా ఆలోచించి ఓటు వేయండి. ఆగమై ఎవరికో ఓటు వేయద్దు." - కేటీఆర్, మంత్రి, బీఆర్ఎస్ కార్యానిర్వాహక అధ్యక్షుడు
BRS Aiming For Hattrick Win in Telangana 2023 : ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సుడిగాలి పర్యటనలు చేస్తూ ఓట్లు అభ్యర్థించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో అశ్వారావుపేట బీఆర్ఎస్ అభ్యర్థి.. మెచ్చా నాగేశ్వరరావు ప్రచారం చేపట్టారు. పినపాక మండలంలో రేగా కాంతారావు ఇంటింటికి తిరుగుతూ తనను గెలిపించాలని కోరారు. ములుగు జిల్లా మల్లంపల్లిలో భారత రాష్ట్ర సమితి అభ్యర్థి బడే నాగజ్యోతి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
రైతుబంధు వంటి సంక్షేమ పథకాలు, రైతుల జీవితాల్లో వెలుగులు నింపాయి : కేసీఆర్
భూపాలపల్లి, పరకాలలో జరిగిన ముస్లిం, మైనార్టీల ఆత్మీయ సమ్మేళానానికి.. హోం మంత్రి మహమూద్ అలీ (Home Minister Mahmood Ali), మాజీ మంత్రి బసవరాజు సారయ్య హాజరయ్యారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని వారు కోరారు. వరంగల్ జిల్లా గురిజాల గ్రామంలో నర్సంపేట బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి.. ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు.
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలో భారత్ రాష్ట్ర సమితి అభ్యర్థి ఎమ్మెల్యే గాదరి కిషోర్ సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రచారం నిర్వహించారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలో.. పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఇంటింటి ప్రచారం చేశారు. సిద్దిపేట జిల్లా మనోహరాబాద్ మండలంలో సీఎం కేసీఆర్‌కు మద్దతుగా.. బీఆర్ఎస్ నాయకుడు ఒంటేరు ప్రతాప్‌రెడ్డి రోడ్ షో నిర్వహించారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం పరిధిలోని మోపాల్ మండలంలో గులాబీ పార్టీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్దన్.. ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు.
Telangana Assembly Elections 2023: నిజామాబాద్ జిల్లా మోస్ర మండలంలో సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. బోధన్ అభ్యర్థి షకీల్ రెంజల్ మండలంలో ఏర్పాటు చేసిన ప్రచారంలో పాల్గొన్నారు. నిజామాబాద్ నగరానికి చెందిన వివిధ పార్టీల కార్యకర్తలు ఎమ్మెల్సీ కవిత సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్ మండలంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి.. ప్రచారం నిర్వహించారు.